Samsung Galaxy Z Flip 8 : స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది.!

HIGHLIGHTS

Samsung Galaxy Z Flip 8 ఇండియన్ మార్కెట్ తో పాటు ప్రపంచ మార్కెట్లో కూడా విడుదల చేసింది

ఈ లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో మార్కెట్లో అడుగు పెట్టింది

ఈ ఫోన్ ను కూడా One UI 9 సాఫ్ట్ వేర్ జతగా Android 17 OS తో విడుదల చేసింది

Samsung Galaxy Z Flip 8 : స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది.!

Samsung Galaxy Z Flip 8 : శాంసంగ్ ఈరోజు కొత్త ఫ్లిప్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ తో పాటు ప్రపంచ మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో మార్కెట్లో అడుగు పెట్టింది. శాంసంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ఇండియాలో దీని ధర వివరాలు క్లియర్ గా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy Z Flip 8 : ఫీచర్స్

శాంసంగ్ ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను స్టైలిష్ ఫోల్డబుల్ డిజైన్‌ తో పాటు పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందించింది. ఇందులో 6.9 అంగుళాల డైనమిక్ AMOLED 2X మెయిన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ బయట భాగంలో 4.1 అంగుళాల Super AMOLED డిస్‌ప్లే అందించింది. ఈ స్క్రీన్ తో ఫోన్ ను తెరవకుండానే నోటిఫికేషన్లు చూడటం, మెసేజ్‌లకు సమాధానం ఇవ్వడం, విడ్జెట్లు ఉపయోగించడం మరియు సెల్ఫీలు తీయడం వంటివి సులభంగా చేసే వీలుంటుంది.

ఈ ఫోన్ ను శాంసంగ్ యొక్క సొంత మరియు ప్రత్యేకమైన Exynos 2600 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 12GB ర్యామ్ జతగా 256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఫోల్డ్ 8 సిరీస్ మాదిరిగానే ఈ ఫోన్ ను కూడా One UI 9 సాఫ్ట్ వేర్ జతగా Android 17 OS తో విడుదల చేసింది. ఈ ఫోన్ కూడా IP48 రేటింగ్ మరియు Wi-Fi 7 తో వచ్చింది. అయితే, ఇందులో బ్లూటూత్ 5.4 వెర్షన్ మాత్రమే ఉంటుంది.

Samsung Galaxy Z Flip 8

ఆప్టిక్స్ విభాగంలో, ఈ ఫోన్ 50MP వైడ్ యాంగిల్ కెమెరా జతగా 12MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 10MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2X ఆప్టికల్ జూమ్, 4ఖ్ వీడియో రికార్డింగ్, Ai కెమెరా ఫీచర్స్ మరియు లేటెస్ట్ శాంసంగ్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,300mAh డ్యూయల్ బ్యాటరీ, 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 15W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జ్ మరియు వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ న్యూ ప్రీమియం ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Samsung Galaxy Z Flip 8 : ప్రైస్

శాంసంగ్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది, వీటి లాంచ్ ప్రైస్ ఈ క్రింద చూడవచ్చు.

  • శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 8 (12GB + 256GB) ప్రైస్ : రూ. 1,24,999
  • శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 8 (12GB + 512GB) ప్రైస్ : రూ. 1,44,999

ఈ ఫోన్ ను గ్రాఫైట్, క్రీమ్ మరియు పింక్ మూడు రంగుల్లో అందించింది. అలాగే, కంపెనీ సైట్ నుండి ప్రత్యేకమైన మింట్ వేరియంట్ ను కూడా అందించింది. ఈ ఫోన్ కూడా ఈ రోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చింది.

ఆఫర్:

ఈ ఫోన్ పియా గొప్ప ప్రీ ఆర్డర్ ఆఫర్స్ ని కంపెనీ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 5,000 అప్గ్రేడ్ ఆఫర్, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ / UPI పేమెంట్ తో రూ. 4,000 డిస్కౌంట్ అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile