సిమ్ తీసుకొని చాలా రోజులైయినా యాక్టివేషన్ జరగని వాళ్ళు ఇలా ట్రై చేయండి

సిమ్ తీసుకొని చాలా రోజులైయినా యాక్టివేషన్ జరగని వాళ్ళు ఇలా ట్రై చేయండి

UPDATE: ముందుగా.. క్రింద వ్రాసిన స్టోరీ చదవండి. ఆ తరువాత ఇది చదివితే అర్థమవుతుంది. కాని ఆల్రెడీ క్రింద స్టోరీ చదవిన వారు డైరెక్ట్ గా ఇది చదవవచ్చు. 
సో లేటెస్ట్ గా కాల్ procedure లో కొన్ని మార్పులు చేసింది Jio. మీ నంబర్ కు యాక్టివేషన్ మెసేజ్ వస్తేనే కాల్ కనెక్ట్ అవుతుంది కస్టమర్ కేర్ సిబ్బందికి లేదంటే మీకు ఇంకా యాక్టివేషన్ మెసేజ్ రాలేదని డిస్కనెక్ట్ అయిపోతుంది. సో అలా కనెక్ట్ కాకపోతే.. మీరు తీసుకున్న Jio నంబర్ ను ఎంటర్ చేయమని అడిగినప్పుడు ఎంటర్ చేయకుండా అలా వెయిట్ చేయండి. కొంతసేపటి తరువాత ఎంటర్ చేయకపోయినా కాల్ కనెక్ట్ అవుతుంది.

 

చాలామందికి చేతిలో సిమ్ వచ్చింది కాని యాక్టివేషన్ మాత్రం జరగటం లేదు. సిమ్ తీసుకోగానే మీరు కరెంట్ వాడుతున్న ఇతర నెట్ వర్క్ నంబర్ కు order no తో ఒక మెసేజ్ వస్తుంది. ఇది యాక్టివేషన్ మెసేజ్ కాదు.

యాక్టివేట్ అయినట్లు మరొక మెసేజ్ వస్తుంది స్పష్టం గా తెలిసేలా. అప్పుడే మీరు Jio సిమ్ ను మీ ఫోన్ లోని మొదటి సిమ్ స్లాట్ లో వేయాలి. 

ఇక ఇప్పుడు సిగ్నల్ వస్తుంది. రాని వారు, ఫోన్ మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి, మొబైల్ నెట్ వర్క్స్ లో ONLY 4G లేదా ONLY LTE లేదా 4G మరియు LTE తో పాటు ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సింగిల్ గా ONLY 4G అని లేకపోతే.

ఇప్పుడు సిగ్నల్ వస్తుంది. ఇంకా రాకాపోతే, నెట్ వర్క్ మోడ్ సెట్టింగ్స్ లోకి వెళ్లి automatic నుండి manual సెలెక్ట్ చేసుకొని మీ ఏరియా లో అసలు Jio 4G సిగ్నల్ ఉందో లేదో సర్చ్ చేయండి. ఇప్పుడు మీకు 4G టవర్స్ లిస్టు లో Jio కనిపించాలి. లేదంటే Jio వాడటానికి అవ్వదు.

అన్ని చేసిన తరువాత సిగ్నల్ వస్తే 1977 నంబర్ కు కాల్ చేసి ఆఫర్స్ యాక్టివేట్ చేసుకోవాలి. అయితే VoLTE ఉన్న వారికే కాల్స్ వెళ్తాయి. సో కాల్స్ వెళ్లలేదంటే మీ ఫోన్ హార్డ్ వేర్ లో VoLTE లేదు అని అర్థం.

సో ప్లే స్టోర్ నుండి ఈ లింక్ (లింక్ కనపడకపోతే ఇదే స్టోరీ ను బ్రౌజర్ లో ఓపెన్ చేయండి- మొబైల్ users) లో Jio Join అనే యాప్ ఉంటుంది.. దానిని ఇంస్టాల్ చేసుకొని కాల్స్ చేస్తే వెళ్తాయి. ఇప్పుడు ఆఫర్స్ యాక్టివేట్ చేసుకోగలరు. ఇదంతా ఆల్రెడీ గతంలో తెలపటం జరిగింది. 

సో ముఖ్యంగా సిమ్ యాక్టివేషన్ మెసేజ్ రాని వారి కోసం ఈ ఆర్టికల్..

18008901977 అనే ఈ టోల్ free నంబర్ కు కాల్ చేసి మీ ఆర్డర్ నంబర్/సిమ్ నంబర్/ ఎప్పుడు అప్లై చేశారు వంటి విషయాలు తెలపండి. ఆ తరువాత కంప్లైంట్ raise చేయమని అడగండి. మీకు ఒక కంప్లైంట్ నంబర్ ఇస్తారు. 

దానిని ఎక్కడైనా నోట్ చేసుకోండి కాల్ లో ఉండగా. ఎందుకంటే మీరు మరలా రెండవ సారి ఫోన్ చేసి కంప్లైంట్ నంబర్ చెబితే దానిపై మీకు స్టేటస్ తెలుపుతారు. కాల్స్ ఏ ఇతర నెట్ వర్క్ నుండైనా వెళ్తాయి. అయితే చేసే ముందు మీ Jio నంబర్ పక్కన పెట్టుకోండి, డైల్ చేయాలి కాల్ కనెక్టింగ్ time లో.

మరొక విషయం 70% కాల్స్ కస్టమర్ కేర్ సిబ్బంది కి కనెక్ట్ అయ్యే సరికి  ఒక గంట నుండి 2 గంటలు పడుతుంది. అందుకే అర్థరాత్రి 12 తరువాత చేస్తే మీకు త్వరగా కనెక్ట్ అవుతుంది. తొందరగా అంటే మినిమమ్ 20 నిముషాలు ఉండాలి.

ప్రతీ రోజూ including సండే మరియు 24 గంటలు కస్టమర్ కేర్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా చేయవచ్చు. ఇదొక్కటే మీరు చేయగలిగే సోలుషన్ ప్రస్తుతానికి. కొంతమందికి కాల్స్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయటం వలన వాళ్ళ అప్లికేషన్ ముందుకు వెళ్లి త్వరగా యాక్టివేట్ అవుతుంది.

చేసినప్పుడు మీకు ఉన్న డౌట్స్..ఎందుకు సిమ్ కు డబ్బులు తీసుకుంటున్నారు, వీరిపై కంప్లైంట్ చేయగలమా, స్టోర్స్ లో సిమ్స్ లేవని చెబుతున్నారు. ఇతర విషయాలను జాగ్రత్తగా అడిగి తెలుసుకోండి.

కొన్ని టిప్స్:

  • ఒక రెండు గంటలు ఆలోచించి  మీకు ఉన్న ప్రశ్నలను ముందు పేపర్ మీద వ్రాసుకొని ఉంచుకోండి కాల్ చేసే ముందు.
  • అలాగే మీరు ఉన్న ఏరియా లో Jio సిగ్నల్ అందుబాటులో ఉందా లేదా అని కూడా తెలుసుకోగలరు. మీ ఏరియా పిన్ కోడ్ చెప్పి Jio ఆ ఏరియా లో ఉందా లేదా అని అడగండి.
  • మీరు కనుక సీరియస్ గా మాట్లాడితే మరొక సారి కాల్స్ చేసినప్పుడు కాల్స్ కనెక్ట్ అవ్వవు అసలు. సో నిదానంగా అడగండి! 

గమనిక: అప్పుడప్పుడు మీ డాకుమెంట్స్ అసలు సర్వర్ లోకి అప్ లోడ్ అవలేదు. మీరు ఎక్కడ అప్లై చేశారో అక్కడికి వెళ్లి మరలా అప్ లోడ్ చేయమని అడగండి అని చెబుతారు కస్టమర్ కేర్ persons. సో మరొక సారి చేసే, వాళ్ళు కూడా అదే సమాధానం తెలిపితే అప్పుడు స్టోర్ కు వెళ్లి re upload చేయమని అడగండి. డిజిట్ ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను తెలపగలరు క్రింద.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo