Realme 16 Pro 5G: లాంచ్ డేట్, ఫీచర్స్ మరియు ప్రైస్ కంప్లీట్ రౌండప్.!
రియల్ మీ 16 ప్రో ఇండియాలో లాంచ్ అవ్వడానికి జస్ట్ రెండు రోజుల దూరంలో ఉంది
సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని కంపెనీ గొప్పగా టీజింగ్ చేస్తోంది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్, ఫీచర్స్ మరియు ప్రైస్ కంప్లీట్ రౌండప్
Realme 16 Pro 5G: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ 16 ప్రో ఇండియాలో లాంచ్ అవ్వడానికి జస్ట్ రెండు రోజుల దూరంలో ఉంది. ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని కంపెనీ గొప్పగా టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ ఫీచర్స్ మరియు ప్రైస్ ఆన్లైన్ లో రివీల్ అవుతున్నాయి. ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ ను కంపెనీ బయటకు వెల్లడించిగా, ఈ ఫోన్ ప్రైస్ వివరాలు మాత్రం ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. అందుకే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్, ఫీచర్స్ మరియు ప్రైస్ కంప్లీట్ రౌండప్ ఈరోజు అందిస్తున్నాము.
SurveyRealme 16 Pro 5G: లాంచ్ డేట్?
రియల్ మీ 16 ప్రో స్మార్ట్ ఫోన్ జనవరి 6వ తేదీ 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు రియల్ మీ 16 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అవుతుంది.
Realme 16 Pro 5G: ఫీచర్స్
రియల్ మీ 16 ప్రో స్మార్ట్ ఫోన్ సరికొత్త మాస్టర్ డిజైన్ తో లాంచ్ అవుతుంది మరియు ఇది చాలా స్లీక్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED పెద్ద స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 max చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది 9 లక్షల 71 వేల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే లేటెస్ట్ చిప్ సెట్.

ఈ ఫోన్ కెమెరా సెటప్ గురించి కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది. ఇందులో 200MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ సెటప్ తో జతగా Ai ఎడిట్ జీనీ, Ai కెమెరా ఫీచర్స్ మరియు గొప్ప 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన స్లీక్ డిజైన్ లో కూడా భారీ 7000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
ఈ ఫోన్ రియల్ మీ యొక్క లేటెస్ట్ సాఫ్ట్ వేర్ రియల్ మీ UI 7.0 జతగా ఆండ్రాయిడ్ 16 తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ 3 సంవత్సరాల OS అప్గ్రేడ్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది. ఈ ఫోన్ IP66, IP68, IP68 మరియు IP69K సపోర్ట్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.
Also Read: BSNL New Year Offer: కొత్త సంవత్సరం గుడ్ న్యూస్ అందించిన ప్రభుత్వ టెలికాం.!
అంచనా ప్రైస్
రియల్ మీ 16 ప్రో ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేస్తుందని కొన్ని కొత్త లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరలు కూడా లీక్ అయ్యాయి. ఈ లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ బేసిక్ (8GB + 128GB) వేరియంట్ రూ. 31,999 ప్రైస్ ట్యాగ్ తో, (8GB + 256GB) వేరియంట్ రూ. 33,999, హైఎండ్ (12GB + 256GB) వేరియంట్ రూ. 36,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ అంచనా ధరలో నిజం ఎంత ఉందో తెలుస్తుంది.