ప్రతి వ్యక్తి జీవితంలో తండ్రి పాత్ర ఎంతో ప్రత్యేకమైనది
ప్రేమ మూర్తికి కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటారు
మీ నాన్నకు పంపేందుకు కొన్ని అందమైన శుభాకాంక్షలు మరియు కోట్స్ ప్రత్యేకంగా ఇక్కడ అందించాము
Happy Fathers Day 2026 best 20 plus wishes and quotes in telugu
ప్రతి వ్యక్తి జీవితంలో తండ్రి పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. కుటుంబానికి అండగా నిలుస్తూ, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసే త్యాగమూర్తి నాన్న. తన ప్రేమను మాటల్లో చెప్పకపోయినా, తన పనుల ద్వారా కుటుంబం పై ఉన్న ప్రేమను చూపిస్తాడు. అలాంటి ప్రేమ మూర్తికి కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే ను జరుపుకుంటారు. రేపు జరగనున్న ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు పంపేందుకు కొన్ని అందమైన శుభాకాంక్షలు మరియు కోట్స్ ప్రత్యేకంగా ఇక్కడ అందించాము.
Happy Father’s Day 2026 : 20 + శుభాకాంక్షలు
నా జీవితానికి మార్గదర్శకుడు మరియు దేవం మీరే నాన్న .. ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
మీ ప్రేమ, మీ కష్టం ఎప్పటికీ మరువలేను నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే!
నా ప్రతి విజయానికి కారణమైన మీకు ఈ జన్మంతా ఋణపడి ఉంటాను.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!
ప్రపంచంలోనే ది బెస్ట్ ఫాథర్ మా నాన్న .. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!
మీరు నా బలం, నా ప్రేరణ, నా ప్రాణం నాన్న .. హ్యాపీ ఫాదర్స్ డే!
జీవితం అంటే ఏమిటి, జీవితంలో ఎలా నిలబడాలో నేర్పిన నాన్నకు పాదాభి వందనాలు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!
మా కోసం మీరు చేసిన త్యాగాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు నాన్న .. హ్యాపీ ఫాదర్స్ డే!
మీ లాంటి తండ్రి ఉండటం ఈ జన్మలో నాకు దక్కిన అదృష్టం.. హ్యాపీ ఫాదర్స్ డే!
మీ ప్రేమ కొలవడానికి నా జీవితం మొత్తం వెచ్చించినా సరిపోదు .. హ్యాపీ ఫాదర్స్ డే!
మా నాన్న నా సూపర్ హీరో, మీరు ఉంటే నాకు ఇంకేదీ అవసరం ఉండదు, నా హీరో కి హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
షార్ట్ మెసేజ్ విషెస్
నాన్నా.. మీ ప్రేమే నా బలం. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న! మీ ఆశీస్సులు నన్ను ఇంత వాడిని చేసాయి హ్యాపీ ఫాదర్స్ డే! నా జీవిత హీరో మీరే నాన్న .. హ్యాపీ ఫాదర్స్ డే మీరు ఉంటే ప్రతి రోజు పండగే నాన్న .. హ్యాపీ ఫాదర్స్ డే. మీ చేయి నా భుజం మీద ఉంటే, ఈ ప్రపంచాన్ని గెలిచేస్తా.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!
Happy Father’s Day 2026 : కొటేషన్స్
తండ్రి నీడ ఉంటే పిల్లల భవిష్యత్తు వెలుగులతో నిండిపోతుంది
నాన్న ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ జీవితాంతం తోడుగా ఉంటుంది
తండ్రి కష్టం ఆ కుటుంబానికి బలమైన పునాది
నాన్న చేతి పట్టుకుని నడిచినవాడు జీవితంలో ఎప్పుడూ ఒంటరిగా ఉండడు
తండ్రి అనుభవం పిల్లలకు గొప్ప సంపద
తండ్రి ప్రేమను మాటల్లో చెప్పలేం, మనసుతో మాత్రమే అనుభవించగలం
నాన్న అంటే భరోసా, ధైర్యం, ప్రేమకు ప్రతిరూపం
ఇక్కడ అందించిన కొన్ని అందమైన శుభాకాంక్షలు మరియు కోట్స్ పంపించి 2026 ఫాదర్స్ డే కోసం మీ నాన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.