Aadhaar Card లో పేరు మరియు పుట్టిన తేదీ ఎలా అప్‌ డేట్ చేయాలో తెలుసుకోండి.!

HIGHLIGHTS

Aadhaar Card భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా మారింది

కొన్నిసార్లు ఆధార్ కార్డులో పేరు లేదా పుట్టిన తేదీ వంటి వివరాలు తప్పుగా నమోదు కావచ్చు

ఆధార్‌ లో పేరు మరియు పుట్టిన తేదీని ఎలా అప్‌డేట్ చేయాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం

Aadhaar Card లో పేరు మరియు పుట్టిన తేదీ ఎలా అప్‌ డేట్ చేయాలో తెలుసుకోండి.!

Aadhaar Card భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా మారింది. ప్రభుత్వ పథకాలు మొదలుకొని బ్యాంకింగ్, పాన్ కార్డు, ఆఖరికి మొబైల్ సిమ్ కార్డు కొనాలంటే కూడా ఆధార్ అవసరం అవుతుంది. అయితే, కొన్నిసార్లు ఆధార్ కార్డులో పేరు లేదా పుట్టిన తేదీ వంటి వివరాలు తప్పుగా నమోదు కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఆధార్ వివరాలు సరిచేసుకునే అవకాశం UIDAI ఆధార్ కార్డు హోల్డర్స్ కి కల్పించింది. ఆధార్‌ లో పేరు మరియు పుట్టిన తేదీని ఎలా అప్‌డేట్ చేయాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Aadhaar Card : అప్‌డేట్

ఆధార్ కార్డు లో తప్పుగా ఉన్న పేరు మరియు పుట్టిన తేదీ వంటి వివరాలు అప్డేట్ చేయాలంటే మీకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మీరు ముందుగా ఈ డాక్యుమెంట్స్ ని రెడీ చేసుకుని అప్డేట్ కోసం ముందుకు సాగడం మంచిది.

అప్‌డేట్ కోసం అవసమైన డాక్యుమెంట్స్

ఆధార్‌ లో పేరు అప్‌డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ చూస్తే, దీనికోసం పాస్‌ పోర్ట్, PAN కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి మరియు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డులు అవసరం అవుతాయి. వీటిలో ఏదైనా ఒక పత్రం ఉంటే సరిపోతుంది.

Aadhaar Card

ఇక పుట్టిన తేదీ అప్‌డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ వివరాల్లోకి వెళితే, దీనికోసం జనన ధృవీకరణ పత్రం (Birth Certificate), SSC మెమో, పాస్‌పోర్ట్ మరియు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఉపయోగించవచ్చు. ఇప్పటి వరకు అవసరమైన డాక్యుమెంట్లు గురించి చూసాము, అయితే ఇప్పుడు అప్‌డేట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

పేరు మరియు DOB అప్‌డేట్ స్టెప్ బై స్టెప్

  • సమీప ఆధార్ సేవా కేంద్రం (Aadhaar Seva Kendra) లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ ను సందర్శించండి.
  • ఆధార్ అప్‌డేట్ ఫారమ్‌ ను తీసుకుని సరైన వివరాలను నమోదు చేయండి.
  • పేరు లేదా పుట్టిన తేదీ కి సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లు జతచేయండి.
  • బయోమెట్రిక్ ధృవీకరణ (ఫింగర్ ప్రింట్ / ఐరిస్) పూర్తి చేయాలి.
  • ప్రస్తుతం UIDAI నిర్ణయించిన రుసుము వర్తిస్తుంది కాబట్టి అప్‌డేట్ ఫీజు చెల్లించాలి.
  • అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉన్న రసీదును తీసుకోవాలి.

ఈ విధంగా ఆధార్ అప్‌డేట్ కోసం వివరాలు అందించిన తర్వాత మీ ఆధార్ అప్‌డేట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి.

అప్‌డేట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

UIDAI పోర్టల్‌లో URN నంబర్ ద్వారా అప్‌డేట్ స్టేటస్‌ ను ట్రాక్ చేయవచ్చు. సాధారణంగా కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల లోపు ఆధార్‌ లో కొత్త వివరాలు నమోదు చేయబడతాయి.

Also Read: లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తోంది.!

అప్‌డేట్ కోసం ముఖ్యమైన విషయాలు

పేరు మరియు DOB మార్పులకు సరైన డాక్యుమెంట్లు తప్పనిసరి. పుట్టిన తేదీ మార్పుకు UIDAI ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. మీరు అందించిన డాక్యుమెంట్ వివరాలు పూర్తిగా ధృవీకరణ అయిన తర్వాత మాత్రమే ఈ అప్‌డేట్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ముఖ్యంగా, పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ సార్లు మార్చిడానికి కుదరదు. ఇది కేవలం ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఆధార్‌ లో పేరు లేదా పుట్టిన తేదీ తప్పుగా ఉంటే వీలైనంత త్వరగా సరి చేయడం మంచిది. ఎందుకంటే, బ్యాంకింగ్, KYC మరియు ఇతర ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. మీ అన్ని పాత్రలలో కూడా ఒకే పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఉండటం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile