Jio Complete Plan: అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ అందించే బెస్ట్ ప్లాన్.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం బెస్ట్ ప్లాన్స్ అందిస్తూనే ఉంది

అన్లిమిటెడ్ డేటా కాలింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ వంటి అని లాభాలను అందిస్తుంది

జియో తన యూజర్లకు ఆఫర్ చేస్తున్న కంప్లీట్ ప్రీపెయిడ్ ప్లాన్

Jio Complete Plan: అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ అందించే బెస్ట్ ప్లాన్.!

Jio Complete Plan: రిలయన్స్ జియో తన యూజర్ల కోసం బెస్ట్ ప్లాన్స్ అందిస్తూనే ఉంది. వీటిలో ఒక బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ అన్లిమిటెడ్ డేటా కాలింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ వంటి అని లాభాలను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు దాదాపు నెల రోజులు కంప్లీట్ ప్రయోజనాలను అందుకోవచ్చు. రిలయన్స్ జియో తన యూజర్లకు ఆఫర్ చేస్తున్న ఆ కంప్లీట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా Jio Complete Plan ?

రిలయన్స్ జియో కొత్తగా ప్రకటించిన రూ. 448 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కంప్లీట్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఎందుకంటే, ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ న్ అన్లిమిటెడ్ కాలింగ్ లిమిటెడ్ డేటా మరియు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను ఆఫర్ చేస్తుంది. రిలయన్స్ జియో యొక్క ఈ కంప్లీట్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న అన్ని ప్రయోజనాలు క్రింద చూడవచ్చు.

జియో రూ. 448 ప్లాన్ బెనిఫిట్స్

రిలయన్స్ జియో యొక్క ఈ రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ 28 రోజుల చెల్లుబాటు కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5G డేటాని కూడా అందిస్తుంది. అదే 4జి నెట్ వర్క్ అయితే రోజుకు 2GB హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 64Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.

Jio Complete Plan

అలాగే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఇక అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ప్రయోజనం విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 12 OTT యాప్స్ కి 28 రోజుల ఉచిత యాక్సెస్ అందిస్తుంది.

Also Read: ఫేక్ Digital Arrest సైబర్ క్రైమ్ లెటర్స్ తో జరభద్రం అంటున్న గవర్నమెంట్.!

ఈ ప్లాన్ తో జియో ఆఫర్ చేసే OTT యాప్స్ విషయానికి వస్తే, Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,FanCode మరియు Hoichoi యాప్స్ ను JioTV app ద్వారా యాక్సెస్ చేసే అవకాశం అందిస్తుంది. అలాగే, JioCinema ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూపన్ ను My Jio అకౌంట్ లో జమ చేస్తుంది.

మరిన్ని బెస్ట్ Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo