VIVO U 10 ను ఫీచర్స్ తో ప్యాక్ చేసినా, ఇంకా సరసమైన ఫోనుగా ఎలా ఉంచిందో చూడండి

VIVO U 10 ను ఫీచర్స్ తో ప్యాక్ చేసినా, ఇంకా సరసమైన ఫోనుగా ఎలా ఉంచిందో చూడండి

ఇటీవల, వివో కొంచెం రోల్ లో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ తయారీదారు చాలా త్వరత్వరగా ఒక మూడు స్మార్ట్‌ ఫోన్లను ఆవిష్కరించింది మరియు వీటిలో VIVO U10   చాలా ప్రత్యేకమైంది మరియు సరసమైన స్మార్ట్‌ ఫోన్. అయితే, ఈ  ఫోన్ సరసమైనది అయినప్పటికీ, ఇందులోని ఫీచర్లను మాత్రం ఏమాత్రం తగ్గించలేదు. VIVO U10 స్మార్ట్‌ ఫోనుతో మీకు లభించే అన్నిప్రయోజాలనాలను క్విక్ గా చూద్దాం.

8-కోర్ చిప్‌ సెట్

vivo u10 performance.jpg

వివో U10 క్వాల్కమ్ యొక్క స్నాప్‌ డ్రాగన్ 665 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది, ఇది వేరియంట్‌ ను బట్టి 3GB లేదా 4GB RAM ద్వారా జతగా వస్తుంది. ఈ చిప్‌ సెట్ క్వాల్‌ కామ్ యొక్క మూడవ తరం AI ఇంజిన్‌ ను కలిగివుంటుంది. ఇది మంచి కెమెరా, సెక్యూరిటీ మరియు గేమింగ్ పనితీరును అందిస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారంగా రూపొందించిన కంపెనీ యొక్క Funtouch OS 9.1 తో ఈ ఫోన్ వస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ గల పెద్ద బ్యాటరీ

vivo u10 charging and notch.jpg

కేవలం కొన్నిగంటలు మాత్రమే ఉండే ఫోన్ను ఇప్పుడు ఎవరూ కోరుకోరు. ఇది తెలుసుకున్న వివో, తన వివో యు 10 ని ఒక భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేసింది. దీనితో, ఒక 12 గంటల నాన్‌స్టాప్ యూట్యూబ్ లేదా ఏడు గంటల PUBG మొబైల్‌ ఆడటానికి, ఇది సరిపోతుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ఒక 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ తో వస్తున్నందున, వినియోగదారులు దీన్ని ఛార్జ్ చేయడానికి చాలా గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదని ఇది నిర్ధారిస్తుంది. 4.5 గంటల టాక్‌ టైమ్‌ సమయాన్ని అందించడానికి, కేవలం 10 నిమిషాల ఛార్జ్ సరిపోతుందని వివో పేర్కొంది.

బిగ్ స్క్రీన్ డిస్ప్లే

vivo U10 display.jpg

తమ ఫోన్లలో చాలా ఎక్కువగా వీడియోలను చూడాలను ఆలోచించే వారికీ ఎవరికైనా, ఒక పెద్ద స్క్రీన్ ఫోన్ తప్పనిసరి. ఈ వివో యు 10 ఒక 6.35-అంగుళాల HD + డిస్ప్లేను 1544 x 720 పిక్సెళ్ల రిజల్యూషన్‌ తో ప్యాక్ చేస్తుంది. వీలైనంత ఎక్కువ స్క్రీన్ మీకు అందుబాటులో ఉండేలా, ఈ ఫోన్ ఒక 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్న ఒక చిన్ననోచ్ ను కలిగి ఉంది.

మూడు కళ్ళు

vivo u10 rear camera.jpg

వివో U10 వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను 13M + 8MP + 2MP సెటప్పుతో కలిగి ఉంది. ఈ 13MP యూనిట్ ప్రామాణిక షాట్లు తీయడానికి ఉపయోగించే ప్రాథమిక కెమెరా. 8MP సెన్సార్లు వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటాయి మరియు వినియోగదారులను వైడ్ దృశ్యంతో ఫోటోలను తీయడానికి ఇది అనుమతిస్తుంది. ల్యాండ్‌ స్కేప్ ఫోటోగ్రఫీకి చాలా అనువైనది. ఇక 2MP యూనిట్ డెప్త్ సెన్సార్, మంచి బోకె షాట్లను తియ్యడానికీ సహాయపడుతుంది.

రాజీ పడే సమస్యే లేదు

vivo u10 sim card slot.jpg

చాలా ఫోన్లలో హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది. ఇది రెండవ సిమ్ కార్డ్ లేదా మైక్రో SD కార్డ్ కలిగి ఉండటాన్ని ఎంచుకోవడం తప్ప వేరే మార్గం లేకుండా వినియోగదారులను వదిలివేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, రెండవ సిమ్ కార్డు ఉన్నవారు తమ స్టోరేజిని పెంచుకోలేరు. కానీ, ఈ వివో యు 10 ట్రిపుల్ కార్డ్ స్లాట్‌ ను కలిగి ఉంది. దీని అర్థం వినియోగదారులు రెండవ సిమ్ లేదా మైక్రో SD కార్డ్ మధ్య ఎంచుకోవలసిన అవసరం లేదు మరియు రెండింటిని ఏకకాలంలో   ఆస్వాదించండి.

PRETTY BOY

vivo u10 rear.jpg

ఈ వివో యు 10 ముందు భాగంలో చాలా చిన్న బెజెల్స్‌తో పెద్ద డిస్ప్లే డామినేట్  చేస్తుంది. అందుకని, వేలిముద్ర సెన్సార్ ఫోన్ వెనుక భాగంలో ఉంది. వేలిముద్ర సెన్సార్ యొక్క స్థానం చూపుడు వేలితో చేరుకోవడం చాలా సులభతరం చేస్తుంది. ఈ వివో యు 10 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ ఇంకా కేవలం 8.92 MM మందంతో మాత్రమే ఉందని గమనించాలి.

వివో యు 10 మూడు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. కేవలం రూ .8,990 రూపాయల అత్యంత సరసమైన ధరలో, 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ని అందిస్తుంది. ఇక మిడిల్ వేరియంట్ 3 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌ ను రూ .9,990ధరలో అందిస్తుంది. అలాగే, టాప్-మోస్ట్ వేరియంట్ ధర 10,990 రూపాయలు మరియు ఇది 64 జీబీ స్టోరేజ్‌తో 4 జీబీ ర్యామ్‌ ను అందిస్తుంది. కాబట్టి కొనుగోలుదారులు వారి అవసరాలకు మరియు బడ్జెట్‌ కు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు.

[Sponsored Post]

Sponsored

Sponsored

This is a sponsored post, written by Digit's custom content team. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo