వివో దీపావళి పండుగ ఆఫర్: కేవలం రూ. 101 రుపాయలు చెల్లించండి సరికొత్త VIVO ఫోన్ను తీసుకెళ్లండి
ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 31 వరకు అన్ని ఆఫ్ లైన్ ఛానెళ్లలో లభిస్తుంది.
వివో ఈ దీపావళి ఫెస్టివల్ సీజన్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది, దీని కింద వినియోగదారులు కేవలం రూ .101 చెల్లించి కొత్త స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. అదనంగా, కంపెనీ ఆఫ్ లైన్ ఛానెళ్లలో కూడా No Cost EMI మరియు జీరో డౌన్-పేమెంట్ పథకాలను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా, పండుగ సీజన్‌లో 10 శాతం క్యాష్ బ్యాక్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. వివో యొక్క సరికొత్త స్మార్ట్ ఫోన్లు వివో వి 17 ప్రో, వి 15 ప్రో మరియు వివో జెడ్ 1 ఎక్స్ యొక్క సరికొత్త 8 జిబి ర్యామ్ వేరియంట్‌లతో ఈ డీల్స్ మరియు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.
Surveyఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 31 వరకు అన్ని ఆఫ్ లైన్ ఛానెళ్లలో లభిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా యూజర్లు 101 రూపాయలు చెల్లించి వివో యొక్క కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ వివో వి 17 ప్రో, వివో వి 15 ప్రో, వివో జెడ్ 1 ఎక్స్ 8 జిబి వేరియంట్, వివో వి 15, వివో ఎస్ 1, వివో వై 17, వివో వై 15, మరియు వివో వై 12 ఫోన్లకు వర్తిస్తుంది.
రూ .101 ఆఫర్ కింద, వివో HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది, అదనంగా, HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావా దేవీల పైన కూడా 5 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. ఇది కాకుండా, మీరు 926 ప్రారంభ EMI వద్ద కూడా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
వివో-క్యాషిఫై అప్‌గ్రేడ్ ప్రోగ్రాం ద్వారా వివో వి 17 ప్రో, వివో ఎస్ 1 కొనుగోలుపై వినియోగదారులకు రూ .1,999 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile