Digital Ghosts: మనం చనిపోయిన తర్వాత మన డేటా ఏమవుతుంది.!

HIGHLIGHTS

మనం ఈ ప్రపంచాన్ని విడిచి పోయిన తర్వాత కూడా మన డేటా బ్రతికే ఉంటుంది

సోషల్ మీడియా పోస్టులు మరియు ఇమెయిల్స్ ఇంకా ఆన్‌ లైన్‌ లో జీవిస్తూనే ఉంటాయి

ఇదే “డిజిటల్ ఘోస్ట్” అనే పదానికి కొత్త వాస్తవ రూపం

Digital Ghosts: మనం ఈ ప్రపంచాన్ని విడిచి పోయిన తర్వాత కూడా మన డేటా బ్రతికే ఉంటుంది. మన కుటుంబ సభ్యులు మన ఫోటోలు, మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టులు మరియు ఇమెయిల్స్ ఇంకా ఆన్‌ లైన్‌ లో జీవిస్తూనే ఉంటాయి. మీ బంధు మిత్రులలో ఎవరో మీ పాత చాట్ చదువుతారు మరియు మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ కి బర్త్‌డే విషెస్ కూడా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇదే “డిజిటల్ ఘోస్ట్” అనే పదానికి కొత్త వాస్తవ రూపం.

డిజిటల్ లైఫ్ : మన రెండో అస్తిత్వం

ఈ రోజుల్లో మన జీవితంలో చాలా భాగం ఆన్‌ లైన్‌ లోనే ఉంటుంది. మనం రెగ్యులర్ గా తీసుకునే ఫోటోలు, వీడియోలు, బ్యాంకింగ్ మరియు వ్యక్తిగత సంభాషణ వంటి మన లైఫ్ లో సగానికి పైగా సమాచారం మొత్తం కూడా డిజిటల్ రూపంలో నిల్వ అవుతుంది. మనం లేకపోయినా ఈ సమాచారం మాత్రం అలాగే ఉండిపోతుంది. అంటే మన కంటే కూడా మన “డిజిటల్ అస్తిత్వం” ఎక్కువ కాలం బతుకుతుంది.

మన తర్వాత మన డేటా ఏమవుతుంది?

మన మరణం తర్వాత మన డేటా పరిస్థితి చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని ఎవరైనా మన జ్ఞాపకంగా కొనసాగిస్తారు లేదా పూర్తిగా ఎరేజ్ అవకాశం ఉంటుంది.అయితే, వీటిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా, సోషల్ మీడియా అకౌంట్ మన మెమోరియల్ అకౌంట్ గా మారుతుంది. అంటే, అది ఒక జ్ఞాపకంగా మిగిలి పోతుంది.

అయితే ఇమెయిల్ మరియు క్లౌడ్ స్టోరేజ్ మాత్రం అలా కాదు. దీనిని ఎవ్వరూ యాక్సెస్ చేయకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత డిలీట్ కావచ్చు లేదా అలాగే ఉండిపోవచ్చు. బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ డేటా అనేది పూర్తిగా లీగల్ డేటా. సరైన ప్రాసెస్ తర్వాత వారసులకు మాత్రమే అందుతుంది.

Digital Ghosts సమస్య ఏమిటి?

ఇది కేవలం టెక్నాలజీ విషయం కాదు, ఇది ఒక భావోద్వేగ, నైతిక, మరియు భద్రతా సమస్య కూడా అవుతుంది. మన వ్యక్తిగత సమాచారం ఎవరికైనా దొరకవచ్చు. మీ అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మీ డేటాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇబ్బంది పడవచ్చు.

ఫ్యామిలీ పై తీవ్ర ప్రభావం

ఒక వ్యక్తి మరణించిన తర్వాత, అతని ఫోటోలు మరియు మెసేజ్‌లు చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది కొందరికి ఓదార్పు ఇస్తే, మరికొందరికి అది బాధను మరింత పెంచుతుంది. అందుకే, డిజిటల్ జ్ఞాపకాలు ఫ్యామిలీకి ఒక వరమా? లేక శాపమా? అనే ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది.

Also Read: True Wireless 5.1.2 Dolby Atmos ప్రీమియం సౌండ్ బార్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్.!

పరిష్కారం ఏమిటి?

ఈ సమస్యకు పరిష్కారం కోసం ముందస్తు ప్రణాళిక అవసరం. దీనికోసం “డిజిటల్ విల్” (Digital Will) ను పరిష్కారం గా ఉంటుంది. మీ అకౌంట్లను ఎవరు యాక్సెస్ చేయాలి, ఏ డేటాను డిలీట్ చేయాలి మరియు ఏవి జ్ఞాపకం గా ఉంచాలి, అని మీరు ముందుగానే నిర్ణయించుకోవచ్చు. అయితే, దీనికోసం మీరు ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది మీ డిజిటల్ లైఫ్ ను మరింత సెక్యూర్ గా ఉంచుతుంది.

డేటా సెక్యూర్ గా లేకుంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్ ఏమిటి?

డేటా సెక్యూర్ గా లేకుంటే ఫ్యూచర్ లో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. AI టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీ దుర్వినియోగం కూడా పెరుగుతోంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని డేటా తో “డిజిటల్ అవతార్” సృష్టించడం సాధ్యమవుతోంది. అంటే, మీ మాట్లాడే స్టైల్ మరియు మీ ఆలోచనలు కూడా డిజిటల్ రూపంలో కొనసాగించే అవకాశం ఉంటుంది. అంటే, మీరు చనిపోయినా కూడా డిజిటల్ రూపంలో బ్రతికే ఉంటారు. ఇది చూస్తే, మనిషి నిజంగా చనిపోతాడా? లేక డిజిటల్‌గా కొనసాగుతాడా? అని ఆలోచనలో పడతారు.

డిజిటల్ ప్రపంచం మనకు అపారమైన అవకాశాలు ఇచ్చింది. కానీ అదే సమయంలో కొత్త ప్రశ్నలు కూడా ఎక్కుపెట్టింది. మన డిజిటల్ అడుగుజాడలు ఎప్పటికీ మాయం కావు కాబట్టి, జీవిస్తున్నప్పుడే వాటి భవిష్యత్తు గురించి ఆలోచించడం అవసరం.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :