How to Fill SIR Form Online Step by Step Guide
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా SIR ఫామ్ గురించే చర్చ నడుస్తోంది. లోకల్ గా ఉండే పంచాయతీ అధికారులు ఈ ఫామ్ ను ఇంటి వద్దకు వచ్చి ఫీల్ చేసి దానిని ప్రభుత్వానికి అందిస్తున్నారు. అయితే, దూరంలో ఉన్న వారు సొంతంగా ఎస్ఐఆర్ ఫామ్ ని ఫీల్ చేయాలనుకునే వారికి కూడా సులభమైన మార్గం ప్రభుత్వం అందించింది. ఓటరు వివరాలను నమోదు చేయడం లేదా సరి చేయడం కోసం ఎస్ఐఆర్ ఫామ్ ను ఆన్లైన్లో సబ్మిట్ చేయడం ఇప్పుడు చాలా సులభమైంది. ఇంటి నుంచి మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కొద్ది నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. SIR Form Online ఎలా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా అందించాము.
ముందుగా ఎస్ఐఆర్ ఫామ్ కోసం అధికారిక పోర్టల్ ను ఓపెన్ చేయండి. సరైన వెబ్ సైట్ మాత్రమే ఉపయోగించడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది. దీనికోసం “voters.eci.gov.in” అఫీషియల్ సైట్ ను ఓపెన్ చేయండి.
తర్వాత, మీకు ఇప్పటికే ఇందులో అకౌంట్ ఉంటే మీ మొబైల్ నంబర్ లేదా ఇతర లాగిన్ వివరాలు అందించి Sign In చేయండి. ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే Register ఎంపికను ఎంచుకోండి మరియు మొబైల్ నెంబర్ తో అందించి OTP ద్వారా అకౌంట్ ను క్రియేట్ చేయండి. ఇందులో లాగిన్ అయిన తర్వాత డ్యాష్ బోర్డ్ లో కనిపించే ఎస్ఐఆర్ ఫామ్ లేదా సంబంధిత సర్వీస్ ఎంచుకోండి. ఇక్కడ కొత్త దరఖాస్తును ప్రారంభించే అవకాశం ఉంటుంది.
మీ పూర్తి పేరు, తండ్రి లేదా భర్త పేరు, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్ మరియు చిరునామా వంటి వివరాలు ఆధార్ లేదా ఇతర అధికారిక పత్రాల్లో ఉన్నట్లుగానే నమోదు చేయండి. ఇక్కడ ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా పరిశీలించండి. అవసరమైతే గుర్తింపు ప్రూఫ్, చిరునామా ప్రూఫ్ మరియు ఇతర పత్రాల స్కాన్ కాపీలను అప్లోడ్ చేయండి. ఫైల్ పరిమాణం మరియు ఫార్మాట్ వెబ్ సైట్ సూచించిన విధంగా ఉండాలని గుర్తుంచుకోండి.
పూర్తి చేసిన వివరాలు సమర్పించే ముందు మీరు నమోదు చేసిన ప్రతి వివరాన్ని కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే, పేరు, పుట్టిన తేదీ, చిరునామా లేదా మొబైల్ నంబర్ లో చిన్న పొరపాటు ఉన్నా దరఖాస్తు ఆలస్యం కావచ్చు.
ఇక అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత Submit బటన్ పై క్లిక్ చేయండి. విజయవంతంగా సమర్పించిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ లేదా Acknowledgement Number లభిస్తుంది. భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి దీనిని భద్రంగా ఉంచండి.
Also Read: రియల్ థియేటర్ అనుభూతి అందించే Sony BRAVIA Theatre Trio సౌండ్ సిస్టం సేల్ స్టార్ట్ అయ్యింది.!
రిఫరెన్స్ నెంబర్ సహాయంతో అధికారిక పోర్టల్ లో లాగిన్ చేసి అప్లికేషన్ స్టేటస్ ఎంపిక ద్వారా మీ దరఖాస్తు ప్రస్తుత స్టేటస్ ని సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ మొత్తం ప్రాసెస్ లో మురు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఎస్ఐఆర్ ఫామ్ ను ఆన్ లైన్ లో ఫిల్ చేయడం చాలా సులభమైన ప్రక్రియ. ఇక్కడ అందించిన వివరాలు అనుసరిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఫామ్ విజయవంతంగా సమర్పించవచ్చు.