Prime Day: భారీ ఆఫర్లతో ప్రైమ్ డే సేల్ ప్రకటించిన అమెజాన్.!!

HIGHLIGHTS

అమెజాన్ 'Prime Day' సేల్ ను ప్రకటించింది

జూలై 23 మరియు జులై 24 తేదీల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది

Prime Day సేల్ ను అమెజాన్ ICICI మరియు SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది

అమెజాన్ ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భారీ ఆఫర్లతో 'Prime Day' సేల్ ను ప్రకటించింది. అమెజాన్ ప్రకటించిన ఈ సేల్ జూలై 23 మరియు జులై 24 తేదీల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రైమ్ డే సేల్ నుండి గ్రేట్ డీల్స్, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ తో సహా గొప్ప ఆఫర్లను తీసుకువస్తునట్లు అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ప్రకటించిన ఈ అప్ కమింగ్ సేల్ నుండి ఏ కేటగిరి ప్రోడక్ట్స్ పైన ఎంతవరకూ డిస్కౌంట్ అఫర్ చేయబోతోందని కూడా అమెజాన్ తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ పైన అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా వెల్లడించింది.

Prime Day సేల్ ను అమెజాన్ ICICI మరియు SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది. తద్వారా, ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ప్రోడక్ట్స్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లాభాలను అందించగలగుతుంది. అంటే, Prime Day సేల్ నుండి ICICI లేదా SBI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ లతో వస్తువులను కొనుగోలు చేస్తే వారికి 10% అదనపు తగ్గింపు లభిస్తుంది.

ఇక టీజర్ పేజ్ ద్వారా అందించిన డిస్కౌంట్ వివరాల్లోకి వెళితే, Prime Day సేల్ నుండి అమెజాన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ మరియు టీవీల పైన గరిష్టంగా 70% వరకూ డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, మొబైల్స్ పైన 40%, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సూచించింది. మంచి ల్యాప్ టాప్ లేదా హెడ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి Prime Day సేల్ మంచి సమయం కావచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి ల్యాప్ టాప్ మరియు హెడ్ ఫోన్ వంటి మరిన్ని గ్యాడ్జెట్స్ పైన గరిష్టంగా 75% డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు చెబుతోంది.  

ఇక Prime Day సేల్ యొక్క మరిన్ని ఆఫర్ల విషయానికి వస్తే, సేల్ జరగనున్న రెండు రోజులు కూడా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య 'WoW Deals' అందుబాటులో ఉంటుంది. అలాగే, కిచెన్ సామానులు హోమ్ డెకరేషన్ వస్తువుల పైన కూడా 70% డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్, Prime Day సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలుపెట్టింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :