OnePlus N6 battery charger tech and OS details revealed
OnePlus N6: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వివరాలు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ముందుగా, ఈ ఫోన్ బ్యాటరీ వివరాలు అందించిన వన్ ప్లస్ కలిగిన ఛార్జ్ టెక్ మరియు ఆపరేటింగ్ సిస్టం (OS) వివరాలు ఈరోజు రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ నుంచి ఈరోజు వన్ ప్లస్ విడుదల చేసిన కొత్త వివరాలు మరియు కొత్త అప్డేట్ పై లుక్కేద్దామా.
వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ 45W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతోందని వన్ ప్లస్ కొత్త అప్‌డేట్ అందించింది. ఈ ఫాస్ట్ ఛార్జ్ తో కేవలం 5 మినిట్స్ ఛార్జ్ తో 1.7 గంటల యూట్యూబ్ ప్లే బ్యాక్ కి తగిన ఛార్జ్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది. అంతేకాదు, డి ఈ సెగ్మెంట్ లో ఈ ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కలిగిన తొలి ఫోన్ అని కూడా వన్ ప్లస్ టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ లో రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ OS గురించి కూడా వన్ ప్లస్ ఈ రోజు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ Oxygen OS 16 సాఫ్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 60 నెలల స్మూత్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కూడా తెలిపింది. అంటే, వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ 5 సంవత్సరాల రెగ్యులర్ అప్‌డేట్స్ అందిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు.
పైన తెలిపిన రెండు ఫీచర్స్ ఈరోజు వెల్లడించగా, రెండు రోజుల ముందు ఈ ఫోన్ బ్యాటరీ వివరాలు వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ బిగ్ బ్యాటరీ 7 సంవత్సరాల లాంగ్ లైఫ్ తో వస్తుంది. బ్యాటరీ పరంగా ఈ ఫోన్ మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది.
Also Read: Smart MyJio Assistant: యూజర్ అవసరాలకు తగిన విధంగా స్పందించే కొత్త AI అసిస్టెంట్.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ జూన్ 30 న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని స్పెక్స్ మరియు ఫీచర్స్ కూడా వన్ ప్లస్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ మరియు కొత్త వివరాలతో మళ్ళీ కలుద్దాం.