Aadhaar Update: ఇక ఇంటి వద్దకే అప్డేట్ సర్వీస్

Aadhaar Update: ఇక ఇంటి వద్దకే అప్డేట్ సర్వీస్
HIGHLIGHTS

ఇంట్లో కూర్చొనే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు

ఆధార్ అప్డేట్ కోసం కొత్త విధానం

ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు

భారతదేశంలో ఎటువంటి అవసరానికైనా ముందుగా అడిగేది ఆధార్ కార్డ్. మరి అటువంటి ఆధార్ కార్డ్ లో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని సరిచేసుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు వెళ్లి గంటలకు గంటలు క్యూలో వేచిచూడవల్సి వస్తుంది. అయితే, UIDAI మరియు పోస్టల్ డిపార్ట్ సంయుక్తంగా తీసుకొచ్చిన కొత్త విధానం వలన ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండానే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.

UIDAI దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్వీస్ ను ఆధార్ సర్వీస్ కోసం ఉపయోగించుకోనుంది.  ఆధార్ యూజర్లు ఇంటివద్దకు వచ్చే పోస్ట్ మెన్ ద్వారా ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ వలన ఇంటి నుండి కదలకుండనే అవసరం ఉన్న వారు తమ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ప్రజలకు ఈ సర్వీస్ అందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న 650 పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లను మరియు అందులోని పోస్ట్ మెన్ లను ఉపయోగించుకోనుంది.

UIDAI అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ప్రస్తుతానికి కేవలం పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా ఆధార్ మొబైల్ నంబర్ మాత్రమే అప్డేట్ చేస్తుంది. ఒకవేళ ఇది కనుక పుర్తిస్థాయిలో విజయవంతమైతే కనుక ఆధార్ కి సంబంధించి పూర్తి సేవలను పోస్ట్ ఆఫీసుల ద్వారా నిర్వహించవచ్చని కూడా తెలియవస్తోంది. ఇదే గనుక జరిగితే ఆధార్  కార్డ్ అప్డేట్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇంటి వద్ద నుండే ఆధార్ కార్డ్ అప్డేట్ మరియు మరిన్ని సర్వీసులు పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

 
Digit.in
Logo
Digit.in
Logo