OPPO రెనో 10x జూమ్ స్టైలిష్ డిజైనుతో టాప్-ఆఫ్-లైన్ కెమెరా స్పెక్స్ ను మిళితం చేస్తుంది

OPPO రెనో 10x జూమ్ స్టైలిష్ డిజైనుతో టాప్-ఆఫ్-లైన్ కెమెరా స్పెక్స్ ను మిళితం చేస్తుంది

మునుపటికాలానికి తిరిగివెళితే, ఫోన్లు మొదటగా కెమెరాలతో ప్రారంభమైనప్పుడు , అవి చాల స్ట్రయిట్ ఫార్వార్డ్ గా ఉండేవి. మీరు చూసినది ఒకటయితే మీరు పొందేది మరొకటి. అయితే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లను మొత్తంగా నూతన స్థాయికి తీసుకువెళ్లారు. సంప్రదాయ పాయింట్ అండ్ షూట్ కెమెరాల నుండి మల్టిపుల్ కెమేరాలతో ఫోటోలను తీయగల అనేకమైన  ఫోన్లు, మీకోసం ఇప్పుడు  ఉన్నాయి.

OPPO ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్ల  కెమెరా టెక్ నుండి విలక్షణంగా ఉండేలా దాని ఫోన్లను అభివృద్ధిని చేస్తోంది. సంస్థ ఇప్పటికే అనేక ఫీచర్లను అందించే సెల్ఫీ-సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ల పరిధిని అందిస్తుంది. ఇది తన కొత్త రెనో  సిరీస్ తో , మంచి ఫోటోలను తీసే ఫోన్ను అందించడం మాత్రమేకాకుండా, బాగా కనిపించేలా కూడా అందిస్తోంది. ఈ సంస్థ యొక్క తాజా ప్రధాన ఫోన్, రెనో 10x జూమ్, గౌరవ బ్యాడ్జ్ వంటి దాని పార్టీ-పీస్ ధరిస్తుంది. మీరు ఆశించిన విధంగా, ఈ ఫోన్ 10x హైబ్రిడ్ జూమ్ను అందిస్తుంది. కానీ, ఒక స్మార్ట్ ఫోన్ లోపల ఉన్నటువంటి  పరిమిత స్థలంలో ఇది ఎలా ఇంతసరిగ్గా నిర్వహించబడుతోంది? మరియు ఈ ఫోన్ అందించే అందిచే మొత్తం ఇదేనా? అయితే, త్వరగా ఈ OPPO రెనో 10x జూమ్ యొక్క కెమెరా అందించేది ఏమిటో తెలుసుకుందాం.

వెనుక మూడు

ఈ OPPO రెనో 10x జూమ్ యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఇది ట్రిపుల్ రియార్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇది ఒక ప్రామాణిక వైడ్ – కోణ లెన్స్ తో  ఒక 48MP సెన్సార్ను కలిగి ఉంటుంది, ఇది ఒక అల్ట్రా-వైడ్ లెన్స్ 8MP సెన్సార్ మరియు ఒక 13MP సెన్సరును టెలీఫోటో లెన్స్ ను కలిగి ఉంటుంది. మొత్తంగా  ఈ మూడు ప్రత్యేకమైన వాటిని కలిపి తీసుకువచ్చినప్పుడు, ఇవి కలిసుకత్తిగా పనిచేసి ఈ హైబ్రిడ్ జూమ్ కార్యాచరణ అందిస్తాయి.

యాక్షన్ కు దగ్గరగా

ఒకే టెలిఫోటో లెన్స్ పైన ఆధారపడే బదులు, OPPO రెనో 10x జూమ్ 16 mm  మరియు 160 mm  మధ్య కేంద్రీయ శ్రేణిని అందించటానికి మూడు లెన్సులను  ఉపయోగించుకుంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కంటే 10 రెట్లు సమర్థవంతమైన ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ తో ఉంటుంది. అంతేకాక, ప్రపంచంలో మొట్టమొదటి పెర్రికోప్ లెన్స్ అసెంబ్లీ మరియు D- కట్ లెన్సులు వలన ఈ ఫోన్ ఒక స్లిమ్ మరియు సొగసైన రూపం కారకాన్ని అందించేలా చేస్తుంది, దీనికి నిజంగా థాంక్స్ చెప్పొచ్చు. ఇందులో, మీరు డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిజేషన్ను కూడా పొందుతారు, ఇది ముఖ్యంగా కావాల్సిన వారిని జూమ్ చేయడంలో సహాయపడుతుంది.

మరింత క్యాప్చర్ చేయండి

ఇది కేవలం జూమ్ లెన్స్ గురించి మాత్రమేకాదు. ఇది 8MP సెన్సార్ 120 డిగ్రీల ఆల్ట్రా-వైడ్ లెన్సును కూడా కలిగి ఉంది, ఇవి కూడా చాలా సులభంగా వస్తాయి. మీకు ఒక పెద్ద ఫ్రేం అవసరమైనప్పుడు ఈ లెన్స్ మీకు ఉపయోగపడుతుంది. ఇది ల్యాండ్స్కేప్ ఫోటోలను, అలాగే పెద్ద సంఖ్యలో వ్యక్తుల గ్రూప్ షాట్లును అందిస్తుంది.

రాత్రి సమయం షాట్లు

లో లైట్  అనేది చాలా స్మార్ట్ ఫోన్ల  కెమెరాలకు కంఠకంగా ఉంటుంది. ఈ రెనో 10x జూమ్ తో, OPPO తన వినియోగదారులకు తక్కువ-కాంతి షాట్లను అందించే లక్ష్యంతో ఇచ్చింది. ఇది 48MP సోనీ IMX586 1 / 2.0-అంగుళాల పెద్ద సెన్సార్ మరియు ఒక f / 1.7 ఎపర్చరు లెన్స్, ఈ ఫోన్ ప్రకాశవంతమైన చిత్రాలను మరింత కాంతితో తీసుకోవాదానికి నిర్ధేశించబడింది. అంతేకాకుండా, ఇది మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ (MNFR) మరియు HDR సాప్ట్వేర్ అల్గోరిథంలతో కలగలసి  ఉంటుంది.

సాఫ్ట్ వేర్ మ్యాజిక్

OPPO రెనో 10x జూమ్ కేవలం హార్డ్వేర్ గురించి మాత్రమే కాదు. ఇది చాలా మంచి సాఫ్ట్ వేర్ విషయాల యొక్క సమూహాన్ని కూడా సిద్ధం చేస్తుంది. ఈ ఫోన్ తో  వినియోగదారులు కేవలం పోర్ట్రెయిట్ షాట్లను తీసుకోవడమే కాదు, ఐదు బొకే మోడ్లను ఎంచుకోవడంతోపాటు, AI యొక్క బ్యూటిఫికేషన్ మోడ్, వంటివి కూడా సంస్థ దాని తాజా స్మార్ట్ ఫోన్ శ్రేణిలో అందిస్తున్నది. అంతేకాక, డాజిల్ కలర్ మోడ్ కూడా ఉంది, ఇది మంచి చిత్రాల కోసం పిక్సెల్ స్థాయి రంగు పునరుద్ధరణ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

స్లీక్  మరియు స్లయిలిష్

ఇది ప్రముఖ సెల్ఫీ కెమెరాలు అందించే విషయానికి వచ్చినప్పుడు OPPO చాలా అనుభవం ఉంది మరియు ఈ  రెనో 10x జూమ్ విషయంలో దీన్ని స్పష్టంగా చూపిస్తుంది . ఈ ఫోన్లో ఒక 16MP సెల్ఫీ కెమెరా ఒక ప్రత్యేకమైన మెకానిజం లోపల ఉంచబడుతుంది,  ఇది దాని ఆకారం కారణంగా 'షార్క్ ఫిన్' రైజింగ్ కెమెరాగా పిలవబడుతుంది. ఈ వ్యవస్థతో  మీకు అధికమైన  స్క్రీన్-టు-బాడీ రేషియో (93.1%) తక్కువ బెజెళ్ళతో పొందగలిగేలా నిర్ధారిస్తుంది. ఈ రైజింగ్ కెమెరా కూడా సైలెంటుగా ఉంటుంది మరియు ఒక సెకను కంటే తక్కువ సమయంలోనే చిత్రాలను తీయడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఫోన్ను పడేసిన సందర్భంలో, ఈ  కెమెరా స్వయంచాలకంగా బాడీలోకి తిరిగి వెళుతుంది, తద్వారా ఇది నష్టం జరగకుండా కాపాడుతుంది.

ఫ్లాగ్షిప్ స్పెక్స్

అయితే, నిదానమైన పనితీరు నిజంగా యూజర్ అనుభవాన్ని దెబ్బతీస్తుందని OPPO తెలుసుకుంది. అందుకే, కంపెనీ యొక్క ప్రధాన క్వాల్కమ్  స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్ ప్యాక్ చెయ్యడంలో ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ పైన, మీరు ఈ ఫోనుతో సున్నితమైన పనితనాన్ని ఉంచడంలో సహాయంగా 8GB RAM వరకు పొందవచ్చు. అలాగే, మీరు 256GB స్టోరేజిని కూడా పొందుతారు, ఇది ఆప్స్, వీడియోలు మరియు ఫోటోల కోసం సరిపోతుంది.

మరొక విషయం, ఈ OPPO రెనో 10x జూమ్ అన్ని స్పెక్స్ సమాహారంగా ఒక స్మార్ట్ ఫోన్ను వెతికేవారికి, సరిగ్గా సరిపోయేలా ఈ ఫోన్ను, అన్నివిషయాల సమాహారంగా తీసుకొచ్చింది. అంతేకాకుండా, దీని యొక్క టాప్ -ఆఫ్-ది-లైన్ స్పెక్స్ వినియోగదారులు ఇతర పనుల హోస్ట్ కోసం తగినంత శక్తిని కలిగి ఉండేలా చూస్తుంది.

 

Sponsored

Sponsored

This is a sponsored post, written by Digit's custom content team. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo