Smart Watch: తక్కువ ధరలో పెద్ద డిస్ప్లేతో వచ్చిన TAGG స్మార్ట్ వాచ్

HIGHLIGHTS

TAGG తన లేటెస్ట్ స్మార్ట్ వాచ్ TAGG Verve Active Smartwatch ని ప్రకటించింది

TAGG స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్ నుండి సేల్ కి అందుబాటులో కూడా ఉంచింది

స్మార్ట్ వాచ్ 1.7 ఇంచ్ పెద్ద డిస్ప్లే మరియు మరిన్ని స్మార్ట్ ఫీచర్లతో వచ్చింది

Smart Watch: తక్కువ ధరలో పెద్ద డిస్ప్లేతో వచ్చిన TAGG స్మార్ట్ వాచ్

TAGG తన లేటెస్ట్ స్మార్ట్ వాచ్ TAGG Verve Active Smartwatch ని ప్రకటించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ను కేవలం రూ.1899 ధరకే అందించింది. ఈ TAGG స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్ నుండి సేల్ కి అందుబాటులో కూడా ఉంచింది. ఈ స్మార్ట్ వాచ్ 1.7 ఇంచ్ పెద్ద  LCD డిస్ప్లే, చక్కని డిజైన్ మరియు మరిన్ని స్మార్ట్ ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ MRP ధర రూ.3,999 గా ఉండగా Flipakrt నుండి 52% డిస్కౌంట్ తో కేవలం రూ.1,899 రూపాయల ధరకే ఆఫర్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TAGG Verve Active Smartwatch: ఫీచర్లు

ట్యాగ్ వేర్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్ నుండి చవక ధరకే లభిస్తోంది మరియు ఇప్పటికే సేల్ స్టార్ట్ కూడా అయ్యింది. ఈ స్మార్ట్ వాచ్ 4 అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది మరియు ప్రీమియం లుక్ ఇచ్చేలా చక్కని డిజైన్ మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది.   ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ పెద్ద IPS LCD డిస్ప్లే మరియు 8 రోజులు నిలిచే బ్యాటరీతో వస్తుంది.

ఇందులో మీ వర్కవుట్ కోసం 24 Sports Modes, 24×7 హార్ట్ రేట్ మోనిటర్, 24×7 బాడీ టెంపరేచర్ మోనిటర్ మరియు 24×7 బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్ వంటి ప్రధాన ఫీచర్లను కలిగి వుంది.

అలాగే వాచ్ మరింత అందగా కనిపించేలా చేసే పలురకాలైన క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేస్ లను కూడా ఇందులో అందించింది. ఇది కనెక్టెడ్ మొబైల్ కాల్స్/SMS కోసం వైబ్రేషన్ అలర్ట్ కూడా అందిస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo