iQOO Z9 Lite: ఐకూ అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన వివరాలు బయటకు వచ్చాయి. ఐకూ Z9 సిరీస్ నుంచి వస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ మరియు అందమైన డిజైన్ తో వస్తోందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కంపెనీ వెల్లడించిన ఆ కీలకమైన ఫీచర్స్ పైన ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
iQOO Z9 Lite: లాంచ్ & ఫీచర్స్
ఐకూ జెడ్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ ను అందమైన స్లీక్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లలో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను జూలై 15 తేదీ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో అందించిన కీలకమైన ఫీచర్స్ ను కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.
ఈ ఫోన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన పెద్ద 6.56 ఇంచ్ డిస్ప్లే తో తీసుకు వస్తోంది. ఈ డిస్ప్లే 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ ప్రోసెసర్ Dimensity 6300 తో తీసుకు వస్తోంది. దానికి జతగా 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 6GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ తో టోటల్ 12GB ఫీచర్ ను అందిస్తుంది. అలాగే, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony మెయిన్ కెమెరా + 2MP బొకే కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అలాగే, లౌడ్ సౌండ్ అందించగల స్పీకర్ కూడా ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ ను ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ తెలిపింది.