TikTok తో సహా 59 ప్రముఖ చైనీస్ మొబైల్ యాప్స్ పైన నిషేధించిన ప్రభుత్వం

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 29 Jun 2020
HIGHLIGHTS

ఇండియన్ ఇంటెలిజెన్స్ ముందు నుండే హెచ్చరిస్తూ వచ్చిన 59 చైనా యాప్స్ పైన ఎట్టకేలకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.

చైనాకి సంభందించిన 59 Appsని భారతదేశంలో పూర్తిగా నిషేధిస్తునట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది.

TikTok తో సహా 59 ప్రముఖ చైనీస్ మొబైల్ యాప్స్ పైన నిషేధించిన ప్రభుత్వం

#IBMCodePatterns, a developer’s best friend.

#IBMCodePatterns provide complete solutions to problems that developers face every day. They leverage multiple technologies, products, or services to solve issues across multiple industries.

Click here to know more

Advertisements

ఇండియన్ ఇంటెలిజెన్స్ ముందు నుండే హెచ్చరిస్తూ వచ్చిన 59 చైనా యాప్స్ పైన ఎట్టకేలకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. చైనాకి సంభందించిన 59 Appsని భారతదేశంలో పూర్తిగా నిషేధిస్తునట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ 59 యాప్స్ లో భారతదేశంలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన యాప్స్ అయినటువంటి, TikTok, Vault-Hide, Vigo Video, Bigo Live, Weibo WeChat, SHAREit, UC News, UC Browser BeautyPlus, Xender, ClubFactory, మరియు Helo వంటి ప్రముఖ యాప్స్ తో పాటు మరికొన్ని ఫేమస్ యాప్స్ వున్నాయి.      

ముందుగా మేము నివేధించిన విధంగా,  భారత్, చైనా మధ్య చెలరేగిన సరిహద్దు వివాదం తరువాత, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చెరుకోగా, భారతీయుల డేటా కూడా పైన చైనా నిఘా పెట్టినట్లు, దాని ద్వారా భారతీయుల డేటా చిక్కులో పడేఅవకాశం ఉందని, భారత నిఘా సంస్థలు హెచ్చరించడమే కాకుండా,  దీని మీద దృష్టిసారించిన భారత భద్రతా సంస్థలు, ఇలాంటి సమస్యల వాటిల్లే అనుమానమున్న 59 యాప్‌లను గుర్తించి,  చైనాతో సంభంధాలను కలిగివున్నఈ 59 Mobile Apps ను బ్లాక్ చేయాలని లేదా ఈ యాప్‌లను ఉపయోగించవద్దని భారతీయులకు సూచించాలని Indian Intelligence Agencies  ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.

ఈ 59 Chinese Mobile Apps ఉపయోగించడం సురక్షితం కాదని ఏజెన్సీలు వాదించాయి. ఈ యాప్స్ దేశం నుండి భారతీయుల డేటాను పెద్ద ఎత్తున చేరవేస్తునట్లు తెలిపాయి. చైనీస్ డెవలపర్లు లేదా చైనీస్ లింక్‌లతో అభివృద్ధి చేసిన ఈ యాప్స్ స్పైవేర్ లేదా ఇతర హానికరమైన వస్తువులుగా ఉపయోగించవచ్చని  సూచించబడింది. ఈ అభ్యర్ధనల తరువాత భారత ప్రభుత్వం అనూహ్యంగా ఈరోజు ఈ 59 చైనా యాప్స్ ని నిషేదిస్తునట్లు ప్రకటించింది.      

ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన 59 Chinese Mobile Apps

చైనాకు సంబంధించిన యాప్స్ గా చెబుతున్న ఆ 59 చైనా మొబైల్ యాప్స్ ఇవే

TikTok, Shareit, Kwai, UC Browser, Baidu map, Shein, Clash of Kings, DU battery saver, Helo, Likee, YouCam makeup, Mi Community, CM Browers, Virus Cleaner, APUS Browser, ROMWE, Club Factory, Newsdog, Beutry Plus, WeChat,

UC News, QQ Mail, Weibo, Xender, QQ Music, QQ Newsfeed, Bigo Live, SelfieCity, Mail Master, Parallel Space, Mi Video Call — Xiaomi, WeSync, ES File Explorer, Viva Video — QU Video Inc, Meitu,

 Vigo Video, New Video Status, DU Recorder, Vault- Hide, Cache Cleaner DU App studio, DU Cleaner, DU Browser, Hago Play With New Friends,

Cam Scanner, Clean Master — Cheetah Mobile, Wonder Camera, Photo Wonder, QQ Player, We Meet, Sweet Selfie, Baidu Translate, Vmate, QQ International, QQ Security Center, QQ Launcher, U Video, V fly Status Video, Mobile Legends, మరియు DU Privacy।

logo
Raja Pullagura

Web Title: Indian government banned 59 Chinese mobile apps, including TikTok

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status