Samsung Galaxy Watch Ultra 2 ని చాలా శక్తివంతమైన మరియు అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!

HIGHLIGHTS

Samsung Galaxy Watch Ultra 2 స్మార్ట్ వాచ్ విడుదల చేసింది.

శాంసంగ్ యొక్క అత్యంత శక్తివంతమైన గెలాక్సీ వాచ్ గా లాంచ్ చేసినట్లు శాంసంగ్ తెలిపింది

శక్తివంతమైన Galaxy AI సామర్థ్యాలతో సమగ్రమైన అనుభవాన్ని అందిస్తుంది

Samsung Galaxy Watch Ultra 2 ని చాలా శక్తివంతమైన మరియు అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 ఫోన్లతో పాటు ఈ రోజు Samsung Galaxy Watch Ultra 2 స్మార్ట్ వాచ్ ని కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను శాంసంగ్ యొక్క అత్యంత శక్తివంతమైన గెలాక్సీ వాచ్ గా లాంచ్ చేసినట్లు శాంసంగ్ తెలిపింది. ప్రీమియం డిజైన్, పనితీరు, అధునాతన ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లు, శక్తివంతమైన Galaxy AI సామర్థ్యాలతో ఈ కొత్త వాచ్ వినియోగదారులకు మరింత సమగ్రమైన అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy Watch Ultra 2 Price

శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 స్మార్ట్ వాచ్ ఇండియాలో రూ. 69,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ వాచ్ ప్రీ ఆర్డర్ కూడా ఇండియాలో ప్రారంభించింది. ఈ వాచ్ ను శాంసంగ్ అఫీషియల్ సైట్, అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.

Samsung Galaxy Watch Ultra 2 ఫీచర్స్

ఈ వాచ్ ప్రీమియం డిజైన్ మరియు బలమైన నిర్మాణంతో లాంచ్ అయ్యింది. టైటానియం మెటల్ బాడీతో రూపొందించబడింది మరియు డిస్‌ప్లే కి సఫైర్ క్రిస్టల్ రక్షణ ఉండటం వల్ల గీతలు పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాదు, దుమ్ము, నీరు, అధిక ఉష్ణోగ్రతలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ వాచ్ సమర్థంగా పనిచేసేలా శాంసంగ్ రూపొందించింది.

ఈ వాచ్‌ లో హై రిజల్యూషన్ Super AMOLED డిస్‌ప్లే అందించారు. దీనివల్ల నేరుగా ఎండలో కూడా చాలా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వాచ్ Snapdragon Wear Elite తో చాలా వేగంగా పని చేస్తుంది మరియు యాప్స్ ని కూడా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. Wear OS ఆధారిత సాఫ్ట్‌ వేర్‌ తో పాటు Samsung అందించే ప్రత్యేక ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యం వల్ల మ్యూజిక్, యాప్‌ లు మరియు ఇతర డేటాను సులభంగా స్టోర్ చేసుకోవచ్చు.

Samsung Galaxy Watch Ultra 2

ఇందులో 800 mAh అధిక సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగం తో ఈ వాచ్ ఎక్కువ రోజులు పనిచేసేలా రూపొందించారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీని మళ్లీ రీఛార్జ్ చేసే అవకాశం ఉంది.

ఈ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ వాచ్‌ లో ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే అనేక సెన్సార్ లు ఉన్నాయి. హార్ట్ రేట్, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి తెలిపే SpO₂, శరీర ఉష్ణోగ్రత, ECG వంటి ముఖ్యమైన వివరాలను ట్రాక్ చేయవచ్చు. అలాగే, నిద్ర నాణ్యతను విశ్లేషించి మెరుగైన నిద్ర కోసం సూచనలు అందిస్తుంది. బాడీ కంపోజిషన్ విశ్లేషణ ద్వారా శరీరంలోని కొవ్వు మరియు కండరాల శాతం వంటి వివరాలు కూడా తెలియజేస్తుంది.

Also Read ; Samsung Galaxy Z Flip 8 : స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది.!

ఇది కాకుండా ఈ వాచ్ AI ఆధారిత ఆరోగ్య సూచనలు కూడా అందిస్తుంది. అంటే, AI సహాయంతో ఈ వాచ్ యూజర్ ఆరోగ్య డేటాను విశ్లేషించి వ్యక్తిగత సూచనలు అందిస్తుంది. ఇందులో రోజువారీ శారీరక శ్రమ, విశ్రాంతి అవసరం, రికవరీ సమయం వంటి అంశాలను అంచనా వేసి సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile