Google Fitbit Air: స్క్రీన్ లేకుండా AI ఫిట్‌ నెస్ ట్రాకర్ లాంచ్ చేసిన గూగుల్.!

HIGHLIGHTS

గూగుల్ స్క్రీన్ లేకుండా AI ఫిట్‌ నెస్ ట్రాకర్ గూగుల్ ఫిట్ బిట్ ఎయిర్ ను విడుదల చేసింది

ఈ కొత్త ఫిట్ నెస్ ట్రాకర్ ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది

అడ్వాన్స్డ్ AI-powered హెల్త్ ట్రాకింగ్, స్లీప్ అనాలిసిస్ మరియు ఫిట్ నెస్ కోచింగ్ వంటి అన్ని పనులు చేస్తుంది

Google Fitbit Air: ఫిట్‌ నెస్ ట్రాకర్లు అంటే సాధారణంగా స్క్రీన్ కలిగిన వాటిని మాత్రమే ఊహిస్తారు. నోటిఫికేషన్ మరియు పెద్ద స్క్రీన్ తో వాచ్ డిజైన్ కలిగి ఉంటాయని మనం గుర్తు చేసుకుంటాం. కానీ, ఇప్పుడు గూగుల్ ఎవరు ఊహించని విధంగా స్క్రీన్ లేకుండా AI ఫిట్‌ నెస్ ట్రాకర్ గూగుల్ ఫిట్ బిట్ ఎయిర్ ను విడుదల చేసింది. ఈ కొత్త ఫిట్ నెస్ ట్రాకర్ ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది సాధారణ స్మార్ట్ వాచ్ మాదిరిగా ఉండదు. కానీ, ఇది అడ్వాన్స్డ్ AI-powered హెల్త్ ట్రాకింగ్, స్లీప్ అనాలిసిస్ మరియు ఫిట్ నెస్ కోచింగ్ వంటి అన్ని పనులు చేస్తుంది.

Google Fitbit Air: ఏమిటి ఈ కొత్త ఫిట్ నెస్ బ్రాండ్?

లైట్ వెయిట్ తో ఎప్పుడు చేతికి ధరించి ఉండడానికి వీలుగా గూగుల్ అందించిన కొత్త ఫిట్ నెస్ ట్రాకర్ గూగుల్ ఫిట్ బిట్ ఎయిర్. ఇది కొత్త తరం స్క్రీన్ లెస్ ఫిట్ నెస్ ట్రాకర్ మరియు ఇది ద్యాస మరల్చే ఇబ్బంది లేని విధంగా రూపొందించబడింది. అంటే, స్మార్ట్ వాచ్ లో వచ్చే నోటిఫికేషన్, కాల్స్ మరియు యాప్స్ వంటి వాటి బెడద లేకుండా పూర్తిగా ఫిట్ నెస్ పై ధ్యాస ఉండేలా ఇది రూపొందించబడింది.

Google Fitbit Air: ప్రత్యేకత ఏమిటి?

గూగుల్ ఫిట్ బిట్ ఎయిర్ ఫిట్ నెస్ ట్రాకర్ హెల్త్ ట్రాకింగ్, స్లీప్ మోనిటరింగ్, Ai ఫిట్ నెస్ కోచ్ మరియు వెల్ నెస్ ఇన్ సైట్స్ తో వస్తుంది. గూగుల్ ఈ ఫిట్ నెస్ ట్రాకర్ ను “ప్రోఆక్టివ్ వెల్ నెస్ పార్ట్నర్” గా ఆ అభివర్ణించింది. దీని డిజైన్ విషయానికి వస్తే, ఇది పెబుల్ స్టైల్ కాంపాక్ట్ డిజైన్ తో వస్తుంది. అయితే, ఇది స్క్రీన్ లేకుండా ఉంటుంది. గూగుల్ ఈ ఫిట్ నెస్ ట్రాకర్ ను చాలా తేలికైన డిజైన్ తో రూపొందించింది. అందుకే, ఈ ఫిట్ నెస్ ట్రాకర్ ను రోజంతా మరియు రాత్రంతా ధరించేందుకు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుందని గూగుల్ తెలిపింది.

ఇందులో స్క్రీన్ ఎందుకు లేదు?

ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, ఈ స్క్రీన్ తో ఉండే ట్రాకర్స్ లో వచ్చే నోటిఫికేషన్, కాల్స్ మరియు యాప్స్ తో యూజర్లు డిస్ట్రాక్ట్ అవుతారు. అందుకే, ఎటువంటి ఈ ఫిట్ నెస్ ట్రాకర్ ను లివ్ ఇందు ది మూమెంట్ కాన్సెప్ట్ తో గూగుల్ అందించింది.

Also Read: Oppo Find X9 Ultra : 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 200MP కెమెరాతో వస్తోంది.!

హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఏమిటి?

ఈ కొత్త గూగుల్ ఫిట్ నెస్ ట్రాకర్ చాలా చిన్నగా ఉన్నా కూడా గూగుల్ ఇందులో చాలా అడ్వాన్స్డ్ సెన్సార్లు అందించింది. ఇందులో 24/7 హార్ట్ రేట్ మోనిటర్, SpO2 బ్లడ్ ఆక్సిజన్, ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ డిటెక్షన్ (Afib Alerts) సపోర్ట్ కూడా ఉంది. అంతేకాదు, ఇందులో స్లీప్ ట్రాకింగ్ తో పాటు AI ఆధారంగా స్లీప్ ఇన్ సైట్స్ కూడా అందిస్తుంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ ట్రాకింగ్ ద్వారా స్ట్రెస్ రికవరీ అనాలిసిస్ కూడా చేయగలదు.

గూగుల్ ఇందులో అందించిన అసలు శక్తి AI ఫీచర్లు అని చెప్పవచ్చు. గూగుల్ కొత్తగా ఈ ఫిట్ నెస్ ట్రాకర్ లో Google Health Coach ను కూడా ప్రకటించింది. ఇందులో మీ రోజు వారి అలవాట్లు ఆధారంగా సజెషన్స్ వస్తాయి.

ప్రైస్

గూగుల్ ఫిట్ బిట్ ఎయిర్ ను US మార్కెట్ లో $129.99 (సుమారు రూ. 12268) ప్రైస్ తో లాంచ్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :