Ration Card Status : తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డు స్టేటస్ ఆన్ లైన్ లో ఎలా చెక్ చేయాలి.!
Ration Card Status ఇప్పుడు ఆన్ లైన్ లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు
మన తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డు స్టేటస్ ఆన్ లైన్ లో ఎలా చెక్ చేయాలి
యాక్టివ్ లో ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వారు ఇప్పుడు ఆన్ లైన్ లోనే సులభంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
Ration Card Status : రేషన్ కార్డు అనేది ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి కుటుంబానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన పత్రం. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారు, కార్డు లో మార్పులు చేసిన వారు లేదా తమ కార్డు యాక్టివ్ లో ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వారు ఇప్పుడు ఆన్ లైన్ లోనే సులభంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డు స్టేటస్ ఆన్ లైన్ లో ఎలా చెక్ చేయాలో ఈరోజు వివరంగా తెలుసుకోండి.
SurveyRation Card Status :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు సర్వీసులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. కేవలం రేషన్ కార్డు నంబర్ మరియు ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ తోనే మీ రేషన్ కార్డ్ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
తెలంగాణలో రేషన్ కార్డు (FSC) స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కార్డు (FSC) సేవలు ePDS Telangana పోర్టల్ ద్వారా అందిస్తోంది. ఈ పోర్టల్ లో FSC స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ మరియు ఆధార్ సెర్చ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆన్లైన్ లో రేషన్ కార్డ్ స్టేటస్ చేయడానికి ఈ క్రింద వెల్లడించిన స్టెప్స్ ఫాలో చేయండి.
- తెలంగాణ ePDS అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి (Telangana ePDS Portal)
- ఈ సైట్ లో “FSC Search” లేదా “FSC Application Search” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఆధార్ నెంబర్, FSC రిఫరెన్స్, రేషన్ కార్డు నెంబర్ లేదా MeeSeva అప్లికేషన్ లో ఏదైనా ఒకటి ఎంటర్ చేయండి
- జిల్లాను ఎంపిక చేసి Search బటన్ పై క్లిక్ చేయండి.
మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు (FSC) స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇందులో కార్డు హోల్డర్ పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, కార్డు స్థితి, అప్లికేషన్ స్టేటస్ మరియు అర్హత వివరాలు వంటి సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ePDS పోర్టల్ ద్వారా రేషన్ కార్డు వివరాలు, స్టేటస్ ను ఆన్ లైన్ లో అందిస్తోంది. ఇక్కడ రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇక్కడ చూడవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ ePDS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి (AP ePDS Portal)
- సైట్ హోమ్‌పేజీలో “Ration Card Search” లేదా “Know Your Ration Card” ఆప్షన్ ను ఎంచుకోండి.
- మీ రేషన్ కార్డు నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయండి.
- Search బటన్ పై క్లిక్ చేయండి.
వివరాలు అందించి సబ్ మీట్ చేసిన తర్వాత రేషన్ కార్డు నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, కార్డు స్థితి, e-KYC స్థితి మరియు ఫెయిర్ ప్రైస్ షాప్ వివరాలు వంటి వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

మీ రేషన్ కార్డ్ స్టేటస్ లో “Inactive” అని వస్తే మీ కార్డు ప్రస్తుతం యాక్టివ్‌లో లేదు మరియు సంబంధిత అధికారులను సంప్రదించండి. అదే “Pending” అని వస్తే దరఖాస్తు పరిశీలనలో ఉందని అర్థం. ఇందులో “Approved” అని వస్తే మీ దరఖాస్తు ఆమోదించబడింది అని అర్థం. ఒకవేళ “Rejected” అని మాత్రం వస్తే మీ కార్డ్ దరఖాస్తు తిరస్కరించబడింది అని అర్థం. మీరు దానికి దారి తీసిన కారణాన్ని తెలుసుకుని మళ్లీ దరఖాస్తు చేయవచ్చు.
Also Read: ఈరోజు లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్ పై ఒక లుక్కేద్దామా.!
స్టేటస్ కనిపించకపోతే ఏమి చేయాలి?
మీ స్టేటస్ కనిపించక పోయినట్లయితే గ్రామ/వార్డు సచివాలయం (AP) లేదా Mee Seva కేంద్రం (Telangana) ను సందర్శించండి. లేదంటే మీరు నేరుగా సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులను కూడా సంప్రదించవచ్చు.
ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రేషన్ కార్డు స్టేటస్ ను తెలుసుకోవడం చాలా సులభమైంది. ఇంటి నుంచే అధికారిక ePDS పోర్టల్ ద్వారా మీ రేషన్ కార్డు లేదా FSC అప్లికేషన్ స్టేటస్ ను కొన్ని నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం వలన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
