BSNL One Year Plans: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీ గా ఉండొచ్చు.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం వీలైనంత తక్కువ ధరలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఆఫర్ చేస్తోంది

పూర్తిగా సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా బిఎస్ఎన్ఎల్ అందించింది

ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీ గా ఉండొచ్చు

BSNL One Year Plans: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీ గా ఉండొచ్చు.!

BSNL One Year Plans: బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం వీలైనంత తక్కువ ధరలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఆఫర్ చేస్తోంది. కేవలం నెల వారి ప్రీపెయిడ్ ప్లాన్లు మాత్రమే కాదు పూర్తిగా సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా బిఎస్ఎన్ఎల్ అందించింది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీ గా ఉండొచ్చు. ఈరోజు ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి వివరంగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL One Year Plans: ఏమిటి ఈ ప్లాన్స్?

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం రెండు బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. వాటిలో ఒకటి రూ. 2,399 బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రెండోది అధిక డేటా అందించే రూ. 2,799 హై డేటా వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా పూర్తిగా అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం.

రూ. 2,399 వన్ ఇయర్ ప్లాన్

ఇది బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందించిన బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది ఇది కాకుండా డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు ఈ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. అదనంగా, డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది.

BSNL One Year Plans

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం మీరు ఒక్కసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ. 200 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే, కేవలం నెలకు రూ. 200 రూపాయల ఖర్చుతోనే అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని లాభాలు అందుకోవచ్చు.

Also Read: Samsung Galaxy S25 Ultra 5G అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తుంది.!

రూ. 2,799 వన్ ఇయర్ ప్లాన్

ఇది కూడా వన్ ఇయర్ లాంగ్ వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసే అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు 100 SMS వినియోగ ప్రయోజనం అందిస్తుంది. ముఖ్యంగా, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 3GB హై స్పీడ్ డేటా మీకు లభిస్తుంది. అంతేకాదు, ఈ డేటా ఖర్చైన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటాని మీరు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం మీరు చెల్లించే మొత్తాన్ని నెల వారీగా లెక్కిస్తే నెలకు కేవలం రూ. 233 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే నెలకు కేవలం రూ. 233 రూపాయల ఖర్చుతో 3GB హాయ్ స్పీడ్ డేటా అన్ని అన్లిమిటెడ్ ప్రయోజనాలు పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile