Digit.in
  • న్యూస్
  • ఫీచర్స్
  • How to
  • విసువల్ స్టోరీస్
  • English
  • Hindi
  • Tamil
  • Kannada
  • Telugu
  • Malayalam
  • Bangla
  • Marathi
Login / Register is disabled Login
Home » News » General » EPFO వడ్డీ ఈ నెలలో జమ కానుంది.. మీ PF ఖాతాలో పడిందో లేదో ఇలా చెక్ చేయండి.!

EPFO వడ్డీ ఈ నెలలో జమ కానుంది.. మీ PF ఖాతాలో పడిందో లేదో ఇలా చెక్ చేయండి.!

By Raja Pullagura | Updated on 19-Jun-2026
Add DIGIT as a preferred source
Follow Us on Google News Follow Us
HIGHLIGHTS

కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త

EPF వడ్డీని ఈ నెలలో ఎంప్లాయిస్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను EPFO ప్రారంభించనున్నట్లు సమాచారం

మీ అకౌంట్ లో వడ్డీ పడిందో లేదో ఆన్‌లైన్ లో చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు

EPFO వడ్డీ ఈ నెలలో జమ కానుంది.. మీ PF ఖాతాలో పడిందో లేదో ఇలా చెక్ చేయండి.!
Raja Pullagura Raja Pullagura
19-Jun-2026

కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన EPF వడ్డీని ఈ నెలలో ఎంప్లాయిస్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను EPFO ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వడ్డీ రేటు ఆధారంగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాల్లో వడ్డీ జమ చేస్తుంది. వడ్డీ జమ అయిన తర్వాత సభ్యుల PF బ్యాలెన్స్ ఆటోమేటిక్‌ గా పెరుగుతుంది. మీ అకౌంట్ లో వడ్డీ పడిందో లేదో ఆన్లైన్ లో చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

EPFO వడ్డీ అప్డేట్

గతంలో ఉద్యోగులు తమ PF ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే, పెరిగిన టెక్నాలజీతో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా సులభంగా పీఎఫ్ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. దీనికోసం EPFO పోర్టల్, UMANG యాప్ లేదా మిస్డ్ కాల్ వంటి సర్వీస్ లు ఈపీఎఫ్ఓ అందించింది. ఈ సర్వీస్ ద్వారా PF బ్యాలెన్స్‌ తో పాటు వడ్డీ వివరాలు కూడా సింపుల్ గా తెలుసుకునే అవకాశం ఉంది.

EPFO పోర్టల్‌ లో ఎలా చెక్ చేయాలి?

ఈ ప్రాసెస్ లో ముందుగా EPFO అధికారిక సభ్యుల పోర్టల్‌ లో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీ UAN నంబర్ మరియు పాస్‌ వర్డ్ నమోదు చేయాలి. మెయిన్ పేజీ ఓపెన్ అయిన తర్వాత “Passbook” ఆప్షన్‌ ను ఎంచుకోవాలి. సంబంధిత PF ఖాతాను సెలెక్ట్ చేస్తే తాజా బ్యాలెన్స్‌ తో పాటు వడ్డీ జమ వివరాలు కూడా ఇక్కడ మీకు దర్శనమిస్తాయి.

EPFO Interest

UMANG యాప్ ద్వారా స్టెప్ బై స్టెప్ చెక్

  • UMANG యాప్‌ ను ఓపెన్ చేయాలి.
  • EPFO సేవలు ఎంపిక చేయాలి.
  • “View Passbook” ఆప్షన్‌ ను క్లిక్ చేయాలి.
  • UAN వివరాలతో లాగిన్ అయితే PF బ్యాలెన్స్ మరియు వడ్డీ సమాచారం కనిపిస్తుంది.

మిస్డ్ కాల్ లేదా SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు

UAN నంబర్ ఆధార్, PAN లేదా బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉంటే, EPFO అందించే మిస్డ్ కాల్ సేవను ఉపయోగించి PF బ్యాలెన్స్‌ ను తెలుసుకోవచ్చు. అలాగే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి SMS పంపడం ద్వారా కూడా ఖాతా వివరాలు పొందవచ్చు.

Also Read: OnePlus N6: కొత్త సిరీస్ ఫోన్ ను భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్న వన్ ప్లస్.!

వడ్డీ జమ అయినప్పుడు ఏమవుతుంది?

EPFO వడ్డీ జమ అయిన తర్వాత అది మీ మొత్తం PF కార్పస్‌ లో కలుస్తుంది. దీని వల్ల ఉద్యోగ కాలం ముగిసే సమయానికి పెద్ద మొత్తంలో పొదుపు ఏర్పడుతుంది. అందుకే PF ఖాతాదారులు తమ పాస్‌బుక్‌ను తరచుగా పరిశీలించి వడ్డీ జమ అయిందో లేదో నిర్ధారించు కోవడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Latest Article
OnePlus N6: బ్యాటరీ, ఛార్జ్ టెక్ మరియు OS అప్డేట్ రిలీజ్ చేసిన వన్ ప్లస్.! OnePlus N6: బ్యాటరీ, ఛార్జ్ టెక్ మరియు OS అప్డేట్ రిలీజ్ చేసిన వన్ ప్లస్.!
Smart MyJio Assistant: యూజర్ అవసరాలకు తగిన విధంగా స్పందించే కొత్త AI అసిస్టెంట్.! Smart MyJio Assistant: యూజర్ అవసరాలకు తగిన విధంగా స్పందించే కొత్త AI అసిస్టెంట్.!
AI Tools తో ఇంట్లో కూర్చుని డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోండి.! AI Tools తో ఇంట్లో కూర్చుని డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోండి.!
Prime Day 2026 సేల్ ఎఫెక్ట్ తో Sony Dolby సౌండ్ బార్ 7 వేలకే లభిస్తోంది.! Prime Day 2026 సేల్ ఎఫెక్ట్ తో Sony Dolby సౌండ్ బార్ 7 వేలకే లభిస్తోంది.!
Redmi Turbo 5: రెడ్‌మీ మిడ్ రేంజ్ బీస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది.! Redmi Turbo 5: రెడ్‌మీ మిడ్ రేంజ్ బీస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది.!
Most Searched Mobile Phones
  • Best Phones Under 10000
  • Best Phones Under 20000
  • Best Phones Under 30000
  • Upcoming Phones in 2026
  • Latest Mobile Phones
Latest Phones
  • Motorola Edge 70 Pro+
  • Xiaomi 17T
  • Oppo F33 Pro
  • Oppo Find X9 Ultra
  • Motorola Razr Fold
Mobile Recharge Plans
  • Airtel Recharge Plans
  • BSNL Recharge Plans
  • Reliance JIO Recharge Plans
  • VI Recharge Plans
Telugu Tech News
  • EPFO ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
  • Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
  • Jio, Airtel ని మించిన ఫ్రీ ఆఫర్ తెచ్చిన BSNL టెలికాం.!
  • Vivo V60 టాప్ 5 ఫీచర్స్ అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
  • icon
  • icon
  • icon
  • icon
SUBSCRIBE Subscribe for the industry's biggest tech news
Enter your email to get notified about our new solutions
By submitting your email, you agree to our
Terms and Privacy Notice.
CONNECT WITH US
  • icon Times Center, FC-6, 1st Floor, Sector 16A, Film City, Noida - 201301
  • icon (+91-120-6776999)
    (1800 121 0005)
  • icon Suggestion: editor@digit.in
    Business: business@digit.in
    Website: sales@digit.in
© 2026 Digit.in, All rights reserved
  • icon
  • icon
  • icon
  • icon
icon
  • About Us
  • Contact Us
  • Advertise with us
  • Regulatory
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
© 2026 Digit.in, All rights reserved
Digit.in
Logo
Digit.in
Logo