ఫేస్ బుక్ లో లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఫీచర్

Updated on 06-Aug-2015

ఫేస్ బుక్ లో మూవీ స్టార్స్ athletes, musicians, పొలిటిషియన్స్ మరియు ఇతర ప్రభావితముచేసేవారి ని లైవ్ స్ట్రిమిమింగ్ విడియోలు పోస్ట్ చేసేందుకు అనుమతి ఇస్తుంది అని వెల్లడించింది.

ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ ఫేస్ బుక్ లోని తమ ఫాలోవర్స్ కు మరింత దగ్గర అయ్యేందుకు ఎప్పటి విషయాలు అప్పుడు తెలియజేయటానికి బాగా ప్రొమొటింగ్ అవుతాయి. లైవ్ వీడియోను స్టార్ట్ చేస్తే చాలు ఫాలోవర్స్ న్యూస్ ఫీడ్ లో కనిపిస్తాది. దానిపై కామెంట్, లైక్ అండ్ షేరింగ్ asusual గా ఉంటాయి. లైవ్ లో ఉంటుండగానే లైవ్ చేసేవారు(పేజ్ owners) కామెంట్స్ కు respond అవగలరు.

మొత్తం లైవ్ వీడియో అయిపోయాక అది పేజ్ లో పోస్ట్ అవుతుంది. అది అవసరం లేకపోతే పేజ్ owners కేవలం లైవ్ broadcast చేసి తరువాత డిలిట్ చేయగలరు. మొదటిగా ఈ లైవ్ స్ట్రిమింగ్ ను Dwayne 'The Rock' జాన్సన్, సెరెనా విలియమ్స్, Luke Bryan, Richard Kaka, Ashley Tisdale, Lester Holt, Martha Stewart మరియు Michael Buble యాక్సిస్ చేయనున్నారు.

లైవ్ బ్రాడ్ కాస్టింగ్ ఇలా చేస్తారు..

  1. పోస్ట్ మీద టాప్ చేసి, లైవ్ వీడియో బటన్ మీద క్లిక్ చేయాలి.
  2. వివరణ యాడ్ చేసి Go Live బటన్ క్లిక్ చేయాలి.
  3. బ్రాడ్ కాస్ట్ అవుతుండగానే ఎంతమంది చూస్తున్నారు అలాగే బ్యాక్ మరియు ఫ్రంట్ కేమేరాస్ కు లైవ్ ను షిఫ్టింగ్ చేస్తూ బ్రాడ్ కాస్ట్ ఇవగలరు ఫోన్ నుండి.
  4. అయిపోతే స్టాప్ బటన్ క్లిక్ చేయాలి
  5. ఇక వీడియో ఆటోమేటిక్ గా ఫేస్బుక్ పేజ్ లో సేవ్ అయిపోతుంది. అయితే మీకు నచ్చకపోతే డిలిట్ చేయవచ్చు.

ఫేస్ బుక్ దీనితో పాటు జులై లో ఫేస్ బుక్ mentions అని కొత్త ios యాప్ ను రిలీజ్ చేసింది. ఇది ఫేస్ బుక్ ప్లాట్ఫారం లో ఎవరైనా ఎక్కడైనా సెలబ్రిటీస్ ను mention(అంటే ట్యాగ్) చేస్తే celebs నోటిఫికేషన్ ద్వారా తెలుసుకొని వెంటనే కామెంట్ or respond అవటానికి ఈ యాప్ యూజ్ఫుల్ అవుతుంది. Verified ఫేస్ బుక్ పేజ్ ఉన్న ప్రతీ ఒక్కరినీ ఫేస్ బుక్ mentions మరియు లైవ్ సర్వీస్ కు ఇన్వైట్ చేస్తుంది ఫేస్బుక్. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :