Samsung Galaxy S25 Ultra 5G అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తుంది.!
Samsung Galaxy S25 Ultra 5G అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తుందని అనౌన్స్
అన్ని ఆఫర్స్ తో కలిపి రూ. 94,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేసింది
ఈ ఫోన్ పై 12 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందిస్తుందని తెలిపింది
Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తుందని అమెజాన్ అనౌన్స్ చేసింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి ఈ డీల్ లభిస్తుందని కూడా వెల్లడించింది. శాంసంగ్ యొక్క ఈ అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో ఈ సేల్ నుంచి లభిస్తుందని అమెజాన్ డీల్ ప్రైస్ అనౌన్స్ చేసింది.
SurveySamsung Galaxy S25 Ultra 5G : ఆఫర్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,29,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్ నుండి రూ. 1,18,999 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై రూ. 3,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి రూ. 1,15,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

అయితే, మే 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి రూ. 94,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేసింది. ఈ ఫోన్ పై కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ అందించడం ద్వారా ఈ ఆఫర్ ధరలో అందిస్తుందని అమెజాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ పై 12 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందిస్తుందని తెలిపింది.
Also Read: న్యూ Dolby Soundbar బిగ్ డిస్కౌంట్ తో రూ. 4,999 ధరకు లభిస్తోంది.. ఎక్కడంటే.!
Samsung Galaxy S25 Ultra 5G : ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా ఫోన్ 6.9 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే కలిగి ఉంటుంది. QHD+ (3120 × 1440) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ snapdragon 8 Elite చిప్ సెట్ తో నడుస్తుంది మరియు 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ప్రీమియం అండ్ పవర్ ఫుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో వెనుక 200MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో మరియు 10MP టెలిఫోటో క్వాడ్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ తో వస్తుంది. అలాగే, ముందు 12MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అద్భుతమైన ఫోటోలు మరియు వీడియోలు కూడా ఆఫర్ చేస్తుంది.
ఈ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం టైటానియం బాడీ మరియు గ్లాస్ బాడీ తో మంచి స్లీక్ డిజైన్ లో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile