FlipKart లేటెస్ట్ అప్డేట్ మీ పర్సనల్ కాంటాక్ట్స్ ను వాడుకుంటుంది.

FlipKart లేటెస్ట్ అప్డేట్ మీ పర్సనల్ కాంటాక్ట్స్ ను వాడుకుంటుంది.
HIGHLIGHTS

ఇది నిజంగా మీరు పట్టించుకోవలిసిన విషయం. కింద మొత్తం ఆర్టికల్ చదవండి.

తాజాగా ఫ్లిప్ కార్ట్ అప్లికేషన్ అప్డేట్ వదిలింది. ఈ అప్డేట్ లో మీ కాంటాక్ట్స్ మరియు SMS లను ఫ్లిప్ కార్ట్ వాడుకునే పర్మిషన్ మీరు ఆప్ ఇంస్టాల్ చేసుకునే సమయంలో అడుగుతుంది. ఎలాగూ అందరూ దానిని పట్టించుకోకుండా ఎక్సప్ట్ చేసి ఆప్ ను ఇంస్టాల్ చేసుకుంటారు. కాని ఇది జాగ్రత్త పడవలిసిన సందర్భం,

                                                 
ఇదే విషయం గురించి మేము ఫ్లిప్ కార్ట్ ను ట్విట్టర్ లో (@Flipkartsupport) ప్రశ్నించగా అది సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేదు. 

@undertecher We need access to contact to pre-fill your information wherever required and SMS to auto-verify One-Time Passcodes.

— flipkartsupport (@flipkartsupport) June 4, 2015

 

@undertecher Details are shared in this link: http://t.co/yIKJOQ34hU. Do check.

— flipkartsupport (@flipkartsupport) June 4, 2015 
                               

 ఫ్లిప్ కార్ట్ దీనిపై ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఆప్ నుండి OTP వచ్చినప్పుడు దానిని ఆటోమేటిక్ గా ఫిల్ చేయటానికి sms లను చదువుతాము, అలాగే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ను మీకు శ్రమ లేకుండా మేము ప్రీ ఫిల్ చేయటానికి కాంటాక్ట్స్ ఏక్సిస్ తీసుకుంటున్నాం అని అన్నాది. కాని మిగితా కాంటాక్ట్స్ అది ఏక్సిస్ చేయదు అని కూడా మెన్షన్ చేస్తుంది. అయితే కంటాక్ట్స్ ఒక్కసారి ఆప్ కు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇస్తే ఎలా ఉంటుందో కింద ఇమేజ్ లో చూడండి.
                                              
ఇప్పుడు ఇది రెండు రకాలుగా మనకు కలవర పెట్టవచ్చు, ఒకటి ఫ్లిప్ కార్ట్ కు కాంటాక్ట్ లను వాడుకునే ఉద్దేశం లేకపోతె, అసలు మన ఫోన్ కాంటాక్ట్స్ పర్మిషన్ తీసుకోదు. మీరు ఆల్రెడీ ఫ్లిప్ కార్ట్ మెంబర్ అయ్యి ఉంటారు కాబట్టి, మనం ముందే ఇచ్చిన కాంటాక్ట్ మరియు ఇతర సమాచారం నుండి అది ఇన్ఫర్మేషన్ ను సేకరించుకోవచ్చు. ఏదైతే ప్రీ ఫిల్లింగ్ అని ఫ్లిప్ కార్ట్ చెబుతుందో అది ఆల్రెడీ మీరు మెంబర్ అయినప్పుడే ఇస్తారు. అంతకీ కాకపొతే దానికి కావలిసినప్పుడు మిమ్మల్ని అడిగితే, ఇలా అన్నీ ఏక్సిస్ చేయకుండా మీరు అడిగినప్పుడు ఇచ్చే అవకాశం కూడా ఉంది.
రెండవది… ఆండ్రాయిడ్ ఆప్ పర్మిషన్ సిస్టం లో ఉన్న లిమిటేషన్స్ వలన ప్రస్తుత ఆండ్రాయిడ్ వెర్షన్స్ లో ఆప్ పెర్మిషన్స్ ను మీకు నచ్చినట్టు ఒప్పుకోవటానికి అవ్వదు, అంటే ఇక బలవంతంగా అయినా ఫ్లిప్ కార్ట్ ఆప్ మీ కాంటాక్ట్ లను , అంటే మీ ఫేమిలీ మరియు దగ్గరి వాళ్ల సమాచారం వాల్ల చేతిలో పెట్టినట్టే. 

అయితే ఫ్లిప్ కార్ట్ ఆప్ ఈ పర్మిషన్స్ ఇవ్వకపోయినా బాగా పనిచేస్తుందా?
ఇదే విషయం పై మేము Xiaomi ఫోన్లలో (Xiaomi ఆపరేటింగ్ సిస్టం లో ఆప్ పర్మిషన్స్ మీకు నచ్చినట్టుగా ఒప్పుకోవచ్చు) టెస్ట్ చేయగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, పైగా కొనేటప్పుడు కూడా దానికి కావలిసిన ఇన్ఫర్మేషన్ ను అంతా అన్ని ఫిల్ అయ్యి ఉన్నాయి. అంతేకాక ఫ్లిప్ కార్ట్ మొత్తం పర్మిషన్స్ అన్ని డినే చేసి వస్తువులను కొని చూసాం, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. అంటే ఫ్లిప్ కార్ట్ అడిగిన పరిమిషన్స్ కి అది చెప్పిన రిజన్స్ అబద్ధం. అది కేవలం వేరే ఉపయోగాలకి మన ప్రవేట్ ఇన్ఫర్మేషన్ ను సేకరించటానికే ఇలా చేస్తుంది.  
                                              
అయితే మిగతా అప్లికేషన్స్ ఏవీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ను తీసుకోవటం లేదా?
PayTM లాంటి ఆప్స్ తీసుకుంటున్నాయి, కాని మీరు ఇతరలు కు రీచార్జ్ చేసే సందర్భాలు వస్తాయి కాబట్టి, అది తీసుకుంటుంది. మీరు ఫోన్ నంబర్ ను మరిచినప్పుడు, మీ కాంటాక్ట్ లిస్టు నుండి కావలిసిన నంబర్ ను సెలెక్ట్ చేసుకొని రీచార్జ్ చేయటానికి ఇది కాంటాక్ట్స్ పర్మిషన్ తీసుకోవటం జరుగుతుంది. అయితే ఫ్లిప్ కార్ట్ వలె ఈ కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్, స్నాప్ డీల్, జబంగ్, మింత్రా కాంటాక్ట్ ఏక్సిస్ ను అడగటం లేదు.
                                             
అసలు దీనిపై ఫ్లిప్ కార్ట్ క్లారిఫికేషన్ ఎందుకు స్పష్టంగా లేదు?
ముందుగా ఫ్లిప్ కార్ట్ కమ్యూనికేషన్ టీం ను కాంటాక్ట్ చేయగా ఇంతవరకూ రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్లు. తరువాత ట్విట్టర్ లో అడగగా ఇంతకముందు మేము పైన చెప్పినట్టుగా సమాధానం ఇచ్చింది. అలగే గూగల్ ప్లే లింక్ ను తెలివిగా bit.ly తో పంపించి ముందు చెప్పిన విషయాన్నే ఫ్లిప్ కార్ట్ పేజ్ లో పొందిపరిచి అక్కిడికి వెళ్ళే లింక్ ను ఇచ్చారు. 

ఫ్లిప్ కార్ట్ ఎందుకు ఇదంతా చేస్తుంది?
అయితే కొన్ని రోజులుగా నిజాలు ఇంకా స్పష్టంగా తెలియదు కాని ఫ్లిప్ కార్ట్ పూర్తిగా ఆప్ మార్కెట్ ను మాత్రమే చేయనుంది అనే వార్తలు వచ్చాయి. ఆల్రెడీ Myntra ఆప్ తో ఆ ప్రయత్నం కూడా చేసింది. Myntra కంప్లీట్ వెబ్ సైటు ను ఆపేసి కేవలం అప్లికేషన్ లోనే బిజినెస్ చేస్తుంది. కేవలం ఆప్ మార్కెట్ ను ఎంచుకున్నప్పుడు ఫ్లిప్ కార్ట్ సంస్థకు వినియోగదారులు డేటా అధికంగా కావలిసి ఉంటుంది. అందుకే "ఇతర కాంటాక్ట్ లను మేము ఏక్సిస్ చేయము" అని ఫ్లిప్ కార్ట్ చెబుతున్నా నమ్మటానికి వీలుగా లేదు.

మీరు ఆ న్యూ అప్డేట్  పర్మిషన్స్ ఇవ్వకుండా ఎలా తప్పించుకోవచ్చు?
ప్లే స్టోర్ లో ఫ్లిప్ కార్ట్ ఆప్ ను ఓపెన్ చేయండి. అక్కడ ఆప్షన్స్ (మీ ఫోన్ కింద ఫిజికల్ బటన్ లలో ఒక దానిని ప్రెస్ చేస్తే వస్తాయి) లో, "Auto Update" ఆప్షన్ ను ఎంచుకోకుండా ఉంటే, మీకు తలనొప్పి ఏమీ ఉండదు. అప్లికేషన్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వదు. అయితే ఇది ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ అప్ డేట్ ను ఇంస్టాల్ చేయని వారికి మాత్రమే పనికొస్తుంది.

New Update:
తాజగా మళ్ళీ ఫ్లిప్ కార్ట్ దీనిపై ఇలా స్పందించింది –  "మొబైల్ లాగిన్ ప్రోసస్ ను సింపుల్ గా చేసేందుకు మీ నంబర్ ను ఆటోమేటిక్ గా ఫిల్ చేసేందుకు ఆ కాంటాక్ట్స్ పర్మిషన్ తీసుకున్నాం".
అయితే ఇది యూజర్ ఆల్రెడీ ఇచ్చిన డేటా నుండి నంబర్ ను తీసుకోవచ్చు కదా అని మేము తిరిగి వేసిన ప్రశ్న కోసం జవాబు ఇంకా ఎదురుచూస్తున్నాం.

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo