Cloudflare Down దెబ్బకు Canva, X, Spotify వంటి మరిన్ని ప్లాట్ ఫామ్స్ విల విల.!

HIGHLIGHTS

ఫోన్ మరియు సిస్టమ్స్ లో Canva, X, Spotify వంటి అనేక ప్లాట్ ఫామ్స్ డౌన్

ఇది ఏకంగా గంటల పాటు కొనసాగింది

పని చేయక పోవడానికి కారణం Cloudflare Down అవ్వడం

Cloudflare Down దెబ్బకు Canva, X, Spotify వంటి మరిన్ని ప్లాట్ ఫామ్స్ విల విల.!

మీ ఫోన్ లేదా సిస్టంలో Canva, X, Spotify వంటి మరిన్ని ప్లాట్ ఫామ్స్ పని చేయడం లేదా? అయితే, ఇందులో మీ తప్పేమీ లేదు. దీనికి కారణం మీ ఫోన్ లేదా సిస్టం లో ఇంటర్నెట్ పని చేయకపోవడం లేదా మరింకేదైనా కారణం అయ్యే అవకాశం ఉందని చెక్ లాంటివి చేయకండి. ఎందుకంటే, ఈ సైట్స్ లేదా యాప్స్ పని చేయక పోవడానికి కారణం Cloudflare Down అవ్వడం. ఇది చాలా ప్లాట్ ఫామ్స్ పర్యవేక్షించే విస్తారమైన సర్వీస్ ప్రొవైడర్ మరియు ఈరోజు ఇది పూర్తిగా డౌన్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Cloudflare Down

ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతం నుంచి చాలా మంది కూడా వారి ఫోన్ మరియు సిస్టమ్స్ లో Canva, X, Spotify వంటి అనేక ప్లాట్ ఫామ్స్ డౌన్ అవ్వడం చూశారు. ఏదో చిన్నపాటి లోపం లేదా కొన్ని క్షణాల కోసం వచ్చిన సర్వీస్ లోపం అయ్యి ఉండవచ్చు అని అనుకున్నారు. అయితే, ఇది ఏకంగా గంటల పాటు కొనసాగింది. నవ్వుకునే విషయం ఏమిటంటే, సర్వీస్ అవుటేజ్ సమయంలో రిపోర్ట్ చేసేందుకు వీలుగా ఉన్న డౌన్ డిక్టేటర్ సైట్ కూడా ఈరోజు డౌన్ అయ్యింది. దీనికి కారణం కూడా ఈ క్లౌడ్ ఫ్లేర్ డౌన్ సమస్యే.

Also Read: OPPO Find X9: ఒప్పో కొత్త ఫోన్ కంప్లీట్ స్పెక్స్ అండ్ ప్రైస్ తెలుసుకోండి.!

X ప్లాట్ ఫామ్ పూర్తిగా డౌన్ అయ్యింది. ఇందులో ఫీడ్ లేదా మరింకే ఇతర వివరాలు కూడా మాయమయ్యాయి. కేవలం ఇది మాత్రమే కాదు ఇమేజ్ అండ్ వీడియో ఎడిటింగ్ ప్లాట్ ఫామ్ Canva కూడా పడిపోయింది. వీటితో పాటు AI ప్లాట్ ఫామ్స్ అయిన Chat GPT మరియు Perplexity ప్లాట్ ఫామ్స్ కూడా పూర్తిగా డౌన్ అయ్యాయి. ఇది రీసెంట్ గా వచ్చిన అవుటేజ్ లలో పెద్ద అవుటేజ్ గా చెప్పబడుతుంది.

Cloudflare అంటే ఏమిటి?

క్లౌడ్ ఫ్లేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెబ్‌ సైట్లను సేఫ్, స్టేబుల్‌ మరియు ఫాస్ట్ గా ఉంచడానికి సహాయపడే ఒక ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ మరియు పెర్ఫార్మెన్స్ సర్వీస్. ఇది వెబ్‌ సైట్‌కు వచ్చే ట్రాఫిక్‌ను మొదట తన సర్వర్ల ద్వారా అనుమతించి,దానిపై జరిగే దాడులు (DDoS), మాలిషియస్ రిక్వెస్ట్‌లు, స్పామ్‌ వంటి వాటిని ఫిల్టర్ చేస్తుంది.

అలాగే, క్లౌడ్ ఫ్లేర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన CDN (Content Delivery Network) సర్వర్లలో వెబ్‌ సైట్ డేటాను క్యాష్ చేసి, యూజర్ ఎక్కడ ఉన్నా అతనికి దగ్గర్లోని సర్వర్ నుంచి పేజీని లోడ్ చేస్తుంది. ఇలా చేయడం వలన వెబ్‌ సైట్ స్పీడ్ గణనీయంగా పెరుగుతుంది. దీని గురించి సింపుల్‌గా చెప్పాలంటే, క్లౌడ్ ఫ్లేర్ అనేది వెబ్‌ సైట్‌కు షీల్డ్ మరియు స్పీడ్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు, ఇది సైట్ కు సెక్యూరిటీ ఇస్తుంది, ట్రాఫిక్‌ ను బ్యాలెన్స్ చేస్తుంది, లోడింగ్ టైమ్ తగ్గిస్తుంది. ముఖ్యంగా, వెబ్‌ సైట్ ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉండేందుకు సహాయం చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo