మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ బాలేదా? దీనికి మించిన బెస్ట్ ఆండ్రాయిడ్ బ్యాటరీ సేవింగ్ అప్లికేషన్ లేదు.

మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ బాలేదా? దీనికి మించిన బెస్ట్ ఆండ్రాయిడ్ బ్యాటరీ సేవింగ్ అప్లికేషన్ లేదు.
HIGHLIGHTS

బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ను క్లియర్ చేసే సాధారణ యాప్ కాదు ఇది..

సాధారణంగా బ్యాటరీ సేవింగ్ యాప్స్ అంటూ చాలా కనిపిస్తాయి ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో. వాటిలో 95 శాతం అన్నీ బ్యాక్ గ్రౌండ్ రీసెంట్ యాప్స్ ను క్లియర్ చేయటం లేదా కొన్ని సెట్టింగ్స్ ను ఆఫ్ చేయటానికే. ఇది రియల్ బ్యాటరీ సేవింగ్ కాదు వాస్తవానికి. ఎందుకంటే..?
1. రీసెంట్ యాప్స్ లేదా బ్యాక్ గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ ను క్లియర్ చేస్తే, అవి  కొన్ని నిమిషాలలోనే మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. క్లోస్ అయిన తరువాత మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అవటం అంటే, యాప్ సోర్సెస్ అన్నీ మళ్ళీ మొదలు పెట్టడం..ప్రోసెస్ ను కూడా మొదటి నుండి స్టార్ట్ చేయటం. సో ఈసారి మరింత ఎక్కువ ర్యామ్, తద్వారా బ్యాటరీ తీసుకుంటాయి initiate అవటానికి.
2. యాప్స్ ను క్లోస్ చేసుకుంటే, మీకు రావలసిన నోటిఫికేషన్లు రావు. కొన్ని యాప్స్ నోటిఫికేషన్స్ వెస్ట్ అయి ఉండవచ్చు, కాని ఫేస్ బుక్, వాట్స్ అప్, ట్విటర్ etc పుష్ నోటిఫికేషన్స్ యాప్స్ మీకు అవసరమే కదా. ఓవర్ ఆల్ గా పుష్ నోటిఫికేషన్లు చాలా unstable గా ఉంటాయి.
3. ఈ సో కాల్డ్ బ్యాటరీ సేవింగ్ యాప్స్ కూడా నిరంతరం బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. 
4. ఇది ఇంపార్టెంట్. ఈ యాప్స్ ఇంస్టాల్ చేసుకొని, గంటకు ఒకసారి మెమరీ క్లీనింగ్ అంటూ సింగల్ బటన్ క్లిక్ అండ్ యానిమేషన్ బాగుంది కదా అని చేయటానికి పెద్దగా విముఖత చూపించము. అలా ఇది ఒక అలవాటు గా మారిపోతుంది. 

కాని అన్ని సార్లు క్లియరింగ్ ఎందుకు చేస్తున్నామనే సింపుల్ పాయింట్ ను వదిలేస్తాము. మీరూ యాప్స్ ఓపెన్ చేస్తుంటే, ఫ్రీ ర్యామ్ తక్కువై, ఫోన్ స్లో గా అనిపిస్తుందా నిజంగా అసలు? అలా స్లోగా అనిపిస్తేనే చేయాలి కదా!? అలాగే మీ బ్యాటరీ నిజంగా తక్కువ బ్యాక్ అప్ ఇస్తుందా లేదా ఊరికే అలవాటు పడిపోయి బేటరీ సేవింగ్ యాప్స్ ను వాడి అన్నీ క్లోస్ చేస్తున్నారా? 

దీని వలన మీ ఫోన్ లో ర్యామ్ మరియు బ్యాటరీ బాగున్నా మీరు ఆ రెండు విషయాలను ఒక లోపాలుగా తీసుకోని వాటి గురించే ఆలోచిస్తూ స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడలో దానికి విరుద్దంగా యాప్స్ అన్నీ క్లియర్/క్లోస్ చేయటం చేస్తుంటారు.

కాని ఈ మధ్య Clean Master వంటి యాప్స్ ను ఒకే యాప్ లో చాలా అధికంగా ఆప్షన్స్ ఇచ్చి, యుసర్స్ ను ఆకర్షించే ప్రయత్నాలను చేస్తున్నాయి. ఒక యాప్ ఒక ఫీచర్ లేదా ఆప్షన్ ను మనకు అందిస్తూ పనిచేస్తే, అది తక్కువ రిసోర్సెస్ (ర్యామ్ అండ్ బ్యాటరీ) ను వాడుతాయి, సో తక్కువ ఫోన్ వాడకము ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ లో. అదే మనకు అవసరం లేని ఫీచర్స్ ను కూడా ఇస్తూ, కావలిసినవి ఒకటో రెండో అవసరాలను ఉంటే అవి వాడటం స్మార్ట్ చాయిస్ కాదు, పైగా అధిక బ్యాటరీ అండ్ ర్యామ్ use.

సో.. మరి నిజంగా బ్యాటరీ లైఫ్ బాలేని వారికీ మరియు ర్యామ్ తక్కువుగా ఉండి ఫోన్ స్లో అయితే.. వాళ్లకి సల్యుషణ్ ఏంటి?

సింపుల్ ఆన్సర్ Greenify అప్లికేషన్. ఇది ఇప్పటికే చాలా మందికి తెలిసిన యాప్. కాని తెలియని వారికి ఇది మంచి ఇన్ఫర్మేషన్. ఇది ఏమి చేస్తుంది? ఎందుకు మిగిలిన వాటి కన్నా బెస్ట్ యాప్?

1. Greenify బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ను క్లియర్ చేయటం అనే పద్దతిలో పనిచేయదు. అస్సలు మనం వాడని, మనకు అక్కర్లేని యాప్స్ ను పర్మనెంట్ గా క్లోస్ చేయటం greenify concept. దీనిని wake clocks అని అంటారు.

2. అలాగే మనకు నోటిఫికేషన్ ఇచ్చే యాప్స్ ను కూడా క్లోస్ చేస్తుంది కాని కావాలంటే నోటిఫికేషన్స్ ను మాత్రం మిస్ అవ్వకుండా సెట్ చేసుకోవ్వచ్చు. అంటే Greenify నోటిఫై యాప్స్ ను కొంత ఇంటర్వెల్ కు ఓపెన్ చేసి మళ్ళీ పర్మనెంట్ గా క్లోజ్ చేస్తుంది.

3. అలాగే ఒక యాప్ దాని అంతట అది ఓపెన్ అవ్వకపోయినా, ఫోన్ రీస్టార్ట్ లో అప్లికేషన్ స్టార్ట్ అవ్వకపోయినా , ఒక అప్లికేషన్ ను  మరొక యాప్ ను ఓపెన్ చేస్తుంటాయి ఆండ్రాయిడ్ లో. కాని greenify ఒకసారి క్లోజ్ చేస్తే మరే ఇతర యాప్స్ greenify చేయబడిన యాప్ ను ఓపెన్ చేయకుండా చేస్తుంది.

4. పర్మనెంట్ గా క్లోజ్ అంటే, యాప్ ను డిసేబుల్(టైటానియం బ్యాక్ అప్ యాప్ లా Freezing) చేయదు. జస్ట్ ఓపెన్ అవకుండా చేస్తుంది. అంటే మీరు యాప్ తో అవసరం ఉండి ఓపెన్ చేస్తే వెంటనే ఓపెన్ అవుతుంది. మీ పని అయిపోయి దాని నుండి బయటకు వచ్చిన తరువాత అది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవకుండా ఉండటానికి Greenify దానిని క్లోజ్ చేస్తుంది. దీనిని Hibernation అంటారు. 

5. మీ ఫోన్ హోం స్క్రీన్ పై, Greenify హైబర్నేషన్ షార్ట్ కట్ కూడా పెట్టుకోగలరు. అంటే మీరు hibernate అవ్వటానికి ముందు సెట్ చేసుకున్న యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఓపెన్ అయ్యి ఉన్నాయని అనిపిస్తే, దీనిపై టచ్ చేస్తే అవన్నీ hibernation లోకి వెళ్తాయి.

6. కాని మీరు manual గా hibernate చేయనవసరం లేదు ప్రతీ సారి. దీనిలో ఆటోమేటిక్ hibernation ఫీచర్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో cpu ను వాడదు. కేవలం 5MB ర్యామ్ ను మాత్రమే వాడుతుంది. సో బ్యాటరీ కూడా సేఫ్.

6. మీరు స్క్రీన్ లాక్ చేసిన వెంటనే యాప్స్ hibernate అయ్యేలా ఆప్షన్ సెట్ చేసుకోగలరు. అయితే Greenify వాడటానికి root చేసుకొని ఉండాలి ఫోన్ లో. కాని ఇది మొన్నటి వరకూ. ఇప్పుడు root చేయకపోయినా అందరికీ పనిచేస్తుంది Greenify. కాకపోతే కొన్ని ఫీచర్స్ పనిచేయవు కాని బేసిక్ ఫీచర్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి.

రూటింగ్ అంటే ఏంటో తెలియదా? రూటింగ్ పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో ఉంది. చదవగలరు. ఈ లింక్ నుండి Greenify యాప్ ను ఇంస్టాల్ చేయండి. 4.5 star రేటింగ్ తో జస్ట్ 2.36MB సైజ్ లో ఉంటుంది. అంటే ఫోనులో ఎక్కువ రిసోర్సెస్ ను వాడదు. సింపుల్ అండ్ వెరీ యూస్ఫుల్. . మిగిలిన యాప్స్ లా అనవసరమైన ఫీచర్స్ ఉండవు.

ఏలా వాడాలి?
యాప్ మొదట్లో వాడటానికి కష్టం గా ఉంటుంది ఎందుకంటే అనీ సింబల్స్ లోనే ఉంటాయి, ఫీచర్ పేరులు ఏమీ ఉండవు. కాని సింపుల్ గా అలవాటు అయిపోతుంది.  ఇక్కడ ఎలా వాడలో క్లియర్ గా మీ కోసం..

1. యాప్ ను ఓపెన్ చేసిన వెంటనే పైన ప్లస్ సింబల్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు hibernate చేసుకోవటానికి యాప్స్ లిస్టు కనపడతుంది. 

2. పైన రైట్ సైడ్ కార్నర్ లో 3 డాట్స్ లైన్ ఉంటుంది. దాని పై టచ్ చేసి show all ఆప్షన్ enable చేయండి. ఇది సిస్టం యాప్స్ ను కూడా చూపిస్తుంది.

3. క్రిందకు స్క్రోల్ చేయండి. Show more apps పై టచ్ చేస్తే, యాప్స్ అనీ లిస్ట్ అవుతాయి. ఇక కనిపించే యాప్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి క్రింద గ్రీన్ కలర్ లో ఉన్న 3 Z సింబల్స్ ఉన్న సర్కిల్ బటన్ ను ప్రెస్ చేయటమే. అంతే!

అయితే మీరు వాడని వాటిని మాత్రమే చేయండి. కొన్ని రోజులు యాప్ ను గమనించిన తరువాత, మీరు వాడే యాప్స్ మరియు సిస్టం యాప్స్ ను కూడా సెలెక్ట్ చేసి hibernate చేయండి. కాని మెసేజెస్ అండ్ కాలింగ్ యాప్ లను చేయకండి.

4. ఏదైనా అప్లికేషన్ సరైన విధముగా (stable) పనిచేయటం లేదు అనిపిస్తే, దానిని hibernation లిస్టు నుండి తొలిగించండి. ఎలా చేయాలి?… greenify ఓపెన్ చేస్తే headings తో లిస్టు కనిపిస్తుంది. 

5. అందులో HIBERNATED లిస్టు లో మీరు తొలిగించాలని అనుకున్న యాప్స్ ను సెలెక్ట్ చేసి, టాప్ రైట్ కార్నర్ లో ఉన్న 3 డాట్స్ లైన్ పై టచ్ చేయండి. అక్కడ "Degreenify selected app" ఆప్షన్ ను క్లిక్ చేస్తే యాప్స్ hibernate(బ్యాక్ గ్రౌండ్ లో స్టాప్/క్లోస్ అవకుండా) అవ్వవు.

ఈ ఆర్టికల్ మీకు నిజంగా నచ్చితే, మళ్ళీ ఫేస్ బుక్ పేజ్ లోకి వెనక్కి వెళ్లి,(కొంచెం ఇబ్బందే తెలుసు! కాని మా కోసం 🙂 )  పోస్ట్ ను షేర్ చేయగలరు దయచేసి.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo