Redmi Turbo 5 first sale starts from today know the price and features
Redmi Turbo 5: రెడ్‌మీ మిడ్ రేంజ్ బీస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి డిజైన్, ఆకట్టుకునే కెమెరా మరియు ఫాస్ట్ ప్రాసెసర్ వంటి ఫీచర్స్ తో రెడ్‌మీ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ ఫోన్ ఈరోజు ఫస్ట్ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ ఫోన్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
రెడ్‌మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 37,999 ధరతో మరియు హై ఎండ్ (12GB + 256GB) వేరియంట్ ను రూ. 40,999 లో లాంచ్ చేసింది. ఈ రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ టర్బో వైట్, ఆస్పాల్ట్ బ్లాక్ మరియు నైట్రో బ్లూ అనే మూడు సరికొత్త రంగుల్లో లభిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు షియోమీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి లభిస్తుంది.
ఈ కొత్త ఫోన్ పై షియోమీ మొత్తం మూడు ఆఫర్స్ అందించింది. మొదటిది రూ. 2,000 రూపాయల HDFC, BOB, Axis, SBI, Kotak మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్. రెండోది 9 నెలల No Cost EMI ఆఫర్. మూడవది 60% బై బ్యాక్ వాల్యూ ఆఫర్ ఈ ఫోన్ పై అందించింది. అదనంగా, ఈ ఫోన్ పై 3 నెలల Spotify ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ని ఉచితంగా అందిస్తుంది.
Also Read: 6 వేల బడ్జెట్లోనే 5.1 Dolby Digital సౌండ్ బార్ మీ సొంతం చేసుకోండి.!
ఈ రెడ్‌మీ లేటెస్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి పెర్ఫార్మెన్స్ అందించే మీడియాటెక్ Dimensity 8500 Ultra ప్రాసెసర్ తో వచ్చింది. 23 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ ఈ ప్రాసెసర్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 12 LPDDR 5X ర్యామ్ మరియు 256GB UFS 4.1 స్టోరేజ్ తో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Hyper OS 3 సాఫ్ట్ వేర్ తో Android 16 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.
గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం తగిన ఫీచర్స్ కలిగిన కాంపాక్ట్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంది. అదేమిటంటే,ఈ ఫోన్ 6.59 ఇంచ్ కాంపాక్ట్ సైజు AMOLED సూపర్ సన్ లైట్ ఐ ప్రొటెక్షన్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, గొప్ప విజువల్స్ కోసం 1.5K మరియు 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. అదనంగా, ఈ మూవీ లెవల్ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం HDR10+, HDR Vivid మరియు Dolby Vision వంటి గొప్ప ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఈ ఫోన్ లేటెస్ట్ రెడ్‌మీ ఫోన్ లో 50MP (OIS) మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, 20MP సెల్ఫీ కెమెరా కూడా ముందు భాగంలో ఉంటుంది. ఇది 4K రిజల్యూషన్ వీడియో రికార్డింగ్, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్లతో పటు షియోమీ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో భారీ 7560 mAh బ్యాటరీని 100W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.