OnePlus N6: బ్యాటరీ, ఛార్జ్ టెక్ మరియు OS అప్డేట్ రిలీజ్ చేసిన వన్ ప్లస్.!

HIGHLIGHTS

OnePlus N6 స్మార్ట్ ఫోన్ వివరాలు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది

ఈ ఫోన్ బ్యాటరీ వివరాలు అందించిన వన్ ప్లస్

ఈ ఫోన్ ఛార్జ్ టెక్ మరియు ఆపరేటింగ్ సిస్టం (OS) వివరాలు ఈరోజు రివీల్ చేసింది

OnePlus N6: బ్యాటరీ, ఛార్జ్ టెక్ మరియు OS అప్డేట్ రిలీజ్ చేసిన వన్ ప్లస్.!

OnePlus N6: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వివరాలు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ముందుగా, ఈ ఫోన్ బ్యాటరీ వివరాలు అందించిన వన్ ప్లస్ కలిగిన ఛార్జ్ టెక్ మరియు ఆపరేటింగ్ సిస్టం (OS) వివరాలు ఈరోజు రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ నుంచి ఈరోజు వన్ ప్లస్ విడుదల చేసిన కొత్త వివరాలు మరియు కొత్త అప్డేట్ పై లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus N6 : లేటెస్ట్ అప్డేట్ ఏమిటి?

వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ 45W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతోందని వన్ ప్లస్ కొత్త అప్‌డేట్ అందించింది. ఈ ఫాస్ట్ ఛార్జ్ తో కేవలం 5 మినిట్స్ ఛార్జ్ తో 1.7 గంటల యూట్యూబ్ ప్లే బ్యాక్ కి తగిన ఛార్జ్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది. అంతేకాదు, డి ఈ సెగ్మెంట్ లో ఈ ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కలిగిన తొలి ఫోన్ అని కూడా వన్ ప్లస్ టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ లో రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ OS గురించి కూడా వన్ ప్లస్ ఈ రోజు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ Oxygen OS 16 సాఫ్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 60 నెలల స్మూత్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కూడా తెలిపింది. అంటే, వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ 5 సంవత్సరాల రెగ్యులర్ అప్‌డేట్స్ అందిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు.

OnePlus N6

పైన తెలిపిన రెండు ఫీచర్స్ ఈరోజు వెల్లడించగా, రెండు రోజుల ముందు ఈ ఫోన్ బ్యాటరీ వివరాలు వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ బిగ్ బ్యాటరీ 7 సంవత్సరాల లాంగ్ లైఫ్ తో వస్తుంది. బ్యాటరీ పరంగా ఈ ఫోన్ మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది.

Also Read: Smart MyJio Assistant: యూజర్ అవసరాలకు తగిన విధంగా స్పందించే కొత్త AI అసిస్టెంట్.!

OnePlus N6 : లాంచ్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ జూన్ 30 న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని స్పెక్స్ మరియు ఫీచర్స్ కూడా వన్ ప్లస్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ మరియు కొత్త వివరాలతో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile