ఓలా క్యాబ్స్ ఆప్ లో ఆటో లను బుక్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా?

ఓలా క్యాబ్స్ ఆప్ లో ఆటో లను బుక్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా?
HIGHLIGHTS

మీటర్ చార్జెస్ కే ఆటో ను మీ మొబైల్ నుండి బుక్ చేసుకోండి.

ఓలా క్యాబ్స్ గురించి మీకు తెలుసు కదా. అది ఇప్పుడు ఓలా ఆటో సర్విసస్ ను కూడా నడుపుతుంది.  టోటల్  మీటర్ ధరకు 10 రూ. అదనంగా తీసుకుంటుంది.

ఓలా అప్లికేషన్ నుండి మీరు ఎక్కడ ఉన్నా క్యాబ్స్ ను బుక్ చేసుకోవచ్చు. ఇది చాలా సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుంది. మూడు వేరియంట్స్ లో కార్ లను సర్విసస్ కు నడుపుతుంది ఓలా. మొదటి 4 కిలోమీటర్ల వరకూ 80 రూ. నుండి మొదలవుతుంది క్యాబ్స్ లో. ఆ తరువాత 1 కిలోమీటర్ కు 10 రూ చార్జ్ చేస్తుంది. అయితే బడ్జెట్ యూజర్స్ కోసం ఓలా ఆటో సర్విసస్ ను కూడా నడుపుతుంది. కేవలం ఆప్ ను ఇంస్టాల్ చేసుకొని, కొత్త ఎకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలు.

మీరు ఎక్కడ ఉన్నారో GPS ద్వారా మ్యాప్ లో చూపించి,  ఆటో రైడ్ ను సెలెక్ట్ చేసుకుంటే, మీ దగ్గరలో ఎక్కడెక్కడ ఓలా ఆటో లు తిరుగు తున్నాయో మ్యాప్స్ లో చూపిస్తుంది. ఆ తరువాత మీరు ఎక్కడికి వెల్లాలో అనేది టైప్ చేస్తే 60 సెకెన్లలో మీకు మిమల్ని పిక్ అప్ చేసుకునే ఆటో డ్రైవర్ పేరు, ఆటో నెంబర్, డ్రైవర్ మొబైల్ నంబర్ ను చూపిస్తుంది (కొన్ని సార్లు మెసేజ్ కూడా చేస్తుంది. నెట్ స్పీడ్ తక్కువుగా ఉండి స్క్రీన్ పై ఎటువంటి అప్డేట్ లేనప్పుడు మెసేజ్ ఉపయోగపడుతుంది). ఇక మీరు అతనికి కాల్ చేసి ఆటో ఎక్కడకి రావాలో చెప్పి, మీ గమ్యానికి చేరువ కావచ్చు. ప్రస్తుతానికి ఓలా ఆటో సర్విస్ హైదరాబాదు, బెంగుళూర్, చెన్నై, పూణే, డిల్లీ, ఆహ్మేదాబాద్ నగరాలలో రన్ అవుతుంది.

పేమెంట్ మాత్రం డైరెక్ట్ కేష్ లేదా ఓలా అప్లికేషన్ లో మీరు ముందుగా డబ్బులు వేసుకుంటే, ఓలా ఆప్ నుండి మనీ కట్ అయిపోతుంది. అయితే ఆప్ నుండి మనీ కట్ అవ్వాలంటే డ్రైవర్ మొబైల్ లో స్టాప్ ను సెలెక్ట్ చేస్తే, మీ రిజిస్టర్ నంబర్ కు కోడ్ వస్తుంది, దానిని డ్రైవర్ తన మొబైల్ లో ఎంటర్ చేస్తే ఇక పేమెంట్ అయిపోయినట్టే. మీకు ఏ డ్రైవర్ అయినా ఎక్కువ అడిగే అవకాసం లేదు ఎందుకంటే వాళ్లని మనం రేటింగ్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవచ్చు ఆప్ లో. ఇది వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్లు సైతం మనం ఆటో దిగాక రేటింగ్ మంచిగా ఇవ్వండి అని అడుగుతారు.

మీరు కొత్తగా రిజిస్టర్ అయితే, ఓలా 100రూ. లను ఉచితంగా వాడుకోవటానికి ఇస్తుంది. అలాగే ఎవరినైనా ఇన్వైట్ చేసినా, మీరు ఇన్వైట్ చేసిన వాళ్లు ఓలా ను ఉపగించినా, మీకు కొన్ని డబ్బులు ఓలా ఆప్ లో వస్తాయి.

దీనిపై పూర్తి వివరాలు ఇక్కడ చూడ గలరు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo