బడ్జెట్ లో 3GB స్మార్ట్ ఫోన్స్ లో ఏది బెస్ట్ – కంపేరిజన్

బడ్జెట్ లో 3GB స్మార్ట్ ఫోన్స్ లో ఏది బెస్ట్ – కంపేరిజన్

స్మార్ట్ ఫోన్ వాతావరణంలో ఉన్న మోస్ట్ కామన్ ప్రశ్న.. "10 వేల రూ బడ్జెట్ లో ఏ ఫోన్ మంచిది?" సో ఈ ప్రశ్నకు సమాధానం తెలియజేయటానికి ఈ పోస్ట్..

మొన్నటి వరకూ 2GB ర్యామ్ ఉండేది బడ్జెట్ లో. ఇప్పుడు అది 3GB ర్యామ్ కు పెరిగింది. సో పవర్ ఫుల్ గా పని చేసే స్మార్ట్ ఫోన్ ఏముంది ప్రస్తుతం..

మేము ఇక్కడ మీ కోసం 10,000 రూ సెగ్మెంట్ 8 బెస్ట్ ఫోన్స్ ను కంపేర్ చేసి పొందిపరిచాము. ఇది మీకు క్లారిటీ తో పాటు ఏ ఫోన్ తీసుకోవాలో అని క్లియర్ సమాధానం ఇస్తుంది అని ఆశిస్తున్నాము..

కూల్ ప్యాడ్ నోట్ 3 LITE
ఈ ఫోన్ అన్నిటికన్నా తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఫీచర్స్ తో వస్తుంది. కేవలం ఫీచర్స్ ఒకటే కాదు పనితనం లో కూడా అన్ని విభాగాలలో మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది అని ఈజీగా చెప్పవచ్చు. 6,999 రూ లకు 3GB ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. చేతిలో పట్టుకోవటానికి కూడా మంచి రిచ్ ఫీల్ ఇస్తుంది. 

పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే మీడియా టెక్ చిప్ సెట్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ అండ్ ఇతర రెగ్యులర్ పనులలో చాలా బాగుంది. 13MP రేర్ కెమెరా అంత గ్రేట్ గా ఉండదు Low లైటింగ్ లో. కాని మాక్సిమమ్ అందరికీ satisfaction ఉంటుంది. వీడియో రికార్డింగ్ బాగుంది. Pro మోడ్ ఇమేజేస్ కూడా షూట్ చేసుకోగలరు. అయితే బ్యాటరీ ఒక్కటే కొంచెం ఎక్కువ యాప్స్ ను ఇంస్టాల్ చేసుకునే వారికీ నిరుత్సాహ పరుస్తుంది. అలాగని ఈ ఫోన్ ను కొనకోడదు అనుకోవటానికి కారణంగా ఉండదు. సో బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ ఫోన్ ఇది. కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.

INTEX క్లౌడ్ షిఫ్ట్
లుక్స్ మరియు బిల్డ్ క్వాలిటీ అంతగా బాగోవు. 7,500 రూ లకు చీప్ లుక్స్ గా కూడా ఉంటుంది. కాని డిసెంట్ డిస్ప్లే ఉంది. మంచి కలర్స్ అండ్ వ్యూయింగ్ angles ఉన్నాయి 720P డిస్ప్లే లో. కాని కూల్ ప్యాడ్ నోట్ 3 lite యొక్క ఓవర్ ఆల్ క్వాలిటీ దీనిలో లేదు.

ఫోన్ పెర్ఫార్మన్స్ కూడా గ్రేట్ గా ఉండదు. 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ SoC తక్కువ స్కోర్స్ ఇస్తుంది synthetic బెంచ్ మార్క్స్ లో. రియల్ లైఫ్ లో కూడా ఎవరేజ్ గానే ఉంది పెర్ఫార్మన్స్. UI లో బగ్స్ కూడా ఉన్నాయి. 8MP కెమేరా అంతగా నచ్చదు. అన్ని లైటింగ్ కండిషన్స్ లో బిలో ఎవరేజ్ గా ఉంది ఫోటోస్ క్వాలిటీ. ఫ్రంట్ కెమేరా కూడా సేమ్. బ్యాటరీ లైఫ్ ఫర్వాలేదు.

KULT 10
ఇది కొత్తగా ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశించిన బ్రాండ్. వినటానికి ఊరు పేరు లేని బ్రాండ్ గా ఉన్నా స్పెక్స్ వైజ్ గా ఫోన్ బాగుంది అని చెప్పాలి ప్రైస్ ను చూస్తె. కాని కంపెని హాండ్ సెట్ లో పనితనాన్ని జోడించలేకపోయింది. దీనిలో ప్రొసెసర్ కూల్ ప్యాడ్ నోట్ 3 lite లో కూడా ఉంది కాని దాని అంత optimise అవ్వలేదు దీనిలో. బెంచ్మార్క్ స్కోర్స్ లో బాగున్నా.. కచ్చితంగా కూల్ ప్యాడ్ అంత responsive అండ్ fluid గా లేదు.

3GB ర్యామ్ ఉంది దీనిలో కూడా కాని సంతృప్తికరమైన output లేదు. లాగ్ అవుతుంది ఫోన్. asphalt 8 ఆడుతుంటే freeze(కొంత సేపు ఆగిపోవటం) అవుతుంది. కాని బిల్డ్ క్వాలిటీ బాగుంది అనాలి. oneplus లానే sandstone ఫినిషింగ్ ఉంది ఫోన్ వెనుక భాగంలో.  5 in 720P డిస్ప్లే కూడా బాగుంది. కరెక్ట్ కలర్స్ మరియు వ్యూయింగ్ angles. Mi4i లా ఉంటుంది చూడటానికి. కెమేరా విషయంలో మాత్రం 13MP మిగిలిన ఫోనుల కన్నా తక్కువగానే ఉంది. కలర్స్ బాలేవు, నాయిస్ ఉంది. ఫ్రంట్ కెమేరా కూడా సేమ్. కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.

కూల్ ప్యాడ్ నోట్ 3
డిస్ప్లే బాగుంది, కాని డిజైన్ విషయంలో టాప్ కాదు. బోరింగ్ డిజైన్. పెర్ఫార్మన్స్ లో టాప్ ప్రొసెసర్ పరంగా. కాని బెంచ్మార్క్ లో బెస్ట్ కాదు అని చెప్పాలి. రియల్ లైఫ్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే చాలా బెటర్ మిగిలిన కాంపిటిషన్ ఫోనుల కన్నా. అయితే కేవలం ఎక్కువ సేపు గేమింగ్ చేస్తే అప్పుడప్పడు కొంచెం lags చూపిస్తుంది. 

13MP రేర్ కెమేరా బాగుంది. లైటింగ్ లో డిసెంట్ డిటేల్స్ అండ్ true కలర్స్ ఇస్తుంది. Low లైటింగ్ లో కూడా నాయిస్ తగ్గించటానికి algorithms ను వాడింది కంపెని. బెస్ట్ విషయం ఏంటంటే 3000 mah బ్యాటరీ. బాగా optimise అయ్యింది. కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.

XOLO BLACK 1X
ఇది అందరూ అనుకునేటట్టు ఎవరేజ్ ఫోన్ కాదు. మంచి ఫోన్ ఇది. నోట్ 3 lite లో ఉన్న ప్రొసెసర్ ఉంది, అయితే lite కన్నా కొంచెం తక్కువ పెర్ఫార్మన్స్ ఇస్తుంది బెంచ్మార్క్స్ ప్రకారం. రియల్ లైఫ్ లో కూడా రెండూ చాలా వరకూ దగ్గరగా ఉన్నాయి.

డైలీ usage లో ఫాస్ట్ గా ఉంటుంది. అన్నీ పనులు బాగా చేస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మెటల్ ఫ్రేమింగ్ లో సైడ్స్ లో మంచి బిల్డ్ ఉంది ఫోన్ కు. వెనుక faux leather మంచి లుక్స్ ఇస్తుంది. ఫిజికల్ బటన్స్ మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేయవలసి వస్తుంది. దీనిలో బెస్ట్ విషయం 1080P డిస్ప్లే. ఇదొక్కటే ఈ ఎనిమిది ఫోనుల్లో FHD రిసల్యుషణ్ కలిగి ఉంది. 5 in IPS డిస్ప్లే లో highest పిక్సెల్ డెన్సిటీ కూడా ఉంది. ఇది మిగిలిన డిస్ప్లే లకన్నా ఎక్కువ షార్ప్ నెస్ ఇస్తుంది. కలర్స్ అండ్ వ్యూయింగ్ angles కూడా బాగున్నాయి. అయితే UI పై కంపెని శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది. 13MP కెమేరా డిసెంట్ క్వాలిటీ ఇస్తుంది కాని కెమెరా యాప్ బాగుండాలి ఇంకా. 5MP ఫ్రంట్ మిగిలిన ఫోనుల వలె సిమిలర్ అవుట్ పుట్ ఇస్తుంది. కాని దీనిలో ఫ్రంట్ కెమేరా కు ఫ్లాష్ ఉంది. 2400 బ్యాటరీ ఒక్కటే పెద్ద మైనస్. రియల్ లైఫ్ లో కంటిన్యూస్ గా స్క్రీన్ ను ఆఫ్ చేయకుండా వాడితే 6 గంటలు వస్తుంది బ్యాక్ అప్. కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.

INTEX ఆక్వా ace

ఇది క్లౌడ్ swift కు ఆపొసిట్. డిజైన్ బెస్ట్ లుక్స్ కలిగి ఉంది. చాలా లయిట్ వెయిట్ అండ్ సన్నని బాడి. ప్రీమియం గా అనిపిస్తుంది. 5in 720P డిస్ప్లే గ్రేట్ కాదు మిగిలిన మంచి డిస్ప్లే ఫోనులతో పోలిస్తే. వ్యూయింగ్ angles బాగున్నాయి కాని కలర్స్, సన్ లైట్ విజిబిలిటీ ఎవరేజ్. stock యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. కానీ కెమేరా కూడా బాలేదు. average. డిటేల్స్ ఉండవు. మీరు లైట్ యూసర్ అయితే బ్యాటరీ సరిపోతుంది.

LAVA IRIS X10
మంచి డిజైన్, డిసెంట్ పెర్ఫార్మన్స్ ఉన్నాయి. లైట్ యూసర్ అయితే ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు పెర్ఫార్మన్స్ లో. హెవీ గేమింగ్ లో lags ఉన్నాయి.

5 in 720 IPS డిస్ప్లే బాగుంది. 13MP బెస్ట్ ఫోటోస్ ఇస్తుంది ఈ ప్రైస్ రేంజ్ లో. లైటింగ్ బాగుంటే ఫోటోస్ బాగుంటాయి. low లైట్ లో క్వాలిటీ తగ్గుతుంది, కానీ చాలా ఫోనుల కన్నా బెటర్. బ్యాటరీ కూడా బెస్ట్ బ్యాక్ అప్ ఉంది.

MICROMAX CANVAS PULSE 4G
బెస్ట్ లుక్స్ ఉన్నాయి దీనికి. మంచి బిల్డ్ క్వాలిటి. 5in IPS 720P డిస్ప్లే బాగుంది అన్ని విషయాలలో. స్కోర్స్ పరంగా పెర్ఫార్మన్స్ విషయాలో సెకెండ్ బెస్ట్ ఈ లిస్ట్ లోని ఫోనుల్లో. 2100 mah బ్యాటరీ పెద్ద మైనస్.

13MP రేర్ కెమేరా డిసెంట్ గా ఉంది. మంచి కలర్స్, తక్కువ షార్ప్ నెస్, ఎక్కవు కలర్ నాయిస్. ఫ్రంట్ కెమేరా లో ఫ్లాష్ ఉంది ఈ ఫోనులో.  అన్ని ఫోనులను స్పెక్స్ వైజ్ గా క్రింద టేబుల్ లో కంపేర్ చేయటం జరిగింది..

  Intex Aqua Ace Intex Cloud Swift Xolo Black 1X Lava X10 Coolpad Note 3 Coolpad Note 3 Lite Kult 10 Micromax Pulse 4g
Price (Best prices available online) Rs. 9,500 Rs. 7,750 Rs. 8.999 Rs. 9,999 Rs. 8,999 Rs. 6,999.5 Rs. 8,799 Rs. 9,999
Performance (on 100) 60 48.4 66.7 58.9 76.7 73.7 50.5 68.8
Features (on 100) 75.8 71.2 87.2 76 75.6 72.3 74.7 81.3
Design and Usability (on 100) 69.7 63.6 64.4 71.7 69 209.5 71.9 70.8
Total (on 300) 205.5 183.2 218.3 206.6 221.3   197.1 220.9
SPECIFICATIONS
Display 5-inch 720p 5-inch 720p 5-inch 1080p 5-inch 720p 5.5-inch 720p 5-inch 720p 5-inch 720p 5-inch 720p
Processor MediaTek MT6735 MediaTek MT6735 MediaTek MT6753 MediaTek MT6735 MediaTek MT6753 MediaTek MT6735 MediaTek MT6735 MediaTek MT6753
RAM 3 GB 3 GB 3 GB 3 GB 3 GB 3 GB 3 GB 3 GB
Storage 16 GB 16 GB 32 GB 16 GB 16 GB 16 GB 16 GB 16 GB
Battery rating (mAh) 2300 2500 2400 2900 3000 2500 2350 2100
Rear camera 13-megapixel 8-megapixel 13-megapixel 13-megapixel 13-megapixel 13-megapixel 13-megapixel 13-megapixel
Front camera 5-megapixel 5-megapixel 5-megapixel 5-megapixel 5-megapixel 5-megapixel 5-megapixel 5-megapixel
SCORING
Performance
AnTuTu 6.0 33499 26231 39303 33567 36197 32742 33614 37601
Geenbench 3 Single Core 624 618 615 620 628 623 626 633
Geekbench 3 Multi Core 1816 1843 2605 1801 2753 1835 1789 2887
GFXBench Manhattan 379.7 0 259.9 0 520 360.7 0 361.5
3D Mark Unlimited 4900 4851 6845 4996 6737 4839 4953 6907
Camera (Normal light) (so 5) 2.5 2 3 3.5 3.5 2.5 2 3
Camera (low light) (so 5) 2.5 2 3.5 3 3.5 2.5 2 2
Camera (shutter response) (so 5) 2.5 2 3 3.5 3 3 2.5 3
Camera (video recording) (so 5) 2.5 2.5 3 3 3.5 3 2.5 3
Camera (front, overall) (so 5) 2.5 2.5 3 3 3.5 3.5 3 3
Gaming performance (so 5) 3.5 3 3.5 4 4 3.5 1.5 4
Browsing performance (so 5) 3.5 3 3.5 3.5 4.5 4 2.5 4
Call performance (so 5) 3 25.5 2.5 3 4 4 2.5 3.5
Battery life (in hours) 7.46 7.42 6.35 11.04 10.3 8.47 8.27 6.36
Design and Usability (out of 5)
Build Quality 2 2.5 4 3.2 4 4 4 4
Screen Quality: Temperature/Hue 2.5 3.5 3.5 3.5 4 4 3 3.5
Screen Quality: Sunlight Visibility 3 3 3.5 3 3 3.5 3.5 3.5
Screen Quality: Colour Accuracy 2.5 3.5 3.5 3.5 4 4 4 3
Screen Quality: Viewing Angles 3 4 4 4 4.5 4.5 4 4
Touch Performance 3 3 3 3 3.5 3.5 3 4
Interface design 3 2.5 2.5 4 3 3 4 3
Ergonomics 4.5 4 2.5 4 3.5 4 4 3.5
Features
Display PPI 294 294 441 294 294 294 294 294
Display type IPS-Panel LCD IPS-Panel LCD IPS-Panel LCD IPS-Panel LCD IPS-Panel LCD IPS-Panel LCD IPS-Panel LCD IPS-Panel LCD
Expandable Memory (Y/N) Yes Yes Yes Yes Yes Yes No Yes
4G (Y/N) Yes Yes Yes Yes Yes Yes Yes Yes
OS Android v5.x Android v5.x Android v5.x Android v5.x Android v5.x Android v5.x Android v5.x Android v5.x
Fingerprint sensor No No No No Yes Yes No No
Thiness 6.7 mm 8.9 mm 7.6 mm 7.9 mm 9.3 mm 8.9 mm 7.6 mm 8.8 mm
Weight 121.5 gm 140 gm 125 gm 133 gm 155 gm 142 gm 128 gm

128 gm

BEST BUY: కూల్ ప్యాడ్ నోట్ 3 LITE
బడ్జెట్ ఫోనులలో వేల్యూ for మనీ విషయానికి వస్తే ఈ ఫోన్ ను ఏదీ బీట్ చేయలేదు. 

BEST PERFORMER: కూల్ ప్యాడ్ నోట్ 3
కేవలం బెస్ట్ పెర్ఫర్మార్ ఒకటే కాదు బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ కూడా ఉంది.

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo