EPFO Interest deposit Update and how check your pf account
కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన EPF వడ్డీని ఈ నెలలో ఎంప్లాయిస్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను EPFO ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వడ్డీ రేటు ఆధారంగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాల్లో వడ్డీ జమ చేస్తుంది. వడ్డీ జమ అయిన తర్వాత సభ్యుల PF బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మీ అకౌంట్ లో వడ్డీ పడిందో లేదో ఆన్లైన్ లో చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు.
గతంలో ఉద్యోగులు తమ PF ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే, పెరిగిన టెక్నాలజీతో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా సులభంగా పీఎఫ్ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. దీనికోసం EPFO పోర్టల్, UMANG యాప్ లేదా మిస్డ్ కాల్ వంటి సర్వీస్ లు ఈపీఎఫ్ఓ అందించింది. ఈ సర్వీస్ ద్వారా PF బ్యాలెన్స్ తో పాటు వడ్డీ వివరాలు కూడా సింపుల్ గా తెలుసుకునే అవకాశం ఉంది.
ఈ ప్రాసెస్ లో ముందుగా EPFO అధికారిక సభ్యుల పోర్టల్ లో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీ UAN నంబర్ మరియు పాస్ వర్డ్ నమోదు చేయాలి. మెయిన్ పేజీ ఓపెన్ అయిన తర్వాత “Passbook” ఆప్షన్ ను ఎంచుకోవాలి. సంబంధిత PF ఖాతాను సెలెక్ట్ చేస్తే తాజా బ్యాలెన్స్ తో పాటు వడ్డీ జమ వివరాలు కూడా ఇక్కడ మీకు దర్శనమిస్తాయి.
UAN నంబర్ ఆధార్, PAN లేదా బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉంటే, EPFO అందించే మిస్డ్ కాల్ సేవను ఉపయోగించి PF బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. అలాగే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి SMS పంపడం ద్వారా కూడా ఖాతా వివరాలు పొందవచ్చు.
Also Read: OnePlus N6: కొత్త సిరీస్ ఫోన్ ను భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్న వన్ ప్లస్.!
EPFO వడ్డీ జమ అయిన తర్వాత అది మీ మొత్తం PF కార్పస్ లో కలుస్తుంది. దీని వల్ల ఉద్యోగ కాలం ముగిసే సమయానికి పెద్ద మొత్తంలో పొదుపు ఏర్పడుతుంది. అందుకే PF ఖాతాదారులు తమ పాస్‌బుక్‌ను తరచుగా పరిశీలించి వడ్డీ జమ అయిందో లేదో నిర్ధారించు కోవడం మంచిది.