True Wireless 5.1.2 Dolby Atmos ప్రీమియం సౌండ్ బార్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్.!

HIGHLIGHTS

True Wireless 5.1.2 Dolby Atmos ప్రీమియం సౌండ్ బార్ ను ఈరోజు జెబ్రోనిక్స్ లాంచ్ చేసింది

జెబ్రోనిక్స్ ఇండియాలో వరకు అందించని కొత్త డిజైన్ లో ఈ సౌండ్ బార్ ను అందించింది

కేవలం డిజైన్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ కొత్త ఫీచర్స్ మరియు పూర్తి వైర్లెస్ సెటప్ తో లాంచ్ అయ్యింది

True Wireless 5.1.2 Dolby Atmos ప్రీమియం సౌండ్ బార్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్.!

True Wireless 5.1.2 Dolby Atmos ప్రీమియం సౌండ్ బార్ ను ఈరోజు జెబ్రోనిక్స్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. జెబ్రోనిక్స్ ఇండియాలో వరకు అందించని కొత్త డిజైన్ లో ఈ సౌండ్ బార్ ను అందించింది. కేవలం డిజైన్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ కొత్త ఫీచర్స్ మరియు పూర్తి వైర్లెస్ సెటప్ తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ జెబ్రోనిక్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

True Wireless 5.1.2 Dolby Atmos సౌండ్ బార్: ప్రైస్

జెబ్రోనిక్స్ ఈరోజు Juke Bar 9890 సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ను 1030W భారీ సౌండ్ అవుట్ పుట్ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ను రూ. 29,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఇది ప్రీమియం సౌండ్ బార్ మరియు ఈరోజు నుంచి అమెజాన్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 రూపాయల Scapia Federal Bank డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. Buy From Here

Also Read: BSNL One Year Plans: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీ గా ఉండొచ్చు.!

True Wireless 5.1.2 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కొత్త మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ 5.1.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లతో టోటల్ 5 స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఈ బార్ తో జతగా డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.

True Wireless 5.1.2 Dolby Atmos soundbar

ఈ సౌండ్ బార్ కలిగిన పూర్తి సెటప్ తో టోటల్ 1030W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ను డాల్బీ అట్మోస్ మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ZEB ACOUSTI MAX ఆడియో ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ గొప్ప సరౌండ్ అండ్ డీప్ బాస్ సౌండ్ తో సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సౌండ్ బార్ HDMI eARC, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile