Realme 16 Pro Plus: ప్రీమియం కెమెరా సెటప్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది.!
రియల్‌మీ ఈరోజు తన 16 ప్రో సిరీస్ ఫోన్స్ ఇండియాలో ప్రవేశపెట్టింది
రియల్‌మీ 16 ప్రో ప్లస్ ను చాలా ప్రీమియం కెమెరా మరియు డిజైన్ తో ఇండియాలో అందించింది
ఈ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్
Realme 16 Pro Plus: రియల్‌మీ ఈరోజు తన 16 ప్రో సిరీస్ ఫోన్స్ ఇండియాలో ప్రవేశపెట్టింది. రియల్‌మీ 16 ప్రో ప్లస్ వేరియంట్ ను చాలా ప్రీమియం కెమెరా మరియు డిజైన్ తో ఇండియాలో అందించింది. ఈ ఫోన్ గొప్ప డిటైల్స్ అందించే 200MP లూమా కలర్ కెమెరా మరియు అర్బన్ వైల్డ్ డిజైన్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో ఈ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyRealme 16 Pro Plus: ధర
రియల్‌మీ ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
- రియల్‌మీ 16 ప్రో ప్లస్ (8 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 39,999
- రియల్‌మీ 16 ప్రో ప్లస్ (8 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 41,999
- రియల్‌మీ 16 ప్రో ప్లస్ (12 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 44,999

ఈ ఫోన్ ఈరోజు నుంచి Pre Booking కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ రియల్‌మీ అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ ఫోన్ మాస్టర్ గ్రే, మాస్టర్ గోల్డ్ మరియు కమేలియా పింక్ అనే మూడు సరికొత్త రంగుల్లో అందించింది.
Realme 16 Pro Plus: ప్రత్యేకతలు
రియల్‌మీ ఈ లేటెస్ట్ ప్రీమియం ఫోన్ ను క్వాల్కమ్ యొక్క Snapdragon 7 Gen 4 లేటెస్ట్ ప్రోసెసర్ తో తీసుకొచ్చింది . ఇది 2.8Ghz క్లాక్ స్పీడ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని రియల్‌మీ తెలిపింది. ఈ చిప్ సెట్ కి జతగా 12 జీబీ ఫిజికల్ ర్యామ్, 14GB డైనమిక్ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ను రియల్‌మీ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ UI 7.0 జతగా Android 16 OS అందించింది. ఈ రియల్‌మీ లేటెస్ట్ ప్రీమియం ఫోన్ లో భారీ 6.8 ఇంచ్ బిగ్ 4D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్స్ సూపర్ బ్రైట్నెస్ మరియు 1.5K రిజల్యూషన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది.
రియల్‌మీ 16 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ లో Luma Color సపోర్ట్ కలిగిన 200MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో (3.5) కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 60FPS వద్ద 4K వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో ఎక్కువ దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా చాలా దగ్గరగా చూపించే సూపర్ జూమ్ కూడా ఉంది. అదనంగా, ఈ ఫోన్ లో Ai ఎడిట్ జీనీ 2.0 సపోర్ట్ కూడా ఉంది.
Also Read: Realme 16 Pro 5G: పవర్ ఫుల్ 200MP కెమెరా మరియు 7000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
ఈ ఫోన్ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. 36 లిక్విడ్స్ ను తట్టుకునేలా ఈ ఫోన్ ను IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో అందించింది. అందుకే, ఈ ఫోన్ గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా కొనసాగుతుంది.