Meizu M3 నోట్(2GB ర్యామ్- 16GB స్టోరేజ్) కంప్లీట్ తెలుగు రివ్యూ

Meizu M3 నోట్(2GB ర్యామ్- 16GB స్టోరేజ్) కంప్లీట్ తెలుగు రివ్యూ

Digit Rating: 75/100

Price: Rs. 9,999

లాభాలు: మంచి డిస్ప్లే, గుడ్ లుక్స్,. సుపర్బ్ బ్యాటరీ లైఫ్

నష్టాలు: గ్రాఫిక్స్ పూర్ పెర్ఫార్మన్స్, ఎవరేజ్ కెమెరా

Meizu M3 Note – 2GB ram, 16gb స్టోరేజ్ వేరియంట్ రివ్యూ ఇది. ఈ వేరియంట్ ఇండియాలో రిలీజ్ కాలేదు. కానీ నేను కొద్ది రోజుల నుండి వాడుతున్నా. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ మినహా క్రింద చెప్పినవి మిగిలిన విషయాలన్నీ 3GB-32GB వేరియంట్ కు కూడా వర్తిసాయి. 3GB వేరియంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు దాని రివూ మరలా అందిస్తాము.

బిల్డ్ అండ్ డిజైన్: బాగుంది
చూసిన వెంటనే లుక్స్ వైజ్ అన్ని మోడల్స్ ఒకే లా ఉంటాయి Meizu లో. ఆఫ్ కోర్స్ చాలా కంపెనీలు ఇంతే అనుకోండి. కాని ఇది ఫుల్ మెటల్ బాడీ. antenna కు సిగ్నల్ కోసం పైనా క్రింద ప్లాస్టిక్ ఉన్నాయి అంతే! రెండూ బాగా కలిసిపోయాయి.

5.5 in ఫోన్ ఇది. సో బేసిక్ గానే ఫోన్ అంత సౌలభ్యం గా ఉండదు చేతిలో. పెద్దగా ఉంటుంది. కాని Meizu వీలైనంతగా కాంపాక్ట్ గా ఉండటానికి ట్రై చేసింది. రౌండ్ edges. 2.5D curved గ్లాస్. బటన్స్ tactic feedback బెస్ట్. క్వాలిటీ కూడా సూపర్. ఫ్రంట్ లో fp స్కానర్ బ్యాక్ బటన్ గా కూడా పనిచేస్తుంది.

డిస్ప్లే అండ్ UI: బాగుంది
1080P LTPS 5.5 in డిస్ప్లే vibrant కలర్స్ అండ్ బెస్ట్ వ్యూయింగ్ angles ఇస్తుంది. indoor లో బాగా బ్రైట్ గా ఉంటుంది కాని సన్ లైట్ లోకి వెళితే డిస్ప్లే dim గా ఉంటుంది. టచ్ రెస్పాన్స్ బాగుంది. 2.5D curved గ్లాస్ వలన ఫోన్ బాగుంది, ప్రీమియం గా ఉంటుంది.

Flyme OS 5.1 కొత్త వెర్షన్. యాప్ డ్రాయర్ లేదు. iOS ను imitate చేస్తున్నట్లు ఉంటుంది. యాప్స్ అన్నీ గ్రూప్ అవుతున్నాయి. themes కూడా ఉన్నాయి. కాని ఎక్కవు లేవు. సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ ను మార్చింది. రెగ్యులర్ స్టైల్ లోకి మారింది.

పెర్ఫార్మన్స్: ఫర్వాలేదు
హెవీ గేమింగ్ చేస్తే తప్ప ఫోన్ లాగ్స్ ఇవటం లేదు నేను వాడిన అంత సేపు. అయితే ఈ ఫోనులో వాట్స్ అప్, ఫేస్ బుక్, వీడియో ప్లేయర్ అండ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ వంటివి ఏమీ లాగ్ కాలేదు. asphalt గేమ్ స్టార్ట్ చేయగానే లాగ్ అయ్యింది. ( TIP – ఈ రోజుల్లో 2GB ర్యామ్ అంటే మరీ బేసిక్ యాప్స్ ఉంటేనే కాని ఫోన్ లాగ్ లేకుండా ఉండదు. అంటే మీరు ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ యాప్స్ ఇంస్టాల్ చేసుకోవటానికి కూడా future లో మినిమమ్ 3GB ర్యామ్ అవసరం ఉంటుంది.) మీడియా టెక్ Helio P10 SoC ఇలాంటి గేమింగ్ కు ఫాస్ట్ గా ఉండదు. casual గేమింగ్ కు సరిపోతుంది. synthetic బెంచ్ మార్క్స్ కూడా కరెక్ట్ గా చూపించాయి గ్రాఫిక్స్ పెర్ఫార్మన్స్ లో. 

 

 

 

ఆడియో క్వాలిటీ డీసెంట్ గా ఉంది స్పీకర్ లో. హెడ్ ఫోన్ జాక్ లో కూడా బాగుంది ఆడియో. అయితే మీరు మ్యూజిక్ ను సీరియస్ గా ఇష్టపడే వారైతే కంప్లీట్ గా satisfy అవ్వకపోవచ్చు. కాని రింగ్ టోన్ వాల్యూం అదీ Low గా ఉంది slight గా.

బ్యాటరీ: చాలా బాగుంది
45 మినిట్స్ కాల్స్, 4 hours మ్యూజిక్, వన్ hour Netflix అండ్  వాట్స్ అప్ మరియు ఫేస్ బుక్ ఎక్కువుగా వాడితే ఇది రెండు రోజులు వచ్చింది. అదనంగా ఒక గంట గేమింగ్ చేస్తే ఒక రోజే వస్తుంది. కాని ప్రైస్ తో పోలిస్తే బాగుంది అని చెప్పాలి బ్యాటరీ. బ్యాటరీ విషయంలో రెడ్మి నోట్ 3 2GB వేరియంట్ కు పోటీ ఇస్తుంది.

కెమెరా: ఎవరేజ్
డీసెంట్ ఫోటోస్ వస్తున్నాయి నార్మల్ లైటింగ్ లో. ఫోకస్ సరిగ్గా లేనప్పుడు షార్ప్ నెస్ లేదు, నాయిస్ కన్పిస్తుంది. ఇవి ఫోకస్ సరిగ్గా ఉంటే బాగానే ఉంటున్నాయి. కెమెరా యాప్ కూడా responsive గా ఉంది. Low లైటింగ్ లో చాలా ఫోనులు బాగోవు. కాని ఇది వాటితో పోలిస్తే బాగానే ఉంది. కాని కంప్లీట్ బెస్ట్ కాదు. Le 2 మరింత బెటర్ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.

Meizu M3 Note

బాటం లైన్
Meizu M3 నోట్ మంచి ఫోన్ సోలో గా.  మంచి డిస్ప్లే, సుపీరియర్ బ్యాటరీ లైఫ్, డీసెంట్ పెర్ఫార్మన్స్ అండ్ ఫర్వాలేదు అని పించే కెమెరా ఉన్నాయి. కాని ఇతర ఫోనులతో కంపేర్ చేస్తే దీని కన్నా బెస్ట్ ఫోనులు ఉన్నాయి. రెడ్మి నోట్ 3 – 2gb వేరియంట్ తీసుకోవాలని ఇష్టం లేకపోతే మరియు 10 వేల రూ మాత్రమే పెట్టగలిగితే ఇది తీసుకోవాలి. కాని దీని కన్నా రెడ్మి నోట్ 3 2GB వేరియంట్  బెస్ట్ చాయిస్. మరో రెండు వేలు యాడ్ చేయగలిగితే LeEco Le 2 మంచి ఫోన్. లేదు లుక్స్ బాగున్నాయి, డిఫరెంట్ బ్రాండ్ ట్రై చేద్దమనుకుంటే, Meizu M3 నోట్ 3GB ర్యామ్ వేరియంట్ ను choose చేసుకోండి. (3GB ర్యామ్ వేరియంట్ తో వస్తుంది కాబట్టి మీ రెగ్యులర్ ఉసగేప్ పనులు బాగా perform అవుతాయి)

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo