kodak మోషన్ X సిరీస్ నుంచి పవర్ ఫుల్ సౌండ్ తో కొత్త QLED Smart Tvs లాంచ్ చేసింది.!
ఇండియన్ మార్కెట్లో వేగంగా స్మార్ట్ టీవీలను అందిస్తున్న టీవీ బ్రాండ్ లలో కొడాక్ కూడా ఒకటి
కొడాక్ ఈరోజు మోషన్ X సిరీస్ నుంచి మొత్తం మూడు కొత్త QLED Smart Tvs లాంచ్ చేసింది
కొడాక్ ఈ టీవీలను సాంప్రదాయ 60Hz రిఫ్రెష్ రేట్ కాకుండా గొప్ప 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది
ఇండియన్ మార్కెట్లో వేగంగా స్మార్ట్ టీవీలను అందిస్తున్న టీవీ బ్రాండ్ లలో కొడాక్ కూడా ఒకటిగా నిలుస్తుంది. ఈరోజు కూడా కొడాక్ కొత్త స్మార్ట్ టీవీ లను విడుదల చేసి పేరును మళ్ళి నిరూపించింది. దీపావళి కి ముందు మాట్రిక్స్ సిరీస్ నుండి కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసిన కొడాక్ ఈరోజు మోషన్ X సిరీస్ నుంచి మొత్తం మూడు కొత్త QLED Smart Tvs లాంచ్ చేసింది.
Surveykodak QLED Smart Tvs : ప్రైస్
కొడాక్ ఈరోజు ఈ మూడు స్మార్ట్ టీవీలను మోషన్ X సిరీస్ నుంచి లాంచ్ చేసింది. ఇందులో, 55, 65 మరియు 75 ఇంచ్ మూడు సైజుల్లో స్మార్ట్ టీవీలు విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ ధరలు ఇక్కడ చూడవచ్చు.
కొడాక్ మోషన్ ఎక్స్ 55 ఇంచ్ క్యూలెడ్ టీవీ ధర : రూ. 31,999
కొడాక్ మోషన్ ఎక్స్ 65 ఇంచ్ క్యూలెడ్ టీవీ ధర : రూ. 43,999
కొడాక్ మోషన్ ఎక్స్ 75 ఇంచ్ క్యూలెడ్ టీవీ ధర : రూ. 64,999
ఈ మూడు క్యూలెడ్ స్మార్ట్ టీవీలు కూడా ఈరోజు నుంచి ఎక్స్ క్లూజివ్ గా Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై కెనరా, BOB CARD, SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.
kodak QLED Smart Tvs : ఫీచర్స్
ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా 4K UHD రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటాయి. కొడాక్ ఈ టీవీలను సాంప్రదాయ 60Hz రిఫ్రెష్ రేట్ కాకుండా గొప్ప 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది. ఇది స్మూత్ విజువల్స్ మరియు గొప్ప ఫ్రేమ్ రేట్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్ HDR 10, HLG, ALLM, VRR మరియు MEMC ఫీచర్స్ తో వస్తుంది. ఈ క్యూలెడ్ టీవీ గొప్ప విజువల్స్ అందించే అన్ని ఫీచర్స్ కలిగి ఉన్నట్లు కొడాక్ పేర్కొంది.

ఈ టీవీ రియల్ టెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది. ఈ టీవీ స్మూత్ గా నడవడానికి వీలుగా 2GB ర్యామ్ మరియు ఎక్కువ యాప్స్ స్టోర్ చేయడానికి వీలుగా 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ ఆఫర్ చేస్తుంది. ఈ కొడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Google TV 5.0 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.
Also Read: Cloudflare Down దెబ్బకు Canva, X, Spotify వంటి మరిన్ని ప్లాట్ ఫామ్స్ విల విల.!
సౌండ్ విషయానికి వస్తే, కొడాక్ ఈ స్మార్ట్ టీవీలలో భారీ సౌండ్ సెటప్ అందించింది. ఈ స్మార్ట్ టీవీలలో క్వాడ్ కోర్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 70W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ మరియు AI క్లియర్ వాయిస్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టోటల్ సెటప్ తో ఈ స్మార్ట్ టీవీ జబర్దస్త్ సౌండ్ అందిస్తుందని కూడా కొడాక్ చెబుతోంది. ఈ టీవీ HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్, AV in మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను ఈ టీవీ కలిగి ఉంటుంది.