మైక్రోమాక్స్ కాన్వాస్ 5: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ 5: ఫర్స్ట్ ఇంప్రెషన్స్

ఒక పక్క చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ తక్కువ ధరలకు ఇండియన్ మార్కెట్ లోకి వస్తున్నా, మైక్రోమాక్స్ కంపని గ్రోత్ రేట్ చూస్తే మాత్రం ఇండియన్ బ్రాండ్ గా గట్టి పోటీ ఇస్తుంది.

కేవలం ఇండియా లో మైక్రోమాక్స్ ఒక్కటే రేస్ లో కనిపిస్తుంది. ఈ మధ్య కాన్వాస్ సేల్ఫీ, స్పార్క్ అంటూ కాన్వాస్ సిరిస్ ను డిజైన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి కొన్ని మంచి లుక్స్ ఉన్న ఫోన్స్ ను రిలీజ్ చేసింది.

లేటెస్ట్ గా నిన్న మైక్రోమాక్స్ కాన్వాస్ 5 మోడల్ 11,999 రూ 3gb ర్యామ్ తో లాంచ్ చేసింది. 5.2 in 1080P డిస్ప్లే, 13MP/5MP కెమేరాస్, మెటాలిక్ సైడ్స్ ఫినిషింగ్ ఉన్నాయి దీనిలో.

మొదటిసారి చూసిన వెంటనే ఇది స్పార్క్ మోడల్ కు పెద్ద వెర్షన్ లా ఉంది. దాని లానే faux లెధర్ బ్యాక్ ప్యానల్ ఉంది దీనిలో. రౌండేడ్ ఎడ్జెస్ తో మెటాలిక్ ఫినిషింగ్ ఉంది సైడ్స్ లో.

5.2 in స్క్రీన్ అయినా కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది.. డిస్ప్లే మంచి కలర్స్ చూపిస్తుంది. సన్ లైట్ లో బాగా కనపడటంలేదు. దిని కన్నా బెటర్ డిస్ప్లే లు ఉన్నాయి ఈ బడ్జెట్ లో.

చాలా మంది మీడియా టెక్ ప్రొసెసర్ స్పీడ్ బాగోదు అని అనుకుంటారు. కాని ఇప్పుడు వస్తున్నవి మంచి ప్రాసెసర్లు. క్లాక్ స్పీడ్ ఎక్కువ కాకపోయినా ఫోన్ మాత్రం ఎక్కడా లాగ్స్ ఇవ్వలేదు, స్మూత్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆఫ్ కోర్స్ ప్రోపర్ లోడ్ వేస్తేనే దాని రియల్ పెర్ఫార్మెన్స్ తెలుస్తుంది, దానికి ఇంకా టైమ్ ఉంది. త్వరలోనే కంప్లీట్ రివ్యూ చూస్తారు.

నేను చాలా బ్రైట్ సన్ లైటింగ్ లో ఉన్నాను, అందుకే ఫోటోస్ బాగా వచ్చాయి. దీని లో కూడా కంపెని సామ్సంగ్ సెన్సార్ పెట్టింది. సన్ లైట్ లో దీనితో కొన్ని ఫోటోస్ తీయటం జరిగింది.

చూడటానికి బాగున్నాయి, కాని కంప్లీట్ రివ్యూ అయితేనే దీనిపై కూడా స్పష్టంగా కంక్లుజన్ ఇవచ్చు.

ఓవర్ ఆల్ చూడటానికి మిగిలిన ఫోన్స్ కు ఇది కాంపిటేటివ్ లా ఉండేలా కనిపిస్తుంది. ఇది ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ రెండింటిలోను సెల్ అవుతుంది. సో కంపెనికు కూడా దీని సేల్స్ బాగుంటాయి.

 

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo