బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్ in ఆండ్రాయిడ్ ప్లే స్టోర్

బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్ in ఆండ్రాయిడ్ ప్లే స్టోర్
HIGHLIGHTS

అన్ని తెలుగు పాటలకు లిరిక్స్ ను చూపిస్తుంది.

గూగల్ ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్ గా గూగల్ ప్లేయర్ వస్తుంది. అయితే ప్లే స్టోర్ లో మ్యూజిక్ ను ప్లే చేసుకోవటానికి చాలా థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. వాటి అన్నిటిలోకి బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్, MusixMatch  యాప్. ఇది ఎందుకు బెస్ట్ అనేది కింద detailed గా తెలుసుకుందాము రండి.

MusixMatch music & Lyrics పేరుతో ఇది గూగల్ ప్లే స్టోర్ లో ఈ లింక్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఐ os, ఆండ్రాయిడ్ మరియు విండోస్ 8 డెస్క్టాప్ లకు పనిచేస్తుంది. ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. 

ఏంటి దీని స్పెషల్:

చాలా రిచ్ యూజర్ ఇంటర్ఫేస్ (UI) దీని లో ఫస్ట్ చెప్పుకోవలిసిన పాయింట్. Attractive కలర్స్ తో చాలా మంచి సింపుల్ మరియు గ్రేట్ లుక్స్ ఇస్తుంది. MusixMatch ప్లేయర్ లో హై లైట్  ఫీచర్, సాంగ్స్ ప్లేయింగ్ తో పాటు ఆ సాంగ్స్ లిరిక్స్ ను కూడా ఇస్తుంది ఈ యాప్. ఇందులో హై లైట్ ఏముంది, లిరిక్స్ ఇచ్చే ప్లేయర్ గురించి ఫస్ట్ వినటంలేదు కదా అని అనుకోకండి. గూగల్ ప్లే స్టోర్ లో 90 శాతం తెలుగు పాటలకు లిరిక్స్ ను ఇదొక్కటే ఇస్తుంది. మరొకటి లేదు.



లిరిక్ సపోర్టింగ్ మూజిక్ ప్లేయర్స్ ఆండ్రాయిడ్ కు చాలా ఉన్నాయి, కాని అవి తెలుగు పాటలకు లిరిక్స్ ఇవ్వటం లేదు. మీరు పాటను ప్లే చేస్తున్నప్పుడు ఆల్బమ్ పిక్ పై MusixMatch లిరిక్స్ ను డిస్ప్లే చేస్తుంది. లిరిక్స్ ను రెండు విధాలుగా చూసుకునే ఆప్షన్ ఉంది. పాట ప్లే అవుతున్నప్పుడు ఆల్బమ్ పిక్ పై రెండు సార్లు టచ్ చేస్తే, లిరిక్స్ చూపించే విధానం మారుతుంది. సాంగ్ లో ఏ లిరిక్ ప్లే అవుతుందో ఆ పాదాలను హై లైట్ చేసి చూపిస్తుంది. తెలుగు సాంగ్స్ లిరిక్స్ ప్రియులకు ఇది మోస్ట్ రికమెండేడ్ మ్యూజిక్ ప్లేయర్ యాప్.

ఫ్లోటింగ్ లిరిక్స్ ఆప్షన్ తో మిగిలిన ప్లేయర్స్ లో కూడా ఈ ప్లేయర్ యొక్క లిరిక్స్ ను చూపిస్తుంది ఈ యాప్. చిన్న ఫ్లోటింగ్ ఐకాన్ తో అది మీరు ఏ ప్లేయర్ లో సాంగ్స్ వింటున్నా లిరిక్స్ చూపిస్తుంది. ఈ ప్లేయర్ కన్నా ముందు వేరే ప్లేయర్ కు బాగా అలవాటు పడి, త్వరగా మరొక దానికి మారలేని వారి కోసం ఇది మంచి ఆప్షన్.



సెట్టింగ్స్ లో లాక్ స్క్రీన్ లుక్స్ మరియు ప్లేయర్ లో ఏమి ఆప్షన్స్ కనిపించాలో మీరు సెట్ చేసుకోగలరు. అలాగే మీ హెడ్ ఫోన్ జాక్ ఎప్పుడైనా సడెన్ గా తిసేవేస్తే, బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతున్న మ్యూజిక్ లౌడ్ స్పీకర్ లో నుండి రాకుండా సెట్ చేసే ఆప్షన్ ఉంది. Pair Android TV ఫీచర్ సహాయంతో టీవీ లో ఈ యాప్ నుండి సాంగ్స్ ప్లే చేయగలరు. సాధారణంగా మ్యూజిక్ ప్లేయర్స్ లో మీరు రికార్డ్ చేసుకున్న ఫైల్స్ లేదా చిన్న చిన్న ఆడియో ఫైల్స్ అన్నీ కనపడుతూ ప్లేయర్ లో అస్తవ్యస్తంగా చుపించాపడతాయి.మీకు అక్కర్లేని ఆడియో ఫైల్స్ ను Black List అనే ఆప్షన్ తో కనపడకుండా చేసుకోగలరు. 

కొత్తగా పాటలు లోడ్ చేస్తే కనపడటం లేదా, Rescan my Library ఆప్షన్ లో 5 సేకేండ్స్ పాటు స్కాన్ అయ్యే ఫీచర్ రన్ చేస్తే రీసెంట్ గా కాపీ చేసుకున్న సాంగ్స్ ఇందులో కనపడతాయి. అన్నిటికన్నా బాగా ఉపయోగపడే ఆప్షన్, మీకు కావలిసిన సాంగ్ ను సెర్చ్ లో వెతికి ప్లే చేసుకో గలరు. ఇది స్క్రోల్ చేసుకుంటూ మ్యూజిక్ ను వెతికే టైమ్ ను సేవ చేస్తుంది.



బయట ఎక్కడైనా మీరు ఒక మ్యూజిక్ విని, అది ఏ సాంగ్ అని తెలుసుకోవటానికి MUSICID ఆప్షన్ ఉంది. మరొక డిఫరెంట్ ఫీచర్ ఏంటంటే, మీ లైబ్రరీ లో పాటలను సంగీతం తో పాటు మీరు సొంతంగా పడకునే అవకాశం ఉంది. మీరు పాడదలుచుకున్న పాటను Now Playing స్క్రీన్ లో ఓపెన్ చేసి, రైట్ టాప్ కార్నర్ లోని 3 డాట్స్ పై టచ్ చేయండి, అక్కడ Sing అనే ఆప్షన్ ఉంటుంది, ఇది టచ్ చేయగానే బ్యాక్ గ్రౌండ్ లో పదాలు లేకుండా కేవలం Instrument మ్యూజిక్ ప్లే అవుతూ లిరిక్ ను చూపిస్తుంది. ఇక ఆ లిరిక్ ను చూస్తూ మీ సొంత గొంతుతో బ్యాక్ గ్రౌండ్ Instrument మ్యూజిక్ తో పాటను పడవచ్చు.  

ఇతర జెనెరల్ ఫీచర్స్ 
స్లీప్ టైమర్, Equalizer, Edit సాంగ్ ఇన్ఫర్మేషన్, Shuffle, Repeat, Share, Edit లిరిక్స్ అన్నీ ఉన్నాయి. గూగల్ ప్లే స్టోర్ లో దీని పేరు MusixMatch music & lyrics. ఇది ప్లే స్టోర్ లో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోగలరు.

ప్లస్ :
కలర్ఫుల్ యూజర్ ఇంటర్ఫేస్
గ్రేట్ లిరిక్స్ సపోర్ట్
అన్ని జెనెరల్ ఆప్షన్స్ ఉన్నాయి

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo