BSNL Offer: రూ. 1 రూపాయికే 30 డేస్ అన్లిమిటెడ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది.!

HIGHLIGHTS

ఈనెల ప్రారంభంలో అందించిన BSNL సూపర్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది

కేవలం ఒక్క రూపాయికి 30 రోజుల అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బిఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్

ఈ ఆఫర్ ను ఈ నెల ప్రారంభంలో కేవలం 30 రోజుల కోసం మాత్రమే అందించింది

BSNL Offer: రూ. 1 రూపాయికే 30 డేస్ అన్లిమిటెడ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది.!

BSNL Offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఈనెల ప్రారంభంలో అందించిన సూపర్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. అదేనండి, కేవలం ఒక్క రూపాయికి 30 రోజుల అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బిఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్ రేపటి తో క్లోజ్ అవుతుంది. ఈ ఆఫర్ ను ఈ నెల ప్రారంభంలో కేవలం 30 రోజుల కోసం మాత్రమే అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL Offer: ఆఫర్ ఏమిటి?

దేశంలోని ఏ ఇతర టెలికాం కంపెనీ ఆఫర్ చేయని విధంగా 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు కేవలం రూ. 1 రూపాయికే బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ ఈ ఒక్క రూపాయి ఆఫర్ ను ముందుగా 2025 ఆగస్టు నెలలో ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ పై ఎక్కువగా స్పందన రావడంతో, బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ను చాలా సార్లు తిరిగి ప్రవేశపెట్టింది. అయితే, కొత్త సంవత్సరంలో ఈ ఆఫర్ ను పక్కన పెట్టింది.

BSNL Offer Rs 1 prepaid plan

అయితే, యూజర్లకు కేవలం ఒక్క రూపాయికే అధిక లాభాలను అందించిన ఈ జబర్దస్త్ ఆఫర్ ను తిరిగి తీసుకురావాలనే ప్రజల కోరిక మేరకు ఈ ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ని తిరిగి తీసుకు వచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. అయితే, ఈ ఆఫర్ ను కేవలం 30 రోజుల లిమిటెడ్ పిరియడ్ సమయానికి మాత్రమే అందించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30వ తేదీ అనగా రేపటితో ముగుస్తుంది. కాబట్టి ఈ ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ఆఫర్ ను అందుకోవాలనుకుంటే రేపు ఒక్కరోజు మాత్రమే ఛాన్స్.

Also Read: Flipkart SASA LELE Sale: భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో కొత్త సేల్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

రూ. 1 ఆఫర్ బెనిఫిట్స్ ఏమిటి?

బిఎస్ఎన్ఎల్ రూ. 1 రూపాయి సూపర్ ఆఫర్ తో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ఆఫర్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది మరియు ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. అంతేకాదు, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అదనంగా, ఈ రోజువారీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో మొత్తం అన్లిమిటెడ్ డేటా కూడా ఆఫర్ చేస్తుంది.

అయితే, ఇక్కడ ఒక ప్రధాన విషయం ఉంది. అదేమిటంటే, ఈ ఆఫర్ కేవలం బిఎస్ఎన్ఎల్ కొత్త SIM కార్డు తీసుకుని ఫస్ట్ రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. అంటే, కేవలం ఒక్క రూపాయికే SIM కార్డు మరియు 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ కూడా ఈ ఆఫర్ తో రీఛార్జ్ చేసే వారికి బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile