Smart MyJio Assistant news ai model from RIL AGM 2026
Smart MyJio Assistant: రిలయన్స్ ఇండస్ట్రీస్ 49 వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM 2026) నుంచి ఈరోజు కొత్త “Smart MyJio Assistant” ఏఐ అసిస్టెంట్ ను ప్రకటించింది. జియో తన AI వ్యూహంలో భాగంగా ఈ కొత్త ఏఐ అసిస్టెంట్ లాంచ్ చేసినట్లు చెబుతున్నారు. కంపెనీ ప్రకారం, ఈ కొత్త ఏఐ అసిస్టెంట్ తో MyJio యాప్ ఇకపై కేవలం టెలికాం సేవలను నిర్వహించే యాప్ గా మాత్రమే కాకుండా వ్యక్తిగత AI అసిస్టెంట్ గా మారనుంది. భారతదేశంలో AI సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ కొత్త ప్లాట్ ఫామ్ లక్ష్యం అని రిలయన్స్ వెల్లడించింది.
వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని వ్యక్తిగత సహాయాన్ని అందించేలా ఈ కొత్త ఏఐ అసిస్టెంట్ రూపొందించబడినట్లు రిలయన్స్ తెలిపింది. రీఛార్జ్, బిల్ చెల్లింపులు, జియో సేవల నిర్వహణ వంటి సాధారణ పనులతో పాటు, వినియోగదారుల ప్రశ్నలకు సహజ భాషలో సమాధానాలు ఇవ్వడం వంటి పనులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, సమాచారాన్ని సెర్చ్ చేయడం, డిజిటల్ సేవలను సులభంగా ఉపయోగించుకునేలా మార్గనిర్దేశం చేయడం వంటి సామర్థ్యాలు మై జియో లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ AI అసిస్టెంట్ అన్ని భారతీయ భాషలకు మద్దతు ఇస్తుందని కూడా రిలయన్స్ తెలిపింది.
జియో ఇప్పటికే “Hello Jio” పేరుతో AI ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ను అందిస్తోంది. ఇది మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, వాయిస్ ఇంటరాక్షన్ మరియు సమస్యల పరిష్కారం వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు ప్రకటించిన స్మార్ట్ మై జియో అసిస్టెంట్ తో అధునాతన జనరేటివ్ AI సామర్థ్యాలతో వినియోగదారులకు వ్యక్తిగత డిజిటల్ సహాయకుడిగా పని చేయనుంది.
Also Read: AI Tools తో ఇంట్లో కూర్చుని డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోండి.!
AGM సందర్భంగా రిలయన్స్ ఇంటెలిజెన్స్ (Reliance Intelligence) భారతదేశ AI మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. 22 భారతీయ భాషల్లో AI సేవలు అందించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ మై జియో అసిస్టెంట్ జియో ఎకోసిస్టమ్ లో కీలక పాత్ర పోషించనుందని ఈ కొత్త ఫీచర్ గురించి జియో చాలా గొప్పగా చెబుతోంది.
మొత్తానికి, స్మార్ట్ మై జియో అసిస్టెంట్ ద్వారా AI ను కోట్లాది భారతీయుల రోజువారీ జీవితాల్లోకి తీసుకురావాలని జియో టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తోంది. ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, మై జియో యాప్ ఒక టెలికాం యాప్ నుంచి పూర్తి స్థాయి AI సహాయకుడిగా మారే అవకాశం ఉంది.