రియల్ థియేటర్ అనుభూతి అందించే Sony BRAVIA Theatre Trio సౌండ్ సిస్టం సేల్ స్టార్ట్ అయ్యింది.!

HIGHLIGHTS

రియల్ థియేటర్ అనుభూతి అందించే Sony BRAVIA Theatre Trio సౌండ్ సిస్టం సేల్ స్టార్ట్ అయ్యింది

ఈ సౌండ్ బార్ ప్రీమియం సెటప్ మరియు ఫీచర్స్ తో ప్రీమియం రేంజ్ లో లాంచ్ అయ్యింది

ఇది నిజమైన థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను ఆఫర్ చేస్తుంది

రియల్ థియేటర్ అనుభూతి అందించే Sony BRAVIA Theatre Trio సౌండ్ సిస్టం సేల్ స్టార్ట్ అయ్యింది.!

రియల్ థియేటర్ అనుభూతి అందించే Sony BRAVIA Theatre Trio సౌండ్ సిస్టం సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ప్రీమియం సెటప్ మరియు ఫీచర్స్ తో ప్రీమియం రేంజ్ లో లాంచ్ అయ్యింది. ఇది నిజమైన థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఇది అందరి బడ్జెట్ లో అందుబాటులో ఉండే సౌండ్ సిస్టం కాదండోయ్. ఈ సౌండ్ బార్ కావాలంటే మీరు జేబులో ఎక్కువ బరువు ఉంచుకోవాలి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony BRAVIA Theatre Trio : ఫీచర్స్

ఫీచర్స్ పరంగా, ఈ సోనీ లేటెస్ట్ సౌండ్ సిస్టం అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది అత్యాధునిక ఫీచర్లతో రూపొందించబడిన ఫ్లాగ్‌ షిప్ మూడు యూనిట్ హోమ్ థియేటర్ సిస్టం. ఇంట్లోనే సినిమా హాల్ స్థాయి ఆడియో అనుభూతిని కోరుకునే వారి కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ సిస్టమ్‌ లో మూడు ప్రత్యేక స్పీకర్ యూనిట్లు ఉండటంతో ఇల్లంతా విస్తరించే మరియు స్పష్టమైన మరియు శక్తివంతమైన సౌండ్‌ ను అందిస్తుంది.

ఈ సోనీ సిస్టం టోటల్ 9 స్పీకర్ (3.0.2) యూనిట్స్ కలిగి ఉంటుంది. అయితే, ఇది 360 స్పేషియల్ సౌండ్ మ్యాపింగ్ టెక్నాలజీతో ఇది వర్చువల్ స్పీకర్లను సృష్టించి, గదిలో ప్రతి మూల నుంచి శబ్దం వస్తున్నట్లుగా అనుభూతిని కలిగిస్తుంది. ఇది Dolby Atmos, Hi Res Audio మరియు DTS సపోర్ట్‌ తో వస్తుంది. ఈ సిస్టం సినిమాలు, వెబ్ సిరీస్‌ లు, స్పోర్ట్స్ మరియు గేమింగ్ సమయంలో అద్భుతమైన త్రీ డైమెన్షనల్ సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది.

Sony BRAVIA Theatre Trio

ఈ సిస్టం కలిగిన AI ఆధారిత సౌండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ డైలాగ్‌ లను మరింత స్పష్టంగా వినిపించడంతో పాటు బ్యాక్‌ గ్రౌండ్ ఆడియోను సమతుల్యం చేస్తుంది. బ్రావియా టీవీతో జతచేస్తే Acoustic Center Sync ఫీచర్ ద్వారా టీవీ స్పీకర్ మరియు థియేటర్ సిస్టం కలిసి మరింత సహజమైన సౌండ్ అందిస్తాయి. కనెక్టివిటీ పరంగా సోనీ బ్రావియా థియేటర్ ట్రయో లో HDMI eARC, బ్లూటూత్ 6.0, Wi-Fi, ఆప్టికల్ ఇన్ పుట్ మరియు USB వంటి ఆధునిక కనెక్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

ఇక విజువల్ సపోర్ట్ విషయానికి వస్తే, ఈ సోనీ సౌండ్ సిస్టం 8K HDR, 4K 120FPS, డాల్బీ విజన్ మరియు IMAX Enhanced వంటి చాలా ప్రీమియం విజువల్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సిస్టం తో డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ను కూడా జత చేసుకోవచ్చు. అయితే, ఇది సపరేట్ గ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Also Read: WhatsApp Username ఫీచర్ వచ్చేసింది .. మీ పేరును వెంటనే రిజర్వ్ చేసుకోండి.!

Sony BRAVIA Theatre Trio : ప్రైస్

ఈ సోనీ సిస్టం ను కంపెనీ రూ. 2,39,990 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ను సోనీ సెంటర్ నుంచి ఎక్స్ పీరియన్స్ చేసి కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile