Amazon Prime: 2025 లో ప్రైమ్ మెంబర్ షిప్ తో వచ్చే అన్ని బెనిఫిట్స్ తెలుసుకోండి.!

Amazon Prime: 2025 లో ప్రైమ్ మెంబర్ షిప్ తో వచ్చే అన్ని బెనిఫిట్స్ తెలుసుకోండి.!

Amazon Prime: రెండు రోజుల ఉచిత డెలివరీ సర్వీస్ గా అమెరికా లో మొదలైన అమెజాన్ ప్రైమ్ సుదీర్ఘ ప్రయాణం చేసి చాలా దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఆన్‌లైన్ షాపింగ్ మరియు డెలివరీ కంటే మరింత ఎక్కువ ఫీచర్స్ కలిగిన సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ గా అవతరించింది. ప్రస్తుతం, భారతీయ కస్టమర్లకు వారి అవసరాల ఆధారంగా Prime, Prime Lite మరియు Prime Shopping ఎడిషన్ వంటి ప్లాన్ల నుంచి అమెజాన్ ప్రైమ్ ను ఎంచుకోవడానికి వీలు కల్పించడం ద్వారా సేవింగ్, ఎంటర్టైన్మెంట్, సౌలభ్యం మరియు మరిన్నింటిని అందిస్తుంది మరియు యూజర్లు ఉచిత వన్-డే డెలివరీలు, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ మరియు ఎక్స్ క్లూజివ్ డీల్స్ కు కూడా ముందస్తు యాక్సెస్ అందుకోవడం వంటి ప్రయోజనాలు పొందుతారు.

ఈ లిస్ట్ అంతటితో ఆగదు; ఎందుకంటే, కస్టమర్ నో-కాస్ట్ EMI ఆప్షన్స్ మరియు కొన్ని స్మార్ట్‌ ఫోన్‌ లలో ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌, కొన్ని బ్యాంక్ కార్డులు వంటివి ఉపయోగించడం ద్వారా అదనపు క్యాష్‌ బ్యాక్‌ను కూడా పొందవచ్చు. దశాబ్దానికి పైగా సభ్యత్వాన్ని అందిస్తున్న ఈ టెక్ దిగ్గజం తన సర్వీస్ పరిధిని మరింత విస్తరించింది మరియు భారతీయ మార్కెట్ వారి స్థానిక అవసరాల ఆధారంగా కొన్ని అనుకూలీకరించిన ప్రయోజనాలను అందుకుంటుంది. మీరు షాపింగ్ చేస్తున్నా, స్ట్రీమింగ్ చేస్తున్నా, గేమింగ్ చేస్తున్నా లేదా మీకు ఇష్టమైన సంగీతం కోసం చూస్తున్నా సరే Amazon గొప్ప విలువను అందించాలనుకుంటోంది. కానీ ఎలా అందిస్తుంది?

పైన అడిగిన ప్రశ్నకు పూర్తి సమాధానంగా ఈరోజు భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంతో వచ్చే ప్రతి బెనిఫిట్ గురించి ఇక్కడ వివరణాత్మకంగా వివరాలు అందిస్తున్నాము.

1.వేగవంతమైన డెలివరీ

    అన్నింటిలో మొదటిది మరియు ముఖ్యమైనది, అమెజాన్ ప్రైమ్ సభ్యులందరికీ మినిమం ఆర్డర్ వేల్యూ లేకుండా ఉచిత డెలివరీ అందించబడుతుంది. కస్టమర్లు వారి స్థానాన్ని బట్టి ఒక రోజు, రెండు రోజులు లేదా షెడ్యూల్ చేసిన డెలివరీ డేట్స్ మధ్య ఎంచుకోవచ్చు. మీ ఆర్డర్ అదే రోజు డెలివరీ కావాలనుకుంటే మీరు ప్రైమ్ షాపింగ్ ఎడిషన్‌ను ఎంచుకోవచ్చు.

    1. 5% క్యాష్ బ్యాక్

      అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అందరూ అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి అమెజాన్‌ నుంచి చేసిన కొనుగోళ్లపై 5% క్యాష్‌ బ్యాక్ అందుకోవచ్చు. మీరు డిజిటల్ లేదా గిఫ్ట్ కార్డ్‌ లను కొనుగోలు చేస్తున్నప్పటికీ, మీరు కనీసం 2% తిరిగి పొందవచ్చు, ఇది సభ్యులు కాని వారి కంటే ఇప్పటికీ విలువైనది.

      3. అమెజాన్ ప్రైమ్ వీడియో

        యూజర్లు వారి అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం లో భాగంగా ప్రత్యేకమైన బాలీవుడ్ మరియు ప్రాంతీయ బ్లాక్‌ బస్టర్స్ యాక్సెస్ అందుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ రెండు టెలివిజన్‌ లతో సహా మొత్తం ఐదు డివైజ్ లలో టీవీ షోలు, ప్రైమ్ ఒరిజినల్ సిరీస్, స్పోర్ట్స్ మరియు ఇతర కంటెంట్‌ లను కూడా అందిస్తుంది. ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ కలిగిన యూజర్లు ప్రకటనలతో కూడిన అదే కంటెంట్ ని HD రిజల్యూషన్ లో ఒక స్క్రీన్‌ పై చూడవచ్చు.

        4. ప్రైమ్ రీడింగ్

          పుస్తక ప్రియులు ప్రైమ్ రీడింగ్‌ ను కూడా బోనస్‌ గా పొందవచ్చు, కానీ ఇది పూర్తి స్థాయి ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ సభ్యత్వం పొందిన కస్టమర్లు, ఈబుక్స్, మ్యాగజైన్స్, కామిక్ పుస్తకాలు మరియు ఇతర మెటీరియల్స్ ను పొందుతారు.

          5. అమెజాన్ మ్యూజిక్

            ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ మ్యూజిక్‌ నుంచి మిలియన్ల కొద్దీ పాటలను యాడ్స్ లేకుండా వినవచ్చు, వాటిలో ప్లే లిస్ట్ లు, ఆల్బమ్స్ మరియు స్టేషన్స్ కూడా ఉన్నాయి. లైట్ లేదా షాపింగ్ ఎడిషన్ టైర్స్ లో అమెజాన్ మ్యూజిక్ అందుబాటులో ఉండదని గమనించాలి, ఇది మ్యూజిక్ ను ఎక్కువగా ఇష్టపడే వారికి విలువైన సాధనంగా ఉంటుంది.

            6. ప్రైమ్ గేమింగ్

              నెలవారీ ఉచిత గేమ్స్, ప్రత్యేకమైన ఇన్-గేమ్ కంటెంట్ మరియు మరిన్నింటికి యాక్సెస్ కోసం ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా చేర్చబడింది. ఈ ప్రయోజనం పూర్తి స్థాయి ప్రైమ్ వినియోగదారులకు మాత్రమే మరియు ప్రత్యేకించి మల్టీ ప్లాట్‌ ఫామ్‌ లలో ఆడే వారికి అదనపు విలువ అందిస్తుంది.

              7. ముందస్తు యాక్సెస్ మరియు ప్రత్యేకమైన డీల్స్

                అమెజాన్ ప్రైమ్ సభ్యులందరూ లైటనింగ్ డీల్స్ కు ముందస్తు యాక్సెస్ పొందుతారు, అలాగే ఎక్స్ క్లూజివ్ సభ్యులకు మాత్రమే ఆఫర్లు మరియు డీల్స్ ఆఫ్ ది డే కి యాక్సెస్ ఉంటుంది. ఇది ముఖ్యంగా సెలవు సీజన్ మరియు స్పెషల్ సేల్ ఈవెంట్స్ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ప్రైమ్ సభ్యులు పరిమిత-కాల తగ్గింపు ఆఫర్ లను సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాకముందే సద్వినియోగం చేసుకునే వ్ అవకాశం ఉంటుంది.

                8. ప్రైమ్ అడ్వాంటేజ్

                  ప్రైమ్ అడ్వాంటేజ్ అనేది చాలా మందికి అంతగా తెలియదు కానీ చాలా విలువైన ఫీచర్, ఇది అన్ని ప్రైమ్ ప్లాన్‌ లలో చేర్చబడింది. కస్టమర్స్ స్మార్ట్‌ ఫోన్‌ లు మరియు ఇతర అర్హత ఉన్న వస్తువుల పై నో-కాస్ట్ EMI పొందడం ద్వారా, అలాగే ప్రమాదవశాత్తు దెబ్బతిన్న సందర్భంలో 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ (Acko ద్వారా) పొందడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు.

                  9. అమెజాన్ ఫ్యామిలీ ఆఫర్స్

                    ప్రైమ్ సభ్యులకు అమెజాన్ ఫ్యామిలీ కూడా అందుబాటులో ఉంది, ఇందులో పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డీల్స్ మరియు బేబీ ప్రొడక్ట్స్, బొమ్మలు మరియు ఇటువంటి మరిన్ని ఆఫర్లు ఉన్నాయి.

                    అమెజాన్ ప్రైమ్ లో ఈరోజే సభ్యత్వం తీసుకోవడానికి ఇక్కడ నొక్కండి మరియు మరింత స్మార్ట్ గా షాపింగ్ చేయండి.

                    Raja Pullagura

                    Raja Pullagura

                    Crazy about tech...Cool in nature... View Full Profile

                    Digit.in
                    Logo
                    Digit.in
                    Logo