Realme Narzo 10A కొత్త వేరియంట్ విడుదల చేసిన రియల్‌మి
Realme Narzo 10A యొక్క కొత్త వేరియంట్లో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ఉన్నాయి.
Realme Narzo 10A కొత్త మోడల్ ను Rs. 9,999 రూపాయల ధరతో ప్రకటించింది.
రియల్‌మి ఇటీవల తన బడ్జెట్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ Realme Narzo 10A ను భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఫోన్ యొక్క కొత్త వేరియంట్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్లో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ఉన్నాయి. ఈ కొత్త మోడల్ ను Rs. 9,999 రూపాయల ధరతో ప్రకటించింది. రియల్‌మి నార్జో 10 ఎ యొక్క 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .8,499. ఈ కొత్త వేరియంట్ సో వైట్ మరియు సో బ్లూ రంగులలో వచ్చింది.
Realme Narzo 10A యొక్క 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్లు రియల్మే యొక్క వెబ్సైట్ ఆర్ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించబడతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొత్త వేరియంట్ నిన్న మధ్యాహ్నం 12 నుండి అమ్మకానికి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో లభిస్తుంది.
Realme Narzo 10A స్పెక్స్
ఎంట్రీ లెవల్ నార్జో 10A మాట్టే ఫినిష్ తో వస్తుంది మరియు బ్లూ మరియు తెలుపు రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్ ఒక 6.5-అంగుళాల HD + డిస్ప్లే తో ఫోన్‌ను లాంచ్ చేశారు మరియు ఈ ఫోన్‌ను వాటర్ డ్రాప్ నోచ్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసుకువచ్చారు. ఈ ఫోనుకు కూడా గొరిల్లా గ్లాస్ 3 యొక్క రక్షణ కూడా ఇవ్వబడింది.
Realme Narzo 10A మీడియాటెక్ హెలియో జి 70 చిప్సెట్ తో పనిచేస్తుంది, ఇది మాలి-జి 52 గ్రాఫిక్ లతో జత చేసిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్లో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి,దీనిని ఒక డేడికేటెడ్ మైక్రో ఎస్డీ కార్డుతో 256 జీబీ వరకు పెంచవచ్చు. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన RealmeUI లో పరికరం పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ఇది f / 1.8 ఎపర్చరు గల 12MP ప్రాధమిక కెమెరాను మరియు మరో రెండు కెమెరాల్లో ఒక 2MP మాక్రో మరియు డెప్త్ సెన్సార్స్ ఉన్నాయి. AI బ్యూటీఫికేషన్తో వచ్చిన ఈ ఫోన్ ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. నార్జో 10A 5,000WAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.