2019 సంవత్సరం గూగుల్ ప్లే స్టోర్ లో పరిచయం చేయబడిన కొన్ని యాప్స్, యూజర్లకు నష్టం కలిగించే Virus లను కలిగివున్నట్లు గుర్తించబడ్డాయి. ఆశ్చర్యకరంగా, ఇవన్నీ కూడా Camera Apps కావడం మరియు ఈ యాప్స్ వైరస్ లను కలిగివున్నట్లు గుర్తించబడ్డాయి.ఈ కెమెరా యాప్స్ దాదాపుగా అన్నికూడా 2019 మధ్యలో పబ్లిష్ చెయ్యబడ్డాయి. Goolge Play Store నుండి ఇటివంటి ఇబ్బందికర 36 Camera Apps ను Google తొలగించింది.
Survey
✅ Thank you for completing the survey!
ఈ యాప్స్, వినియోగదారులకు Free Service ఆఫర్ చేయడానికి ప్రజలకు అధికమైన Ads చూపుతున్నాయి. ఒక రీసెర్చ్ పేపర్ వీటిపైన ఒక నివేదికను ప్రచురించిన తరువాత గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ లో ఎక్కువ భాగం సెల్ఫీలు మరియు బ్యూటీ సెల్ఫీల యాప్స్ కావడం విశేషం.వీటితో పాటు, ప్రజలు ఈ యాప్స్ లో మాల్వేర్ ప్రకటనలను కూడా చూశారు. లక్షలాది మంది ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ల విషయం వైట్ ఆప్స్ నివేదించగా, ZDNet మొదట ఈ నివేదికను ప్రచురించింది. ఆశ్చర్యకరంగా, వీటిలో చాలా యాప్స్ ను ఒకే డెవలపర్ గ్రూప్ నిర్మించినట్లు ఈ నివేదిక కనుగొంది.
వినియోగదారులు ఈ యాప్స్ ను UnInstall చేయడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే, ఒక్కసారి ఫోన్‌లో ఈ యాప్స్ Install చేసిన తర్వాత అవి Skin నుండి అదృశ్యమవుతాయి. కాబట్టి, మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ 36 ఆండ్రాయిడ్ యాప్‌లలో దేనినైనా డౌన్‌లోడ్ చేసి ఉంటే, వాటిని వెంటనే మీ ఫోన్ నుండి తొలగించడం చాలా ముఖ్యం.
Yoroko Camera app
ఇది కెమెరా App. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి 1 లక్ష కన్నా ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది.
Solu Camera app
ఈ యాప్ 5 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ చేయబడింది. ఇది కూడా కెమెరా అప్లికేషన్.
Lite Beauty Camera app
ఈ యాప్ ఏకంగా 1 మిలియన్ కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లు నమోదుచేసింది. ఇప్పుడు Google Play స్టోర్ నుండి తొలగించబడ్డాయి.
Beauty & Filters Camera app
ఈ యాప్ కూడా 10 లక్షలకు పైగా డౌన్‌లోడ్ చేయబడింది.
Photo Collage & Beauty app
1 లక్షకు పైగా డౌన్‌లోడ్‌లతో ఫోటో కోలాజ్ & బ్యూటీ యాప్ కొనుగొనబడింది
Beauty Camera Selfie app
5 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లతో బ్యూటీ కెమెరా సెల్ఫీ యాప్ కొనుగొనబడింది
50,000 కి పైగా డౌన్‌లోడ్‌లతో పాండ్ సెల్ఫ్ బ్యూటీ కెమెరా యాప్ కొనుగొనబడింది
Catoon Photo Editor & Selfie Beauty Camera app
కార్టూన్ ఫోటో ఎడిటర్ &సెల్ఫీ బ్యూటీ కెమెరా యాప్ అత్యధికంగా 10 మిలియన్లకు(1కోటి) పైగా డౌన్‌లోడ్‌లతో కొనుగొనబడింది
Benbu Selife Beauty camera app
10 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లను దాటిన బేంబూ సెల్ఫీ బ్యూటీ కెమెరా యాప్
గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించబడిన మరో 26 యాప్స్ కూడా ఉన్నాయి. కేవలం మూడు వారాల్లోనే 500,000 మందికి పైగా వినియోగదారులు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.