ముందుగా MIUI 11 అందుకోనున్న షావోమి ఫోన్ల లిస్ట్
ఈ MIUI 11 అందుకోనున్న వాటిలో పోకో F1 మొదటిది.
షావోమి నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో రెడ్మి నోట్ 8 మరియు రెడ్మి నోట్ 8 ప్రోలను ఆవిష్కరించింది. ఎప్పటినుండో, భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫోన్లను విడుదల చేయడంతో పాటు, షావోమి MIUI 11 యొక్క రోల్-అవుట్ తేదీని కూడా ప్రకటించింది. రెడ్మి ఫోన్లకు రోడ్‌మ్యాప్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. అధికారిక MIUI 11 రోల్-అవుట్ అక్టోబర్ 22 న ప్రారంభమవుతుంది మరియు ఈ నెల చివరిలో అప్డేట్ చేయబడిన తరువాత ఈ UI ని అందుకున్న మొదటి పరికరాలలో పోకో F1 ఒకటి.
Surveyఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నిన్న లాంచ్ అయిన రెడ్మి నోట్ 8 ప్రో కు ఈ ఏడాది చివరి నాటికి MIUI 11 లభిస్తుంది. ఈ అప్డేట్ నాలుగు దశల్లో విడుదల అవుతుంది. అంతేకాకుండా, షావోమి వారి ప్రస్తుత పరీక్ష ప్రణాళికల ఆధారంగా తేదీలను నిర్ణయించినట్లు చెప్పారు, కాబట్టి వాస్తవ రోల్-అవుట్ తేదీలు మారవచ్చు.
దిగువ MIUI 11 ను అందుకోనున్న షావోమి స్మార్ట్ ఫోన్ల మొత్తం జాబితాను మీరు చూడవచ్చు.
మొదటి దశ : అక్టోబర్ 22-31
పోకో ఎఫ్ 1
రెడ్మి K 20
రెడ్మి Y 3
రెడ్మి 7
రెడ్మి నోట్ 7
రెడ్మి నోట్ 7 సె
రెడ్మి నోట్ 7 ప్రో
రెండవ దశ : నవంబర్ 4-12
రెడ్మి K 20 ప్రో
రెడ్మి 6
రెడ్మి 6 ప్రో
రెడ్మి 6 ఎ
రెడ్మి నోట్ 5
రెడ్మి నోట్ 5 ప్రో
రెడ్మి 5
రెడ్మి 5 ఎ
రెడ్మి నోట్ 4
రెడ్మి వై 1
రెడ్మి వై 1 లైట్
రెడ్మి వై 2
రెడ్మి 4
మి మిక్స్ 2
మి మాక్స్ 2
మూడవ దశ : నవంబర్ 13-29
రెడ్మి నోట్ 6 ప్రో
రెడ్మి 7 ఎ
రెడ్మి 8
రెడ్మి 8 ఎ
రెడ్మి నోట్ 8
4 వ దశ: డిసెంబర్ 18-26
రెడ్మి నోట్ 8 ప్రో
MIUI 11 లో కొత్త చిహ్నాలు, అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్, సిస్టమ్-వైడ్ డార్క్ మోడ్ మరియు మరిన్ని ఉంటాయి. MIUI 11 ఒప్పో, వివో మరియు షావోమి కి సహకరిస్తున్న క్రాస్-డివైస్ షేరింగ్ ఫీచర్‌ను జోడిస్తుందని చెప్పబడింది. ఇంకా, కొత్త MIUI 11 'ఆల్వేస్ ఆన్ డిస్ప్లే'కి కొత్త ఫీచర్లను జోడిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile