రిలయన్స్ Jio welcome ఆఫర్ పై ఉన్న MOST WANTED DOUBTS & ANSWERS

రిలయన్స్ Jio welcome ఆఫర్ పై ఉన్న MOST WANTED DOUBTS & ANSWERS
HIGHLIGHTS

సింగిల్ కన్ఫ్యూషన్ కూడా లేకుండా వ్రాయటం జరిగింది.

గతంలో Jio పై ఇలాంటి questions and answers ఆర్టికల్ ఒకటి వ్రాయటం జరిగింది. ఆల్రెడీ సిమ్ తీసుకోని యాక్టివేషన్ కొరకు వెయిట్ చేసే వారికీ అది కొన్ని ఆన్సర్స్ ఇస్తుంది. ఈ లింక్ లో చూడగలరు. 

సో JIO పై ఈ సెకెండ్ FAQ (Frequently Answered Questions) article, రిలయన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయాలకు సంబంధించినది. వెరీ రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ద్వారా అందరికీ అన్నీ ఫ్రీ అని చెప్పిన తరువాత..ఈ అనౌన్స్ మెంటు కు ముందు ఉన్న డౌట్స్ అన్నీ ఇక ఫేడ్ అవుట్ అయిపోయి ఉంటాయని అని ఆశిస్తున్నా. 

అయితే అఫీషియల్ అనౌన్సుమెంటు లోని విషయాలు పై.. మీకు సహజంగా ఏర్పడే డౌట్స్ మాత్రమే కాకుండా మీకు రావలసిన ప్రశ్నలను కూడా నేను వ్రాసి, వాటికన్నిటికీ క్లియర్ గా జవాబులు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ ఆర్టికల్ తరుచుగా UPDATE అవుతూ ఉంటుంది. ఫేస్ బుక్ లో ఉన్న పోస్ట్ ద్వారా మీరు fb లో స్టోరీ పై క్లిక్ చేస్తే updates(అదనంగా యాడ్ చేసిన ప్రశ్నలు మరియు మార్పులు) కనపడవు, బ్రౌజర్ లో ఓపెన్ చేస్తేనే కనిపిస్తాయి edits. సో మీరు ఈ ఆర్టికల్ ను fb లోని పోస్ట్ ద్వారా ఓపెన్ చేసి, పైన రైట్ కార్నర్ లో ఉండే షేర్ బటన్ టాప్ చేసి, బ్రౌజర్ లో ఓపెన్ చేయగలరు. 

 అసలు అన్నిటి కన్నా మీకు తెలియవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏంటి అది? 
Jio సిమ్ నుండి చేసే కాల్స్ అన్నీ 4G ఇంటర్నెట్ ద్వారా వెళ్తాయి. స్టాండర్డ్ talktime బాలన్స్ నుండి కాదు. 

 సో ఈ డేటా కాల్స్ కు ఖర్చు అవుతుందా? అయితే Jio లో ఉన్నవి ఫ్రీ కాల్స్ కావా?
Jio నుండి చేసే వాయిస్ కాల్స్ అన్నీ 4G ఇంటర్నెట్ డేటా తోనే వెళ్తాయి. కానీ ఈ వాయిస్ కాల్స్ కు ఖర్చు అయ్యే ఇంటర్నెట్ డేటా కు Jio ఎటువంటి charges తీసుకోదు. రెగ్యులర్ ఇంటర్నెట్ వాడుకకు( బ్రౌజింగ్ మరియు ఇతర internet usage) వాడే డేటా కు మాత్రమే charges ఉంటాయి. టెక్నికల్ గా డేటా అనేది ports ద్వారా transfer అవుతూ ఉంటుంది. సో కొన్ని charge చేయని free పోర్ట్స్ ఉంటాయి. కొన్ని చేస్తాయి! Jio కాల్స్ అన్నీ Welcome ఆఫర్ అయిపోయిన తరువాత కూడా lifetime అంతా ఎటువంటి charges లేని ports ద్వారా ఫ్రీ గా పనిచేస్తాయి. అంటే చెప్పినట్లుగానే నిజంగానే కాల్స్ అన్నీ free!

Jio సిమ్ ఏ ఫోనులపై పనిచేస్తుంది?
Jio సిమ్ పనిచేయటానికి అఫీషియల్ గా అయితే 4G స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండాలి. 4G అయినా LTE అయినా ఒకటే ప్రాక్టికల్ గా. టెక్నికల్ గా చాలా మైనర్ డిఫరెన్స్ లు ఉన్నాయి. LTE కొంచెం advanced. అంతే! ప్రత్యేకంగా 4G ఫోనులు మరియు LTE ఫోనులు అని లేవు. ఒకటి ఉంటే, రెండొవది కూడా ఉన్నట్లే మీ ఫోనులో (దీని గురించి క్రింద నాలుగవ పాయింట్ లో మరింత చదువుతారు). 3G మాత్రమే ఉన్న ఫోనులపై మాత్రం పనిచేయదు(ప్రస్తుతానికి).

"అఫీషియల్ గా అయితే 4G ఫోన్ కావాలి" అంటున్నారు? Unofficial గా 3G ఫోన్ లో వాడుకోగాలమా?
అవును unofficial గా 3G ఫోన్ లో కూడా Jio sim లేదా Jio కోడ్ generate చేయగలరు మరియు వాడుకోగలరు. ఈ లింక్ లో కంప్లీట్ ప్రోసెస్ తెలపటం జరిగింది. చూడండి. అయితే ఈ పద్దతి కనుగొన్న ఆదిలో పనిచేసేది, కాని ఆ తరువాత చాలా తక్కువ మందికి పనిచేస్తుంది. సో ఎక్కువ ఆశలు పెట్టుకోకండి.

మరి VoLTE సంగతి ఏంటి?
VoLTE అంటే వాయిస్ over LTE (long term evolution). టెక్నికల్ abbrevations ఎందుకులెండి, ముందు ప్రాక్టికల్ విషయం చెప్పండి అనుకోకండి :), టెక్నికల్ గా కూడా మీకు knowledge తెలియాలి అని నా ఉద్దేశ్యం!  సరే అసలు విషయం లోకి వస్తే ప్రతీ ఫోనులో VoLTE ఫీచర్ ఉండదు. కాని VoLTE ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే గతంలో చెప్పినట్లు VoLTE అనేది హార్డ్ వేర్ ద్వారా మాత్రమే ఉండే ఫీచర్ కాదు. సాఫ్ట్ వేర్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. VoLTE లేని ఫోనుల్లో JioJoinప్లే స్టోర్ app లింక్ ) యాప్ ద్వారా వెళ్తాయి కాల్స్.

మా ఫోనులో 4G ఉందో లేదో తెలియటం లేదు. ఏలా తెలుసుకోవాలి?
4G LTE  ఉంటే చాలు, ఆపరేటింగ్ సిస్టం, బ్రాండ్, మోడల్ ఇలా ఏ ఫోన్ పైన అయినా పనిచేస్తుంది Jio. ఇది మీ ఫోన్ లో ఉందా లేదా అని చెక్ చేయటానికి ఫోన్ యొక్క మెయిన్ సెట్టింగ్స్ లో మొబైల్ నెట్ వర్క్స్ ఓపెన్ చేసి నెట్ వర్క్ సెలెక్షన్ లో 2G, 3G(WDMA) తో పాటు 4G ఉందో లేదో చూడండి. 4G అని ఉంటే చాలు మీ ఫోన్ లో Jio పనిచేస్తుంది. ఐ ఫోన్ & విండోస్ కు కూడా same ప్రోసెస్.  ఇంక "మా ఫోనులో 4G పనిచేస్తుందా" అనే ప్రశ్నలు వేయరని ఆశిస్తున్నా 🙂 

సరే మా ఫోన్ లో 4G ఉంది, సిమ్ ఎలా తీసుకోవాలి?
గతంలో welcome offer కు ముందు తరువాత కొన్ని ఫోన్ తయారీ కంపెనిలు స్పెషల్ గా "Jio సపోర్టింగ్" అని అనౌన్స్ చేశాయి. ఇలా అనౌన్స్ చేసిన ఫోనుల్లో మీ ఫోన్ ఉండకపోతే డైరెక్ట్ గా వెళ్లి సిమ్ అడగండి స్టోర్ లో. అయితే రిలయన్స్ కు ఒక రోజులో 2 లక్షలు పైగా అప్లికేషన్స్ రావటంతో కొంచెం ప్రవాహాన్ని లిమిట్ చేయటానికి వినియోగదారులందరూ కోడ్ generate చేసుకొని రావాలి అని చెప్పమని స్టోర్స్ కు పిలుపు ఇచ్చింది. సో మెజారిటీ స్టోర్స్ లో కోడ్ లేకపోతే సిమ్ ఇవటం అనేది జరగటం లేదు. మీ వద్ద ఉన్న ఫోన్ గతంలో Jio సపోర్ట్ చేసే ఫోన్స్ లిస్టు లో ఉన్నట్లయితే కోడ్ generate అవుతుంది. అయినప్పటికీ కొన్ని ఫోనుల్లో అన్ని నియమాలు సరిపోయినా కోడ్ జెనరేటింగ్ అనేది జరగటం లేదు. దీనికి ప్రస్తుతానికి ఎటువంటి సొల్యూషన్స్ అందించలేదు కంపెని. 

కోడ్ ఎలా generate చేయాలి?

  • ఫోన్ లో ఈ లింక్ నుండి ప్లే స్టోర్ లో My Jio App ను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీకు స్క్రీన్ పై instructions కనిపిస్తాయి.
  • వాటిని ఫాలో అయిపోతే ఈజీగానే వెంటనే కోడ్ వస్తుంది ( రాని వారికి క్రింద సొల్యూషన్ తెలిపటం జరిగింది)

store లో జరిగే eKYC ప్రోసెస్ ఏంటి?
మీ ఆధర్ కార్డ్(ఒరిజినల్ అండ్ Xerox) మరియు రెండు ఫోటోస్ తీసుకొని వెళ్తే, స్టోర్ లో మీ ఒరిజినల్ ఆధర్ కార్డ్ మీద ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేస్తారు సిబ్బంది. తరువాత ఫింగర్ ప్రింట్ ను స్కాన్ చేయటానికి ఫింగర్ స్కానర్ పై ప్లేస్ చేయమని అడుగుతారు. ఇది అయిపోయిన తరువాత మీ ఫోన్ లో generate అయిన కోడ్ ను సబ్మిట్ చేస్తే ప్రోసెస్ అయిపోయినట్లే. సిమ్ ఇస్తారు. అది 20 నిమిషాల్లో యాక్టివేట్ అవుతుంది.

కోడ్ చాలా మందికి generate అవటం లేదు. ఏమి చేయాలి?
MyJio App ను WiFi నుండి కాకుండా మొబైల్ ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. అప్పటికీ రాకపోతే, మిగిలిన యాప్స్ కూడా మొబైల్ ఇంటర్నెట్ నుండే డౌన్లోడ్ చేయండి. ఇది కొందరికీ వర్క్ అవుట్ అయ్యింది.

అయినా అవటం లేదు. ఏమైనా ట్రిక్ చెప్పండి?
ఈ లింక్ లో రెండు మెథడ్స్ ను స్టెప్ బై స్టెప్ తెలపటం జరిగింది. జాగ్రత్తగా ఫాలో అయితే 95% సక్సెస్ ఫుల్ గా కోడ్ generate చేసుకోగలరు. సక్సెస్ అయిన వారు ఉన్నారూ అలాగే సక్సెస్ అవని వారు కూడా ఉన్నారు. ట్రిక్స్ ఫాలో అయ్యి కోడ్ generate చేసుకున్న డిజిట్ తెలుగు ఫాలోవర్స్ వారు ఉన్నారు. క్రింద వారి చేసిన కామెంట్స్ చూడండి. (గమనిక: కామెంట్స్ కనపడకపోతే మీరు చూస్తున్న ఇదే స్క్రీన్ లో పైన రైట్ సైడ్ share బటన్ పై క్లిక్ చేసి బ్రౌజర్ లో ఓపెన్ చేయండి)


ఎందుకు కోడ్ generate కావటం లేదు?
యాప్ లోని లోపం వలన. ప్రివ్యూ ఆఫర్ లో అర్హులు కాని వారి ఫోన్లో కూడా కోడ్ generate అయిపోయేది. సో కంపెని ఆ bug ను సాల్వ్ చేస్తూ యాప్ ను అప్ డేట్ చేసేసింది. అందుకే ఇప్పుడు అందరికీ కోడ్ generate అవటం లేదు. ఇది ఒక కారణం. రెండవ కారణం..పైన చెప్పినట్లుగా రోజు కు రెండు లక్షల అప్లికేషన్స్ రావటం వంటి కారణం కూడా కనిపిస్తుంది. మూడవ కారణం కూడా ఉంది. దాని గురించి క్రింద తెలుసుకుంటారు. సో త్వరలోనే కోడ్ విషయంలో మరియు సిమ్స్ తీసుకోవటం లో ఉన్న ఇతర ఇబ్బందులను కంపెని తొలిగిస్తుంది అని అంచనా.

అసలు ఎందుకు ఇలా కొంతమందికి అవుతుంది కొంతమందికి అవటం లేదు?
పైన చెప్పినట్లు మీ వద్ద ఉన్న ఫోన్ గతంలో Welcome Offer కు ముందు ప్రివ్యూ ఆఫర్ time లో కంపెని సెపరేట్ గా Jio సపోర్టింగ్ లిస్టు అంటూ కేవలం కొన్ని ఫోన్లకే Jio సిమ్ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. గుర్తుందా? సో ఈ సపోర్టింగ్ లిస్టు లో ఉన్న ఫోన్లకే కోడ్ generate అవుతుంది టెక్నికల్ గా యాప్ వలన. ఆ లిస్టు లో లేని వారు డైరెక్ట్ గా స్టోర్ కు వెళ్లి కోడ్ లేకుండా సిమ్ తీసుకోగలరు. ఇది Jio కస్టమర్ కేర్ మరియు హెడ్ ఆఫీస్ తెలిపిన సమాచారం.

అయినా కోడ్ generate చేయకుండా డైరెక్ట్ గా స్టోర్ కు వెళ్లి సిమ్ తీసుకోవచ్చని మీరు ఇంతకముందు చెప్పారు కదా? మరలా కోడ్ కావాలి అంటున్నారెంటి?
అవును స్టార్టింగ్ లో అవసరం లేదు! కోడ్ వాళ్ళే generate చేసే వారు. జస్ట్ 4G ఉంటే చాలు, స్టోర్ సిబ్బందే కోడ్ generate చేసేవారు. ఫర్ eg నేనే స్వయంగా ఐ ఫోన్ లో అలా పొందగలిగాను. దానికి తోడూ ప్రివ్యూ ఆఫర్ time లో వెలువడిన JIo సపోర్ట్ ఫోన్స్ లిస్టు లో లేని ఫోన్లకు కోడ్ generate చేయనవసరం లేదు రిలయన్స్ బృందం అఫీషియల్ గా తెలిపింది.  కోడ్ generate చేయకుండా కూడా సిమ్స్ తీసుకుంటున్నారు సక్సెస్ ఫుల్ గా. వాళ్ళు తెలిపిన కామెంట్స్ చూడండి క్రింద. (గమనిక: కామెంట్స్ కనపడకపోతే మీరు చూస్తున్న ఇదే స్క్రీన్ లో పైన రైట్ సైడ్ share బటన్ పై క్లిక్ చేసి బ్రౌజర్ లో ఓపెన్ చేయండి) . అయితే రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి ఉదాహరణలు కూడా తగ్గాయి. కారణం సిమ్స్ కొరత రావటం.



"సరే లిస్టు ప్రకారమే చేశాము అయినా కాని మా ఫోన్ లో అవటం లేదు, లేదా పాయింట్ ప్రకారం మాకు కోడ్ అవసరం లేకపోయినా స్టోర్ లో కోడ్ అడుగుతున్నారు" ఏమి చేయాలి?
మీరు పైన తెలిపిన ట్రిక్స్ ప్రకారం కోడ్ generate చేయటానికి ట్రై చేయండి. కొంతమందికి నాలుగు ఐదు సార్లు ట్రై చేస్తేనే కాని కోడ్ రాలేదు. 

సిమ్స్ లేవు అంటున్నారు స్టోర్స్ కు వెళితే. నిజమేనా? ఏమి చేయాలి?
అవును నిజమే. కాని పూర్తిగా కాదు. వాళ్ళ వద్ద సిమ్స్ ఉన్నాయి. కాని ఆల్రెడీ అప్లై చేసిన అప్లికేషన్స్ కొన్ని కోట్లు సంఖ్యలో ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవి క్లియర్ అయ్యి అన్ని యాక్టివేషన్ అయితే దసలు వారిగా అప్లికేషన్స్ ను తీసుకుంటారు. అలాగే సిమ్స్ అయిపోవటం అనేది కూడా నిజమే కొన్ని స్టోర్స్ లో. ఫైనల్ గా వారు మీకు అబద్దం చెప్పి మోసం చేద్దామని అనుకోవటం లేదని మీరు గ్రహించాలి. కారణం ఏదైనా రిలయన్స్ తెలిపిన instructions నే వారు పాటిస్తున్నారు.

అసలు ఇంటర్నెట్ డేటా ద్వారా కాల్స్ ఏంటి? మనకు 3G దొరకటమే కష్టం కదా, 4G ఎలా ఉంటుంది?
ఇది ఇండియా లో ప్రవేశమవుతున్న కొత్త వాయిస్ కాల్స్ టెక్నాలజీ అని చెప్పాలి. Advanced పద్దతి! కొన్ని దేశాల్లో ఇదే పద్దతుల్లో కాల్స్ use చేయటం జరుగుతుంది ఆల్రెడీ.  సో ఫ్యూచర్ అనేది ఏదైనా మనకు ముందు మింగుడుపడటానికి time పడుతుంది ఏమో కాని, దాని వలన మాత్రం మైనస్ ఏమీ ఉండదు అని మీరు గమనించాలి. ఫ్యూచర్ అంటే అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ అంటే మరింత సులభంగా పనులు చేసుకునే వీలు కలిపించటం. 

అది సరే! ఇప్పటి వరకూ అంటే అందరూ ఇంటర్నెట్ వాడక పోయి ఉండవచ్చు, వాడినా 2G లేదా 3G వాడుతున్నారు. అసలు బేసిక్ ఫంక్షనాలిటీ అయిన కాలింగ్ కోసమే చాలా మంది ఫోన్ వాడుతారు. అలాంటి కాల్స్ చేసుకోవాటానికి కూడా 4G సిగ్నల్ కావాలంటే, అసలకే మోసం అయినట్లు కాదా?
నిజమే! ప్రస్తుతానికి అందరికీ 4G సిగ్నల్ లేదు. కేవలం సిటీస్ మరియు కొద్ది పాటి టౌన్స్ లోనే అందుబాటులో ఉన్నాయి 4G సిగ్నల్స్. villages లో ఎక్కువ శాతం లేవని చెప్పుకోవచ్చు. అందుకే రిలయన్స్ 2016 డిసెంబర్ 31 వరకూ అందరికీ అన్నీ ఫ్రీ గా ఇస్తుంది. అన్ని ఫ్రీ గా ఇస్తున్నప్పుడు ఎవరూ డబ్బులు పెట్టనప్పుడు, కంపెని ను నిదించలేరు. ఈ time గ్యాప్ లో కంపెని నిజంగా దేశం అంతటా 4G సిగ్నల్స్ మరియు JioFi హాట్ స్పాట్స్ ను పెట్టె పనులు చేస్తుంది. సో నిన్న అనౌన్స్ చేసింది Welcome ఆఫర్, అసలైన కమర్షియల్ లాంచ్ జనవరి 1 2017 న స్టార్ట్ అవుతుంది. అందుకే అప్పటి నుండి ప్లాన్స్ ను అందిస్తుంది.

సో సిమ్ తీసుకున్నా సిగ్నల్ లేకపోతే, ఏమీ పనిచేయవా?
అవును పనిచేయవు! 4G సిగ్నల్ లేకపోతే అస్సలు Jio ఎందుకూ పనిచేయదు. ఫోన్ లో సిగ్నల్ బార్స్ వస్తాయేమో కాని ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్ అనేది ఏదీ పనిచేయదు (ఆసలు సిగ్నల్ బార్స్ కూడా కనిపించవు అని అంచనా). అయినా ఫ్రీ కాబట్టి తీసుకోని పెట్టుకోండి. ఎప్పుడైనా మీ ఏరియా లో సడెన్ గా సిగ్నల్ రావొచ్చు కదా! లేదా మీకు కొంచెం దూరం లో ఇతర ఏరియాస్ లో ఉండవోచ్చు కదా!

సో రిలయన్స్ Jio ను ప్రైమరీ sim గా పరిగణించటం కరెక్ట్ కాదా?
ప్రస్తుతానికి అయితే కంప్లీట్ గా Jio నంబర్ ను మీ ప్రైమరీ నంబర్ గా వాడటం కరెక్ట్ కాదు. మీ ఏరియా లో సిగ్నల్ ఉన్నా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వెళ్ళే ప్రతీ ఏరియా లేదా ఊరిలో సిగ్నల్ ఉంటేనే దీనిని మీ పర్సనల్ primary నంబర్ గా మార్చుకోవాలి. అప్పటివరకూ porting కూడా చేయటం మంచిది కాదు. ఒకవేళ సిగ్నల్ ఉన్నా ఇతర నెట్ వర్క్స్ కు కాల్స్ వెళ్ళటం లేదు. వెళ్ళినా చాలా రేర్ గా వెళ్తున్నాయి. పోర్టింగ్స్ పై డిపెండ్ అవటం వలన ఎప్పుడు వెళ్తున్నాయో దాని ఇష్టం.

 Porting ( MNP ) సపోర్ట్ ఉందా Jio కు?
ఉంది! Jio సెప్టెంబర్ 5 నుండి Welcome ఆఫర్ తో పోర్టింగ్ సపోర్ట్ చేసుంది. కాని కొన్ని స్టోర్స్ లో ఈ విషయం ఇంకా అప్ డేట్ కాలేదు. త్వరలోనే స్టోర్ సిబ్బందికి కూడా ఈ విషయం అప్ డేట్ అవుతుంది అని అంచనా. పైగా ఇతర నెట్ వర్క్స్ పోర్టింగ్ కు కూడా సపోర్ట్ చేయకపోవటం వలన సక్సెస్ ఫుల్ అవటం లేదు. గమనిక: ప్రస్తుతానికి పోర్టింగ్ చేయకపోవటం మంచిది. ఎందుకంటే Jio సిమ్ నుండి కాల్స్ వెళ్ళటం లేదా రావటం అనేది ఇబ్బందికరంగా ఉంది. 

MNP ఏలా చేసుకోవాలి?

  • PORT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పోర్ట్ చేయదలచుకున్న మొబైల్ నంబర్ ఎంటర్ చేసి 1900 కు SMS చేయాలి. ఈ SMS పోర్ట్ చేయదలచుకున్న నంబర్ నుండే పంపాలి.
  • ఇప్పుడు డైరెక్ట్ గా స్టోర్ కు వెళ్లి, ఆధర్ కార్డ్ ప్రూఫ్ ఇచ్చి ఫింగర్ ప్రింట్ స్కానింగ్ (వాళ్ళ వద్ద ఉంటుంది మిషన్) చేసి సిమ్ తీసుకొగలరు వెంటనే. 20 నిమిషాల్లో యాక్టివేషన్ కూడా జరిగిపోతుంది. అయితే పోర్టింగ్ కు ఇతర నెట్ వర్క్స్ సపోర్ట్ చేయక పోవటం వలన రిలయన్స్ ఈ విషయంలో లో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొకుంటుంది.

అసలు రిలయన్స్ ముకేష్ అంబానీ అనౌన్స్ అయిన ఆఫర్ లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ లు ఏంటి?

ప్లస్- 

  • ఏ నెట్ వర్క్ కు అయినా..Unlimited లోకల్ std కాల్స్ అండ్ నేషనల్ రోమింగ్ కూడా ఫ్రీ
  • 1MB కు 5 పైసా. అంటే 5 rs కు 100MB వస్తుంది. సో అలా 50 rs కు 1GB వస్తుంది. 

మైనస్ –

  • కంప్లీట్ గా మైనస్ అని చెప్పలేము కాని 4GB కు 499 రూ తీసుకుంటుంది అనే విషయం మిగిలిన నెట్ వర్క్స్ కు Jio కు ఆశించినంత తేడా గా లేదు. ఇక అక్కడనుండి వస్తున్న అన్ని ఆఫర్స్ అలానే అనిపిస్తున్నాయి.
  • ఆఫర్స్ అయితే వినటానికి చాలా సూపర్ ఉన్నాయి కాని, సిగ్నల్ లేకపోతే ఏదీ లేదు. నార్మల్ సిగ్నల్ కాదు 4G LTE ( దీనిపై.మరింత సమాచారం 3, 4 పాయింట్స్ లో ) సిగ్నల్ కావాలి. సో ఇది అందరికీ దొరకదు అనేది వాస్తవం. ముఖ్యంగా చిన్న చిన్న టౌన్స్ మరియు విలేజెస్ లో. ఏ సిటీస్ లో సిగ్నల్స్ ఉన్నాయి అనే లిస్టు కొరకు రిలయన్స్ హెడ్ ఆఫీస్ సిబ్బందిని అడగటం జరిగింది. వాళ్ళు లిస్టు ఇస్తే, ఇక్కడ అప్ డేట్ చేస్తాను.

 

స్టార్టింగ్ ప్లాన్ ఎంత?
ఒక రోజు validity తో 19 రూ లకు స్టార్టింగ్ ప్లాన్ ఉంది. 19 rs recharge చేస్తే 100MB 4G ఇంటర్నెట్, Unlimited 4G ఇంటర్నెట్ at night, Jio యాప్స్ ఫ్రీ usage, unlimited SMS మరియు JioFi హాట్ స్పాట్ నుండి 200MB ఉంటుంది. కాని validity మాత్రం 1 రోజు. అందుకే దీని కన్నా 149 rs monthly plan బాగుంది అనుకోవాలి . ఇలాగే non monthly ప్లాన్స్ మరో రెండు ఉన్నాయి – 199 rs కు 750MB 4G డేటా, 1.5GB JioFi హాట్ స్పాట్ డేటా, 7 డేస్ validity. లాస్ట్ 299 rs – 2GB 4G డేటా, 4GB JioFi హాట్ స్పాట్ డేటా – 21 డేస్ validity. ఇక ప్లాన్ ఏదైనా ఫ్రీ కాల్స్ మాత్రం same. టోటల్ plans ను ఈ లింక్ లో ఉన్న ఇమేజెస్ లో చూడగలరు. ఈ లింక్ లోని ఆర్టికల్ దీని కన్నా ముందు వ్రాసిన old ఆర్టికల్. సో సమాచారం ఏదైనా ప్రస్తుతం మీరు చదువుతున్న లోనిదే కరెక్ట్. ఇదే updated స్టోరీ.

ఆల్రెడీ సిమ్ వాడుతున్న వారికీ మరియు సెప్టెంబర్ 5 కన్నా ముందు సిమ్ అప్ప్లై చేసిన వారికీ డిసెంబర్ 31 2016 వరకూ అన్నీ ఫ్రీ ఉంటాయా?
ఉంటాయి. 3 నెలల ప్రివ్యూ ఆఫర్ అయిపోగానే ఆటోమాటిక్ గా Welcome ఆఫర్ అప్ డేట్ అవుతుంది.

Welcome ఆఫర్ లో ఏమి వస్తాయి. ఎంత వరకూ ఉంది validity?
Welcome ఆఫర్ లో 4G ఇంటర్నెట్, కాల్స్, SMS ఈ మూడూ ఫ్రీ. ఎంతైనా వాడుకోగలరు – unlimited!. validity 2016 డిసెంబర్ 31 వ తారిఖు వరకూ ఉంటుంది. సో మీరు సిమ్ డిసెంబర్ 1న తీసుకున్నా Welcome ఆఫర్ 31st కు అయిపోతుంది. ఆ తరువాత పైన చెప్పిన 19, 199 rs, 299 rs non monthly plans మరియు 149 rs నుండి monthly ప్లాన్స్ లో ఎదో ఒకటి వేసుకోవాలి.

monthly ప్లాన్స్ ఏమీ వేసుకోకుండా 19 rs పెట్టి రీచార్జ్ చేసి వాడుకుంటే బెటర్ ఏనా? ఎలాగూ డేటా కు అయ్యే base charges తక్కువే(1GB కు 50 rs) కదా! 
మంచిదే! వాడుకోగలరు! కానీ ఎటువంటి రెంటల్ ప్లాన్స్ లేకుండా సిమ్ ను డైరెక్ట్ గా base charges తో వాడుకోవటం అవుతుందా లేదా అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు. అయినా ఈ అవసరం 2017 జనవరి 1 వ తారీఖున ఉంటుంది. అంత వరకూ అన్నీఒక్క లిమిటేషన్ కూడా లేకుండా ఫ్రీ అని మరిచిపోకండి!

night time unlimited ఇంటర్నెట్ timings ఏంటి?
తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటలు.

JioFi WiFi హాట్ స్పాట్ డేటా కూడా ఇస్తున్నారు కదా, ఏంటి ఇది? ఏలా వాడుతాము?
ఇది పబ్లిక్ places లో రిలయన్స్ JioFi హాట్ స్పాట్ ను కంపెని పెడితేనే పనిచేస్తుంది. ఒక వేల దీనిని అన్నీ places లో అమర్చినా,  మీరు బయటకు వెళ్ళటం లేదా ఏదో JioFi quota లో డేటా ఉంది కదా అని బయట హాట్ స్పాట్ ఎక్కడ ఉందొ అక్కడికి వెళ్లి మరీ వాడుకోవటం అనేది ప్రస్తుతానికి అంత అర్థవంతంగా లేదు!

monthly ప్లాన్స్ వేసుకున్నా, validity అయిపోయింది. కాని ఇచ్చిన డేటా మాత్రం ఇంకా వాడలేదు. next month కు ఉంటుందా మిగిలి పోయిన డేటా?
ఉండదు!  పోతుంది.

స్టూడెంట్స్ కు 25% ఎక్కువ 4G/JioFi డేటా ఎలా పనిచేస్తుంది?
valid ఐడెంటిటీ పూఫ్ సబ్మిట్ చేస్తే పనిచేస్తుంది. అయినా దీనికి కూడా ఇంకా జనవరి వరకూ టైమ్ ఉంది అని గమనించగలరు.

ఇప్పటి వరకూ చెప్పినవి prepaid ప్లాన్సా లేక postpaid ప్లాన్సా?
ముందుగా కట్టేది ఏదైనా.. ఎన్ని రోజుల validity తో వస్తున్నా అది ప్రీ paid. సో మీరు ఇప్పటివరకూ తెలుసుకున్నవి అన్నీ ప్రీ పెయిడ్ ప్లాన్స్. అయితే కంపెని పోస్ట్ పెయిడ్ ఆఫర్స్ కూడా లాంచ్ చేస్తుంది.

మరి Jio యాప్స్ అంటూ కొన్ని ఉన్నాయి కదా? వాటిని వాడితే డేటా కు ఛార్జ్ అవుతుందా లేదా?
Jio Apps, వీడియో కాల్స్, అన్నీ 5Paisa per 1MB – బేస్ tariff లెక్కల ప్రకారమే డేటా charge ఉంటుంది. కాని ఆఫ్ కోర్స్ డిసెంబర్ 31 వరకూ ఏదైనా ఫ్రీ!

Xiaomi ఫోన్ వాడుతున్నారా? కోడ్ పనిచేయటం లేదా?
ఈ లింక్ లోని ఆర్టికల్ చదవండి.

ఫైనల్ లైన్ – 4G ఇంటర్నెట్ డేటా నుండి కాల్స్ వెళ్తున్నా, ఆ ఇంటర్నెట్ డేటా కు ఎటువంటి ఖర్చు ఉండదు. సో కాల్స్ నిజంగా ఫ్రీ అని మీరు గమనించాలి! ఇక పొతే రెగ్యులర్ వాడుక కోసం ఉన్న ఇంటర్నెట్ విషయంలో base charges 1MB కు 5Paisa. సో ఇది కూడా బాగుంది. కానీ 499 రూ లకు 4GB ఇస్తున్న ప్లాన్స్ నుండి ఉన్న అన్ని ప్లాన్స్ మిగిలిన నెట్ వర్క్స్ తో పోలిస్తే బాగున్నాయేమో కానీ expectation కు తగ్గట్టుగా లేవు!

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo