మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: డైలీ usage బాగా use అవుతుంది.

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: డైలీ usage బాగా use అవుతుంది.

గతంలో మీరు manual గా మొబైల్ ఫోన్ బాలన్స్ ను చెక్ చేసుకునే అవసరం లేకుండా, డయిల్ కోడ్స్ ను గుర్తించుకోవలసిన అవసరం లేకుండా ఆటోమాటిక్ గా మెయిన్ బాలన్స్ అండ్ ఇంటర్నెట్ బాలన్స్ చూపించే యాప్ ను తెలియజేయటం జరిగింది.

ఆ స్టోరీ మిస్ అయిన వారు ఈ లింక్ లో చదవాగలరు. ఇప్పుడు ఇలాంటి అప్లికేషన్ మరొకటి ఉంది ప్లే స్టోర్ లో దీని పేరు స్మార్ట్ బ్రో. ప్లే స్టోర్ లో ఇంతకుముందు యాప్ కన్నా ఒక పాయింట్ ఎక్కువగా ఉంది. 4.4 స్టార్ ఉంది. సైజ్ 2.4MB

ఇది పర్సనల్ గా నచ్చింది. కారణం ఫోన్ చేసే ముందు బ్యాలన్స్ ను మన ఫోన్ డయలర్ యాప్ కార్నర్ లో చూపిస్తుంది. అలాగే కాల్ కంప్లీట్ అయ్యాక కూడా అప్ డేట్ అయ్యి ఎంత బాలన్స్ ఉందో ఆక్కడే కార్నర్ లో చూపిస్తుంది.

ప్రత్యేకంగా నోటిఫికేషన్ బార్ లోకి వేల్లనవసరం లేదు, అలాగే ఎల్లప్పుడూ నోటిఫికేషన్ బార్ లో ఉండదు. కేవలం ఫోన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు నంబర్స్ పైన కార్నర్ లో ఉంటుంది.

యాప్ ఇంస్టాల్ చేసిన వెంటనే మీ రెండు సిమ్ లు ప్రీపెయిడా పోస్ట్ పెయిడా అని సెలెక్ట్ చేయమని అడుగుతుంది. తరువాత బాలన్స్ చెకింగ్ కొరకు కోడ్ ను ఆటోమేటిక్ గా చూపించి సెట్ చేయమని అడుగుతుంది.

ఒక వేల ఆటోమేటిక్ గా చూపించిన కోడ్ తప్పు అయితే మీరు change అనే ఆప్షన్ ద్వారా కోడ్ ను చేంజ్ చేసి పర్మనెంట్ గా సెట్ చేసుకోగలరు.

ఇది కేవలం ఒకసారి జరిగే ప్రాసెస్. అది కూడా కోడ్స్ ను యాప్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది. మొదటి సారి కూడా మీరు కోడ్ కొరకు ఆలోచించనవసరం లేదు.  ఇలా రెండు సిమ్లకు చేయండి. అంతే!

 దీనిలో ఉన్న ఆప్షన్స్ విషయానికి వస్తే…

  • మల్టిపుల్ సిమ్ సపోర్ట్ – మొదటి సిమ్ డేటా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సెకెండ్ సిమ్ డేటా రైట్ సైడ్ చూపిస్తుంది.
  • ఫోన్ చేయకముందు ఎంత ఉంది, చేసిన తరువాత ఎంత ఉంది అని ఫాస్ట్ గా అప్ డేట్ అయ్యి చూపిస్తుంది.
  • అలగే instant గా ఎన్ని సెకెండ్ కి ఎంత అయ్యింది అని బిల్లింగ్ చూడగలరు యాప్ ఓపెన్ చేసి.
  • ఇంటర్నెట్ డేటా కూడా ఎంత ఉంది, ఎంత అయ్యింది అనే కాకుండా ఏ యాప్ ఎంత MB use చేసింది అని చెబుతుంది మొబైల్ ఇంటర్నెట్ ఆన్ చేస్తే.(యాప్ ఓపెన్ చేసి DATA USAGE క్రింద ఉన్న డిటేల్స్ మిద టాప్ చేసి, రైట్ కార్నర్ లో ఉన్న డౌన్ arrow పై టాప్ చేస్తే యాప్ వైజ్ డిటేల్స్ కనిపిస్తాయి)
  • మీరు యాక్టివేట్ చేసుకున్న ఆఫర్స్ యొక్క expiry డేట్స్ ను ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ బార్ లో అలెర్ట్ చేస్తుంది. 

 

సెట్టింగ్స్ ఆప్షన్ కూడా ఉంది యాప్. దానిలో కోడ్స్ ను చేంజ్ చేసుకోవటం,   మెయిన్ బాలన్స్ Low అలర్ట్స్, dialer యాప్ లో ఏ సిమ్ డిటేల్స్ కనిపించాలో వంటివి సెట్ చేసుకోగలరు. ఈ లింక్ లో యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo