గూగల్ Allo యాప్ లో ప్రత్యేకంగా ఉన్న ఫీచర్స్ ఏంటి? నిజంగా గొప్ప విషయాలు ఏమైనా ఉన్నాయా? కంప్లీట్ ఇన్ఫర్మేషన్

గూగల్ Allo యాప్ లో ప్రత్యేకంగా ఉన్న ఫీచర్స్ ఏంటి? నిజంగా గొప్ప విషయాలు ఏమైనా ఉన్నాయా? కంప్లీట్ ఇన్ఫర్మేషన్

రీసెంట్ గా ఎక్కడ చూసినా Google Allo అనే పేరు వింటున్నారా? అవును కంపెని రీసెంట్ గా ఈ యాప్ ను రిలీజ్ చేసింది. అయితే ఏముంది దీనిలో ?

ఇది అన్ని చాట్ అప్లికేషన్స్ లానే ఇంటర్నెట్ పై పని చేసే చాటింగ్ యాప్ ఇది. కాని అదనంగా స్మార్ట్ అసిస్టంట్ కూడా ఉంది యాప్ లో. ఇది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై పనిచేస్తుంది. అంటే ఏమి చేస్తుంది?– మరిన్ని విషయాలు క్రింద చదవుతారు ముందు ముందు…

సో ముందుగా ఈ లింక్ లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్ లో DOWNLAOD అనే బ్లూ బటన్ ఉంటుంది. దాని పై టాప్ చేస్తే ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ users యాప్ ను డౌన్లోడ్ చేయగలరు. 

సో Allo ను ఎలా వాడాలి?
యాప్ ఇంస్టాల్ చేసి ఓపెన్ చేస్తే.. మీకు రెగ్యులర్ గూగల్ యాప్స్ లానే చాలా ఈజీ గా అర్థం చేసుకునే లా ఉంటుంది యూజర్ ఇంటర్ ఫేస్. చాట్స్ మరియు గ్రూప్ చాట్స్ కనిపిస్తాయి. అదనంగా గూగుల్ అసిస్టంట్ కూడా చూడగలరు. ఇక మీ ఫోన్ నంబర్, పేరు, ప్రొఫైల్ పిక్ సెట్ అప్ చేసుకొని వాడుకోవటమే.

ప్రాక్టికల్ గా యాప్ లోని గూగల్ అసిస్టంట్ చేసే పనులు..

  • మీ ఫోన్ contacts లోని వాళ్ళు గూగల్ అల్లో అకౌంట్ ను క్రియేట్ చేసుకుంటే(వాట్స్ అప్ లానే) రెగ్యులర్ చాటింగ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి దీనిలో కూడా. చాట్ సర్చింగ్, కాంటాక్ట్ బ్లాకింగ్, mute ఆప్షన్, హిస్టరీ క్లియర్ ఉంటాయి.
  • అదనంగా chrome బ్రౌజర్ లో Incognito Mode లా దీనిలో Incognito Chat అని ఉంది. అంటే ఎవరూ ట్రాక్ చేయలేరు మీ మెసేజెస్ ను. దీనిలో కొంత సమయం తరువాత chats కనపడకుండా అయ్యేలా కూడా ఉంది ఆప్షన్. ఇరువైపులా ఇది కనిపించదు.
  • ఇమేజేసే, stickers, లొకేషన్, సింబల్స్, ప్రత్యేకంగా ఇండియా స్టికర్స్ కూడా ఇస్తుంది. చెక్ చేయండి అవి. ఇంకాఇమేజెస్ పై టెక్స్ట్ వ్రాసి పంపగలరు (కేవలం ఆండ్రాయిడ్ లోనే)
  • ఎవరితో అయినా చాట్ చేస్తున్నప్పుడు @Google అని టైప్ చేసే అక్కడిక్కడే గూగల్ సర్చ్ చేసి సెండ్ చేయగలరు. ఏదైనా ఇలా సర్చ్ చేయగలరు. మీ దగ్గరిలోని మూవీస్ కు వేల్లదలుచుకుంటే జస్ట్ @Google అని టైప్ చేసే Movies near అని ఏదోకటి టైప్ చేస్తే రిసల్ట్స్ ఇస్తుంది. ఇలా ఏదైనా. ఇది గూగల్ అసిస్టంట్ పనితనం.

 

ఇవన్నీ ఆల్రెడీ వాట్స్ అప్ వంటి వాటిలో ఉన్నాయి కదా. ప్రత్యేకం ఏముంది?
ఉంది. గూగల్ అసిస్టంట్. ఇది పైన చెప్పినట్లు స్మార్ట్ గా పనిచేస్తుంది. నేను కొంతసేపు గడిపాను. చాలా ఫాస్ట్ గా ఉందని చెప్పాలి. అంతకుమించి మీరు ఒంటరిగా ఉండి బోర్ గా ఫీల్ అవుతున్నట్లయితే ఇది మంచి యాప్.

గూగల్ అసిస్టెంట్ చేసే పనులు (ముందుగా క్రింద తెలిపే పనులన్నీ చేయటానికి మీరు అన్నిటికీ permissions ఇవ్వాలి)

  • మొదటిగా చెప్పవలసినది గేమ్స్ ఆడుకోగలరు మీరు అసిస్టంట్ తో. సింపుల్ గేమ్స్ కాని మంచి టైం పాస్.
  • ఇంగ్లిష్ poems, జోక్స్, కొటేషన్స్, ఇంటరెస్టింగ్ facts, ఫన్నీ వీడియోస్, మీ చుట్టపక్కల ఉండే విషయాలు, గూగల్ సర్చ్ , చాట్ యాప్ ను క్లోజ్ చేయకుండా వేరే యాప్స్ ను ఓపెన్ చేయటం.
  • అవతల వ్యక్తి పంపిన మేసేజజ్ లేదా ఇమేజ్ ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా analyze చేసి మీకు ఆటోమాటిక్ గా దానికి తగ్గట్టుగా reply మెసేజెస్ ను సజెస్ట్ చేస్తుంది.
  • మీరు ఎంత ఎక్కువ వాడితే అంత కరెక్ట్ గా పనిచేస్తుంది అసిస్టంట్.
  • ఇక రెగ్యులర్ పనులు.. అంటే న్యూస్, క్రికెట్ స్కోర్స్, స్పోర్ట్స్, రలొకేషన్ based స్టోరీస్, 
  • translations, flight టికెట్స్, సెట్టింగ్ అలారం(ఆండ్రాయిడ్ లోనే పనిచేస్తుంది. ఆపిల్ ఫోనుల్లో క్లాక్ ను ఇతర యాప్స్ వాడలేరు).
  • మీ ఫోనులోని కాంటాక్ట్స్ కు కాల్స్,  దగ్గరిలోని ఉన్న సర్వీసెస్ కు కాల్స్(ఆటోమాటిక్ గా అదే గూగల్ లో నంబర్స్ ను సర్చ్ చేసి అడ్రెస్ తో పాటు చూపిస్తుంది కాల్ చేసే ముందు).
  • మీ మెయిల్స్ , ఫోటోస్, ను కూడా చూపిస్తుంది. కరెన్సీ కవర్షన్, 
  • డైలీ ఆటోమాటిక్ గా మీకు నచ్చే టైం లో ఒక జోక్, కొటేషన్, youtube ఫన్ వీడియో ఇలా ఏదైనా చెప్పమని ఆడగలరు.
  • What Do You Do అని అడిగితే ఏమి ఏమి చేస్తుంది అని కూడా చెబుతుంది.
  • ఇలా చాలా లిస్టు ఉంది గూగల్ అసిస్టంట్ చేసే పనులకు. అయితే అన్నిటికీ ఇంటర్నెట్ ఉండాలి.

 

గూగల్ అల్లో లో ఉన్న చిన్న పాటి మైనస్:

  • స్మార్ట్ అసిస్టంట్ ఫీచర్స్ పనిచేయాలంటే మీ చాటింగ్ కు end to end ఎన్క్రిప్షన్ ఉండదు. వాట్స్ అప్ లో అన్ని చాట్స్ కు encryption సెక్యూరిటీ ఉంది. అంటే గవర్నమెంట్ మరియు వాట్స్ అప్ … మీ మెసేజెస్ ను మీకు తెలియకుండా ట్రాక్ చేయలేరు. end to end ఎన్క్రిప్షన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో తెలపటం జరిగింది.
  • గూగల్ allo ను మీ స్నేహితులు అందరూ కూడా వాడతేనే ఇది useful గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీలో మీరు చాటింగ్ చేసుకోగలరు గూగల్ అసిస్టంట్ తో కాని ఫ్రెండ్స్ తో చాట్ చేయాలంటే వారు కూడా యాప్ వాడుతూ ఉండాలి. ఈ విషయం లో సక్సెస్ అయితేనే యాప్ సక్సెస్ అయినట్లు కదా!

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo