ఫేస్ బుక్ లో కొత్తగా “DisLike” ఫీచర్

ఫేస్ బుక్ లో కొత్తగా “DisLike” ఫీచర్
HIGHLIGHTS

ఫేస్ బుక్ ceo మార్క్ ఈ విషయం వెల్లడించారు

ఫేస్ బుక్ ఎట్టకేలకు 'dislike' బటన్ పై పనిచేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే ఇది అందరికీ రానుంది. టౌన్ హాల్ ప్రశ్న – జవాబు సెషన్ లో సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఈ విషయం పై స్పందించారు.

దీని పై మార్క్ మాట్లాడిన మాటలు…

"ఎప్పటి నుండో యూసర్స్ ఈ ఫీచర్ ను అడుగుతున్నారు, సో ప్రస్తుతం దీనిపై వర్క్ చేస్తున్నాం. ఇది reddit కమ్యునిటీ లో ఉన్న అప్ vote, డౌన్ vote లా పనిచేయదు."

"కొన్ని విషయాలలో ఫేస్ బుక్ స్టేటస్ లకు like బటన్ సరైనది కాదు. for eg ఫేమిలీ మెంబర్స్ మరణాలు, అనుకోని పరిస్థితిలు ఎదుర్కొన్నప్పుడు.. dislike బటన్ అవసరం ఉంటుంది."

"గత సంవత్సరం టౌన్ హాల్ మీటింగ్ లో dislike బటన్ పై స్పందించటానికి ముందుకు వచ్చాము కాని, దానిని అప్పటికీ అమలు చేద్దాము అని కన్విన్స్ కాలేదు, కారణం ఇది నేగటివిటీ ను spread చేసి ఇతరలను హర్ట్ చేస్తుంది." అని అన్నారు.

ప్రస్తుతానికి అయితే dislike బటన్ ఫీచర్ మెసెంజర్ లో స్టికర్ రూపంలో ఉంది. అలాగే ఈ ఫీచర్ ఎలా ఉంటుంది, పేరు ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం తెలపలేదు మార్క్.

 

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo