కూల్ ప్యాడ్ ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 అప్ డేట్ తో కూల్ ప్యాడ్ కొత్త UI 8.0 వస్తుంది

కూల్ ప్యాడ్ ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 అప్ డేట్ తో కూల్ ప్యాడ్ కొత్త UI 8.0 వస్తుంది

కూల్ ప్యాడ్ ఇండియాలో రెండు సక్సెస్ఫుల్ మోడల్స్ ను స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో విడుదల చేసింది. అవే కూల్ పాడ్ నోట్ 3 అండ్ కూల్ ప్యాడ్ నోట్ 3 Lite.

ఈ రెండూ హై లైట్ అవ్వటానికి కారణం మార్కెట్ లో ఏ ఫోనూ అంత తక్కువ ధరలో ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు 3GB ర్యామ్ ఇవ్వని తరుణంలో..

కూల్ ప్యాడ్ నోట్ 3 ను 8,999 రూ లకు మరియు 6,999 రూ లకు సేమ్ అదే ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు 3GB ర్యామ్ ను ఇచ్చింది కంపెని. 

ఇప్పుడు కూల్ ప్యాడ్ ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 అప్ డేట్ ను విడుదల చేయనుంది తొందరలోనే. ఆండ్రాయిడ్ 6.0 లో కూల్ ప్యాడ్ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం మారటం జరిగింది.

ఆండ్రాయిడ్ 6.0 based కూల్ ui 8.0 ఆల్రెడీ 50 మంది కూల్ users వాడుతున్నారు. కంపెని బగ్స్ ను తెలుసుకోవటానికి వీళ్ళను సెలెక్ట్ చేసింది.

ప్రత్యేకంగా డేట్ తెలియదు కాని వేరి సూన్ కూల్ ప్యాడ్ users అందరికీ ఈ అప్ డేట్ వస్తుంది అని రిపోర్ట్స్. రెండు మోడల్స్ కు ఈ అప్ డేట్ రానుంది అని అంచనా.

కొత్తగా జరిగిన మార్పులు మరియు ఫీచర్స్..

  • నోటిఫికేషన్ బార్ transparent గా మారింది. పైగా ఇక్కడ కేవలం నోటిఫికేషన్స్ ఉంటాయి. క్విక్ సెట్టింగ్స్ ఉండవు. ఇది పర్సనల్ గా నాకు నచ్చింది. ఎందుకంటే సెట్టింగ్స్ కొరకు నోటిఫికేషన్ క్రిందకు డ్రాగ్ చేస్తే ముందు నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి, పొరపాటున ఫింగర్స్ టచ్ అయితే అవి ఓపెన్ అవటం వంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
  • క్విక్ సెట్టింగ్స్ మీరు ఫోన్ లో ఎక్కడ ఉన్నా క్రింద నుండి పైకి స్వైప్ చేస్తే కంట్రోల్ సెంటర్ కాన్సెప్ట్ లో వస్తాయి. వీటిలో ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో కూడా సెట్ చేసుకోగలరు.
  • మెయిన్ సెట్టింగ్స్ లుక్స్ చేంజ్ అయ్యాయి. Meizu OS లోని సెట్టింగ్స్ మాదిరిగా ఉంటాయి దాదాపు. అదనంగా సెట్టింగ్స్ తో పాటు యాప్ సెట్టింగ్స్ ఉంటుంది స్వైప్ మోడ్ లో.
  • ఐకాన్స్ అవీ పెద్దగా మార్చినట్లు కనపడటం లేదు. థీమ్స్ కొత్తగా యాడ్ అయినట్లు సమాచారం.
  • multi tasking/recent యాప్స్ కూడా ఆండ్రాయిడ్ stock లుక్స్ లో ఒక దాని పైన ఒకటి కాకుండా ఒక దాని ప్రక్కన ఒకటిగా ఉండనున్నాయి. ఇక్కడ టోటల్ ఫ్రీ ర్యామ్ తో పాటు ఒక్కో యాప్ ఎంత ర్యామ్ తీసుకుంటుంది అనే విషయాలను అందిస్తుంది.

 

ఫీచర్ విషయానికి వస్తే..

  • కూల్ మేనేజర్ అనే యాప్ ఉంటుంది. దీనిలో ఒక స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ, ర్యామ్, చార్జింగ్, ఆటో మేనేజర్ ఇంకా చాలా బేసిక్ నుండి advanced ఫీచర్స్ ఉన్నాయి.
  • greenify వంటి యాప్స్ అందిచే ఫీచర్ ను Freezer అనే ఆప్షన్ ద్వారా కూల్ ప్యాడ్ అందిస్తుంది. ఇందకు రూటింగ్ అవీ అవసరం లేదు.
  • బ్యాటరీ సింబల్ లో పర్సెంటేజ్ ఉంటుంది ప్రస్తుతం కాని కొత్త అప్ డేట్ లో పర్సెంటేజ్ బ్యాటరీ బయట ఉంటుంది. ఇది కొంచెం స్టేటస్ బర్ లో ప్లే ను తీసుకుంటున్నట్లే.
  • స్టేటస్ బార్ లో లుక్స్ ఏమీ మారలేదు. ఇక ప్రస్తుతం ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి కూల్ ప్యాడ్ UI లో.

 

ఓవర్ ఆల్ గా నిజంగా users కు నచ్చే ఫీచర్స్ తో పాటు Xiaomi, ఆసుస్ లేదా Flyme వంటి UI లలో కనిపించే ఆప్షన్స్ అన్నీ ఇస్తుంది కూల్ ప్యాడ్. 

కూల్ ప్యాడ్ నోట్ 3 Lite రివ్యూ ను ఈ లింక్ లో చూడగలరు.
కూల్ ప్యాడ్ నోట్ 3 రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.. 

Coolpad note 3  ను 8,999 రూ లకు ఈ లింక్ లో అమెజాన్ లో కొనండి
కూల్ పాడ్ నోట్ 3 lite ను 6,999 రూ లకు ఈ లింక్ లో అమెజాన్ లో కొనండి

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo